MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Feature
  • ఈ దేశాల్లో మీరు బట్టలు బాల్కనీలో ఆరేసినా.. రూ.70వేలు జరిమానా కట్టాల్సిందే.. ఎందుకో తెలుసా?

ఈ దేశాల్లో మీరు బట్టలు బాల్కనీలో ఆరేసినా.. రూ.70వేలు జరిమానా కట్టాల్సిందే.. ఎందుకో తెలుసా?

మన దేశంలో ఎక్కడ పడితే అక్కడ బట్టలు ఆరేసుకుంటూ ఉంటాం. కానీ, ఇదే పని వేరే కొన్ని దేశాల్లో చేస్తే.. భారీగా ఫైన్ కట్టాల్సి వస్తుంది. ఆ దేశాలు ఏంటి? ఆ దేశాల్లో అలాంటి రూల్స్ ఎందుకు పెట్టారో తెలుసా?

2 Min read
Author : ramya Sridhar
Published : Sep 11 2026, 11:07 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
బాల్కనీలో బట్టలు ఆరేయడం నేరమా?
Image Credit : Gemini ai

బాల్కనీలో బట్టలు ఆరేయడం నేరమా?

ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాలు ఉన్నాయి. ప్రతి దేశంలోనూ ఏదో ఒక రూల్స్ ఉంటూనే ఉంటాయి. ఆ రూల్స్ ఫాలో అవ్వకపోతే.. భారీ జరిమానాలు కూడా విధిస్తూ ఉంటారు. అయితే.. మన దేశంలో చాలా నార్మల్ విషయాలు కూడా.. కొన్ని దేశాల్లో చాలా పెద్ద తప్పుగా పరిగణిస్తారు. ముఖ్యంగా బట్టలు ఆరేయడం విషయంలో అలాంటి రూల్స్ ఉంటాయి. మనం సాధారణంగా.. బట్టలను.. డాబా పైన, బాల్కనీలో ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ ఆరేస్తూ ఉంటాం. ఇది మన దగ్గర చాలా కామన్. కానీ, కొన్ని విదేశాల్లో మాత్రం బాల్కనీలోనో, కిటికీ బయటనో మీరు బట్టలు ఆరేస్తే.. భారీగా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. వినడానికి విచిత్రంగా అనిపించినా ఇది నిజం. మరి, ఏ దేశాల్లో ఈ రూల్ ఉంది? అక్కడ ఆ రూల్ ఎందుకు పెట్టారో తెలుసుకుందాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఈ దేశాల్లో బట్టలు ఆరేస్తే..,భారీ జరిమానా..
Image Credit : Gemini ai

ఈ దేశాల్లో బట్టలు ఆరేస్తే..,భారీ జరిమానా..

స్పెయిన్ (బార్సిలోనా, మాడ్రిడ్): స్పెయిన్‌లోని బార్సిలోనా నగరంలో రోడ్డు వైపు కనిపించేలా లేదా బయటి బాల్కనీల్లో బట్టలు ఆరేయడం చట్టరీత్యా నేరం. నగర అందాన్ని కాపాడటానికి ఈ రూల్ తీసుకొచ్చారు. దీనిని ఉల్లంఘిస్తే 750 యూరోల వరకు అంటే మన కరెన్సీలో సుమారు ₹70,000 కంటే ఎక్కువ జరిమానా విధించే అవకాశం ఉంది.

ఇటలీ (రోమ్, వెనిస్, నేపుల్స్): ఇటలీలోని చారిత్రక నగరాలు , పర్యాటక ప్రాంతాల్లో బిల్డింగ్ బయట లేదా రోడ్లకు అడ్డంగా తాళ్లు కట్టి బట్టలు ఆరేయడంపై నిషేధం ఉంది. అక్కడ నగర ప్రశాంతతను, పర్యాటక ఆకర్షణను దెబ్బతీసే చర్యగా దీనిని భావిస్తారు. భారీ జరిమానా విధిస్తూ ఉంటారు.

అమెరికా USA - HOA నిబంధనలు: అమెరికాలోని కొన్ని నివాస సముదాయాల్లో (Homeowners Associations - HOA) కాలనీ అందం దెబ్బతింటుందని, ఆస్తుల రీసేల్ విలువ తగ్గుతుందనే కారణంతో బయట బట్టలు ఆరేయనివ్వరు. కచ్చితంగా డ్రైయర్లు మాత్రమే వాడాలనే నిబంధన ఉంటుంది.

Related Articles

Related image1
Motivational Story: నిజమైన బలవంతుడు ఎవరు..? మీ ఆలోచనను మార్చే కథ ఇది..!
Related image2
Pearl Ring: చేతుల అందాన్ని పెంచే ముత్యాల ఉంగరాలు.. చూసేయండి
33
ఈ విచిత్రమైన రూల్ వెనుక ముఖ్య కారణాలు:
Image Credit : Gemini ai

ఈ విచిత్రమైన రూల్ వెనుక ముఖ్య కారణాలు:

ఈ ప్రదేశాలన్నీ దాదాపు టూరిస్టు ప్లేసులే. ఇక్కడికి వివిధ దేశాల నుంచి ప్రజలు వస్తూనే ఉంటారు. అలా.. చూడటానికి వచ్చిన వారికి నగరం అందంగా కనపడాల్సింది పోయి... ఇలా బట్టలు ఆరేసి ఉంటే చూడటానికి అస్సలు బాగోదు. దీని వల్ల పర్యాటక ప్రాంతాలు, చారిత్రక కట్టడాల లుక్ కూడా దెబ్బ తింటుంది. అందుకే.. ఇలాంటి రూల్స్ పెట్టారు.

అంతేకాదు.. భారీ ఈదురుగాలులకు బట్టలు లేదా తాళ్లు తెగి కిందపడి వీధిలో వెళ్లే వాహనాదారులకు లేదా కాలినడకన వెళ్లేవారికి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని.. దానిని నివారించడానికి కూడా ఇలాంటి రూల్స్ పెట్టడం విశేషం.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Farmer Success Story: ఒక ఎకరం పొలంలో రోజుకు 12 వేల ఆదాయం.. ఈ యువరైతు ఎలా సంపాదిస్తున్నాడో తెలుసా?
Recommended image2
Snake Bite First Aid : పాము, తేలు, జెర్రి... ఈ విషపూరిత జీవులు కాటేయగానే ఏం చేయకూడదు? ఏం చేయాలి?
Recommended image3
అంత్య‌క్రియల‌ స‌మ‌యంలో.. మ‌ర‌ణించిన వ్య‌క్తి నోట్లో బంగారం ఎందుకు పెడతారో తెలుసా?
Related Stories
Recommended image1
Motivational Story: నిజమైన బలవంతుడు ఎవరు..? మీ ఆలోచనను మార్చే కథ ఇది..!
Recommended image2
Pearl Ring: చేతుల అందాన్ని పెంచే ముత్యాల ఉంగరాలు.. చూసేయండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved