MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Health
  • ఆయుర్వేదం ప్రకారం.. సూర్యాస్తమయం తర్వాత వీటిని అసలే తినకూడదు.. తిన్నారో మీ పని అంతే..!

ఆయుర్వేదం ప్రకారం.. సూర్యాస్తమయం తర్వాత వీటిని అసలే తినకూడదు.. తిన్నారో మీ పని అంతే..!

గట్ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే సూర్యాస్తమయం తర్వాత కొన్ని ఆహారాలను అసలే తినకూడదు. ఒకవేళ తింటే ఎన్నో సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది.   

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Apr 03 2023, 03:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
gut health

gut health

గట్ ఆరోగ్యం మెరుగ్గా ఉంటేనే మన మొత్తం శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఆయుర్వేదం జీర్ణవ్యవస్థను మొత్తం ఆరోగ్యానికి మూలంగా భావిస్తుంది. ఆయుర్వేదం ప్రకారం.. మనం తినే విధానం ఎంత ముఖ్యమో  మనం ఏం తింటున్నామో కూడా అంతే ముఖ్యం. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
gut health

gut health

ఆయుర్వేదంలో సూర్యాస్తమయం తర్వాతి సమయాన్ని 'సంధ్యా కాలం' అంటారు. ఈ సమయంలో శరీరం జీర్ణక్రియ సహజంగా క్షీణించడం ప్రారంభిస్తుందని నమ్ముతారు. అంటే ఈ సమయంలో మనం తినే ఆహారం జీర్ణం కావడం కష్టం. అందుకే మంచి గట్ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సూర్యాస్తమయం తర్వాత కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలని ఆయుర్వేదం చెబుతోంది. అవేంటంటే..

36

ముడి ఆహారాలు 

ఆయుర్వేదం ప్రకారం.. సూర్యాస్తమయం తర్వాత ముడి ఆహారాన్ని తినడం మానుకోవాలి. ఎందుకంటే అవి జీర్ణం కావడం చాలా కష్టం. సలాడ్లు, పచ్చి కూరగాయలు, పండ్లు వంటి ముడి ఆహారాలకు జీర్ణ శక్తి చాలా అవసరం. అందులోనూ వీటిని రాత్రిపూట తింటే కడుపు ఉబ్బరం, అజీర్థి, గ్యాస్ట్రిక్ వంటి సమస్యలు వస్తాయి. అందుకే వీటికి బదులుగా కాల్చిన లేదా ఉడకబెట్టిన కూరగాయలు, ఉడకబెట్టిన పండ్లను తినండి. 

46

జిడ్డుగల ఆహారాలు 

సూర్యాస్తమయం తర్వాత హెవీ లేదా ఆయిలీ ఫుడ్స్ కు  దూరంగా ఉండాలని ఆయుర్వేదం చెబుతోంది. వేయించిన ఆహారం, జున్ను, ఎర్ర మాంసం వంటి ఆహారాలు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. వీటిని తింటే కడుపు బరువుగా అనిపిస్తుంది. ఈ ఆహారాలు శరీర సహజ లయకు భంగం కలిగిస్తాయి. అంతేకాదు రాత్రిళ్లు మీకు గాఢ నిద్రలేకుండా చేస్తాయి. అందుకే వీటికి బదులుగా సూప్లు, కాయధాన్యాలు, ధాన్యాలు వంటి తేలికపాటి, సులభంగా జీర్ణమయ్యే ఆహారాలనే తినాలని ఆయుర్వేదం సిఫార్సు చేస్తోంది.

56

స్పైసీ ఫుడ్స్ 

సుగంధ ద్రవ్యాలు జీర్ణవ్యవస్థను ఉత్తేజపరుస్తాయి.  అలాగే యాసిడ్ రిఫ్లక్స్, గుండెల్లో మంట, అజీర్ణానికి కారణమవుతాయి. అందుకే ఆయుర్వేదం సాయంత్రం పూట మసాలా ఆహారాలను తగ్గించాలని చెబుతోంది. వీటికి బదులుగా జీలకర్ర, కొత్తిమీర, సోంపు వంటి తేలికపాటి మసాలాలను ఎంచుకోవాలని సిఫార్సు చేస్తోంది.

66

కెఫిన్, ఆల్కహాల్ 

కెఫిన్, ఆల్కహాల్ రెండూ శరీర సహజ నిద్ర చక్రానికి ఆటంకం కలిగిస్తాయి. అంతేకాదు ఇవి జీర్ణవ్యవస్థపై కూడా ప్రభావాన్ని చూపుతాయి. అందుకే వీటికి బదులుగా చామంతి టీ, పుదీనా వంటి మూలికా టీలను తాగండి. ఇవి విశ్రాంతిని ప్రోత్సహించడానికి, జీర్ణక్రియకు సహాయపడతాయి. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
నీళ్లు తాగిన వెంటనే పరిగెత్తితే క‌డుపులో ఒక‌వైపు నొప్పి ఎందుకు వస్తుంది? దీనికి కార‌ణం ఏంటంటే?
Recommended image2
ఆల్క‌హాల్ తాగిన తర్వాత ట్యాబ్లెట్స్‌ వేసుకోవచ్చా? వైద్యులు ఏమంటున్నారంటే..
Recommended image3
Blood Pressure: బీపీ మిష‌న్ ఎలా ప‌నిచేస్తుంది.? దీని వెన‌కాల ఉన్న మెకానిజం ఏంటో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved