MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Astrology
  • Second Marriage: ఈ 4 రాశుల వారికి రెండో పెళ్లి జరిగే అవకాశాలు ఎక్కువ, ఎందుకంటే...

Second Marriage: ఈ 4 రాశుల వారికి రెండో పెళ్లి జరిగే అవకాశాలు ఎక్కువ, ఎందుకంటే...

Second Marriage: జ్యోతిష్య శాస్త్రం కొన్ని విషయాలను ముందుగానే అంచనా వేసి చెప్పగలదు. అలాగే 12 రాశులలో ఎక్కువగా రెండో పెళ్లి జరిగే ఛాన్స్ 4 రాశుల వారికే ఎక్కువ. ఆ రాశులేవో తెలుసుకోండి.

2 Min read
Author : Haritha Chappa
Published : Sep 21 2026, 10:35 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
వృషభ రాశి
Image Credit : Getty

వృషభ రాశి

వృషభ రాశిని పాలించేది శుక్రుడు. ఈ రాశి వారు తమ బంధాల్లో ఎప్పుడూ భద్రత, స్థిరత్వం కోరుకుంటారు. అంతేకాదు ఎంతో నమ్మకస్తులుగా కూడ ఉంటారు. కానీ మొదటి పెళ్లిలో వీరికి సంతృప్తి, భద్రత దొరకకపోతే మాత్రం ఎలాంటి నిర్ణయమైనా తీసుకుంటారు. సంతోషం, మానసిక ప్రశాంతత విషయంలో ఈ రాశి వారు ఏ మాత్రం రాజీ పడరు. తమకు ప్రశాంతతను ఇచ్చే మరో భాగస్వామిని వెతుక్కునేందుకు సిద్ధంగా ఉంటారు. అందుకే వీరికి రెండో పెళ్లి జరిగే అవకాశాలు అధికంగా ఉంటాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
తులా రాశి
Image Credit : Gemini Ai

తులా రాశి

తులా రాశి వారిపై శుక్రుడి ప్రభావం అధికంగా ఉంటుంది. ఈ రాశి వారి జీవితంలో బ్యాలెన్స్ కోరుకుంటారు. ఒకరికొకరు సర్దుకుపోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. భార్యాభర్తల మధ్య ప్రేమ, అవగాహన లేకపోతే తులా రాశివారు ఆ బంధంలో ఎక్కువ కాలం ఉండలేరు. మొదటి పెళ్లిలో తాము ఆశించిన ప్రశాంతత దొరకకపోతే రెండో పెళ్లి చేసుకునేందుకు ఏమాత్రం వెనుకాడరు.

34
వృశ్చిక రాశి
Image Credit : Asianet News

వృశ్చిక రాశి

ధైర్యానికి ప్రతీక అయిన కుజుడు వృశ్చిక రాశిని పాలిస్తాడు. అందుకే ఈ రాశి వారు చాలా ఎమోషనల్ గా ఉంటారు. బంధాల్లో ఎక్కువ ప్రేమను, గుర్తింపును ఆశిస్తారు. ఇతరులపై తాము చూపే ప్రేమకు సరైన విలువ దొరకకపోయినా, మానసికంగా గుర్తింపు లేకపోయినా ఆ బంధాన్ని విడిచిపెట్టేందుకు సిద్ధంగా ఉంటారు. తమ మనసును అర్థం చేసుకుని, తమ ఎమోషన్స్ కు తగ్గట్లుగా ఉండే సరైన భాగస్వామిని వెతుక్కోవడంలో వీరు చాలా పక్కాగా ఉంటారు.

44
ధనుస్సు రాశి
Image Credit : Getty

ధనుస్సు రాశి

జ్ఞానానికి ప్రతీక గురు భగవానుడు. ఇతడే ధనుస్సు రాశిని పాలిస్తాడు. ఈ రాశి వారు తమ వ్యక్తిగత స్వేచ్ఛకు మొదటి ప్రాధాన్యత ఇస్తారు. పెళ్లి బంధం తమ స్వేచ్ఛకు అడ్డుకట్ట వేస్తుందని అనిపిస్తే, ఆ బంధం నుంచి బయటకు రావడానికి ధనుస్సు రాశి వారు ఏమాత్రం ఆలోచించరు. సంప్రదాయాల పేరుతో కట్టడి చేసే కుటుంబ జీవితం కంటే, తమ లక్ష్యాలకు, స్వేచ్ఛకు విలువ ఇచ్చే జీవిత భాగస్వామిని ఎంపికచేసుకోవాలనుకుంటారు. అందుకే రెండో పెళ్లికి సిద్ధంగా ఉంటారు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఉద్యోగాలలో పదోన్నతులు.. ఆప్తుల నుంచి శుభవార్తలు!
Related Stories
Recommended image1
బిర్యానీ, పులావ్‌లలో ఉప్పు తగ్గి చప్పగా ఉన్నాయా? నిమిషంలో ఉప్పును సరిచేసే సింపుల్ ట్రిక్
Recommended image2
Fridge Explosion: ఇలాంటి తప్పులు చేస్తే ఇంట్లోని ఫ్రిజ్ పేలే అవకాశాలు ఎక్కువ, జాగ్రత్త
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved