MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • School Bus : అమెరికా నుండి అమీర్ పేట వరకు స్కూల్ బస్సులు పసుపు రంగులోనే ఎందుకుంటాయి? టాప్ 5 సైంటిఫిక్ రీజన్స్

School Bus : అమెరికా నుండి అమీర్ పేట వరకు స్కూల్ బస్సులు పసుపు రంగులోనే ఎందుకుంటాయి? టాప్ 5 సైంటిఫిక్ రీజన్స్

రోడ్డుపై వెళుతున్నప్పుడో లేదా మీ పిల్లలను స్కూల్ కి పంపుతున్నప్పుడో విద్యార్థులు ప్రయాణించే బస్సులను చూస్తే ఓ డౌట్ వస్తుంది... ఈ బస్సులన్ని పసుపు రంగులోనే ఎందుకు ఉంటాయని. అయితే స్కూల్ బస్సు రంగు వెనక శాస్త్రీయ కారణాలు దాగున్నాయి, అవేంటో తెలుసుకుందాం.

2 Min read
Author : Arun Kumar P
Published : Sep 01 2026, 11:07 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
స్కూల్ బస్సులకు పసుపు రంగే ఎందుకు?
Image Credit : Gemini AI

స్కూల్ బస్సులకు పసుపు రంగే ఎందుకు?

ప్రపంచవ్యాప్తంగా ఒక్కో దేశంలో ఒక్కో రకమైన విద్యా వ్యవస్థలు ఉన్నాయి... కానీ అన్ని దేశాల్లో ఒకే రకమైన స్కూల్ బస్సులు ఉంటాయి. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా రోడ్డుపై పసుపు రంగు బస్సు కనిపిస్తే చాలు... అది పక్కా స్కూల్ బస్సే. ఇలా ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా స్కూల్ బస్సులు ఇదే రంగులో ఉంటాయి. అయితే స్కూల్ బస్సులు పసుపు రంగు ఉండటం ఏదో ఫ్యాషన్ కోసం కాదు… ఇందుకు సైంటిపిక్ రీజన్స్ ఉన్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
స్కూల్ బస్సులకు పసుపు రంగు వెనకున్న టాప్ రీజన్స్
Image Credit : Chatgpt

స్కూల్ బస్సులకు పసుపు రంగు వెనకున్న టాప్ రీజన్స్

1. పసుపు రంగు సులభంగా కనిపిస్తుంది

సైన్స్ ప్రకారం... ఇతర రంగుల కంటే పసుపు రంగు 1.24 రెట్లు వేగంగా మనిషి కంటికి కనిపిస్తుంది. దూరం నుండి కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే విద్యార్థుల భద్రత దృష్ట్యా వారు ప్రయాణించే బస్సుకు పసుపు రంగు వేస్తారు.

2. పొగమంచు, వర్షంలోనూ కనిపించే రంగు పసుపు

చలికాలంలో దట్టమైన పొగమంచు, వర్షాకాలంలో భారీ వానలు పడుతుంటాయి. ఇలాంటి సమయంలోనే విద్యార్థులు ఉదయమే స్కూల్ కి వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఈ పొగమంచు, వానల సమయంలోనూ పసుపు రంగులో ఉండే స్కూల్ బస్సులు ఇతర వాహనాల డ్రైవర్లకు దూరంనుండే స్పష్టంగా కనిపిస్తాయి. దీంతో ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉండదు.

3. చీకట్లోనూ స్పష్టంగా కనిపించే రంగు పసుపు

పసుపు రంగుకు ఉన్న మరో ప్రత్యేకత చీకటిలోనూ కనిపిస్తుంది. స్పెషల్ క్లాసులు, ప్రత్యేక కార్యక్రమాల సమయంలో విద్యార్థులు రాత్రి వరకు స్కూల్లోనే ఉండాల్సి వస్తుంది. ఇలాంటి సమయాల్లో రాత్రుళ్లు విద్యార్థులు ప్రయాణించినా ఎలాంటి ప్రమాదాలకు అవకాశం ఉండకుండా బస్సు రంగు ఉపయోగపడుతుంది.

34
స్కూల్ బస్సుకు పసుపు రంగు వెనకున్న సైంటిఫిక్ రీజన్స్
Image Credit : Gemini AI

స్కూల్ బస్సుకు పసుపు రంగు వెనకున్న సైంటిఫిక్ రీజన్స్

4. పెరిఫెరల్ విజన్ (Peripheral Vision) : మనం నేరుగా చూస్తున్నప్పుడు కూడా మన కంటి అంచులతో చుట్టూ ఉన్నవాటిని గమనిస్తాం. దీన్నే పెరిఫెరల్ విజన్ అంటారు. ఇతర రంగులతో పోలిస్తే పసుపు రంగు ఈ పెరిఫెరల్ దృష్టిలో కూడా బాగా కనిపిస్తుందని ప్రయోగాలు నిరూపించాయి. దీంతో ఇతర డ్రైవర్లు స్కూల్ బస్సును దూరం నుంచే పసిగడతారు.

5. నలుపు అక్షరాలు స్పష్టంగా కనిపించడం : స్కూల్ బస్సుపై 'SCHOOL BUS' అని నలుపు రంగులో రాసి ఉంటుంది. పసుపు రంగు బ్యాక్‌గ్రౌండ్‌పై నలుపు అక్షరాలు చాలా స్పష్టంగా, బ్రైట్‌గా కనిపిస్తాయి. అందుకే దూరం నుంచి కూడా ఆ అక్షరాలను సులభంగా చదవొచ్చు.

44
స్కూల్ బస్సుల రంగు వెనక ఆసక్తికర స్టోరీ
Image Credit : Chatgpt

స్కూల్ బస్సుల రంగు వెనక ఆసక్తికర స్టోరీ

స్కూల్ బస్సులకు పసుపు రంగు వేసే కాన్సెప్ట్ అమెరికాలో మొదలయ్యింది. మొదట్లో స్కూల్ బస్సులు వివిధ రంగుల్లో ఉండేవి... స్కూల్ యాజమాన్యాలు తమకు ఇష్టమైన రంగులు వేసేవి. ఇది చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేది... ఏది స్కూల్ బస్సో, ఏది ప్యాసింజర్స్ బస్సో తెలిసేది కాదు. దీంతో దీనికి ఓ పరిష్కారం కనుక్కోవాలని ప్రొఫెసర్ ఫ్రాంక్ డబ్ల్యూ. సైర్ (Frank W. Cyr) భావించారు. ఆయన ఆలోచనే స్కూల్ బస్సులకు పసుపు రంగు వేయడం.

1939లో అమెరికాలో విద్యావ్యవస్థకు సంబంధించిన ఒక పెద్ద సదస్సు జరిగింది. ఇందులొ విద్యార్థుల భద్రత కోసం, దూరం నుంచి కూడా స్పష్టంగా కనిపించే రంగును స్కూల్ బస్సులకు ఎంపిక చేయాలని నిర్ణయించారు. అప్పుడే అనేక రంగులను పరిశీలించిన ప్రొఫెసర్ ఫ్రాంక్ డబ్ల్యూ. సైర్ ప్రత్యేకమైన పసుపు రంగును సూచించారు. దానికి 'నేషనల్ స్కూల్ బస్ గ్లాసీ యెల్లో' అని పేరు పెట్టారు. ఆ తర్వాత 1970లలో దీని పేరును 'నేషనల్ స్కూల్ బస్ క్రోమ్ యెల్లో'గా మార్చారు. అప్పటి నుంచి ఇదే సంప్రదాయం కొనసాగుతోంది.

ఇలా అమెరికాలో మొదలైన పసుపు రంగు స్కూల్ బస్సుల కల్చర్ యావత్ ప్రపంచానికి వ్యాపించింది... అన్ని దేశాల్లో ఇదే రంగు బస్సులను స్కూల్ యాజమాన్యాలు వాడుతున్నాయి. ఇలా పసుపు రంగు స్కూల్ బస్సులు కేవలం సంప్రదాయం కాదు, విద్యార్థుల రక్షణను దృష్టిలో ఉంచుకుని 90 ఏళ్లుగా కొనసాగుతున్న భద్రతా ప్రమాణం.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
విద్య
భారత దేశం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Vizag Beach: గోవా దేనికి గురూ? వైజాగ్ తీరంలో ఈ టాప్ 5 బీచ్ రిసార్ట్స్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే
Recommended image2
Fish: నదిలో పుట్టి.. సముద్రంలో పెరిగి, చావు కోసం మళ్లీ పుట్టిన నదికే వచ్చే చేప ఇది..!
Recommended image3
Psychology: సైకాలజీ ప్రకారం డబ్బు మనిషి ఆలోచనా విధానాన్ని ఎలా మార్చుతుందో తెలుసా?
Related Stories
Recommended image1
School Holidays : ఈ వారంలో ఇంకా మూడ్రోజులే స్కూళ్లు, కాలేజీలు నడిచేది.. తర్వాత వరుస సెలవులు, ఎన్నిరోజులో తెలుసా?
Recommended image2
School: స్కూల్ అనే పదానికి అర్ధం ఏంటి? ఏ భాష నుంచి పుట్టిందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved