MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Telangana
  • No Bag Day: స్కూల్ పిల్లలకు గుడ్ న్యూస్.. నెలకు ఒకరోజు నో బ్యాగ్ డే.. అసలు ఏంటిది?

No Bag Day: స్కూల్ పిల్లలకు గుడ్ న్యూస్.. నెలకు ఒకరోజు నో బ్యాగ్ డే.. అసలు ఏంటిది?

No Bag Day: తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు విద్యాశాఖ ఒక గుడ్ న్యూస్ చెప్పింది. పుస్తకాల మోత లేని ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు 'నో బ్యాగ్ డే' (No Bag Day) విధానాన్ని ప్రవేశపెట్టింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Aug 31 2026, 09:19 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఇక పుస్తకాల మోతకు బై బై.. సర్కారు బడి పిల్లలకు రిలీఫ్
Image Credit : Chatgpt

ఇక పుస్తకాల మోతకు బై బై.. సర్కారు బడి పిల్లలకు రిలీఫ్

రోజూ కిలోల కొద్దీ పుస్తకాలు మోసి మోసి అలసిపోతున్న సర్కారు బడి పిల్లలకు తెలంగాణ విద్యాశాఖ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. రోజువారీ చదువుల భారాన్ని తగ్గించి, పిల్లల్లో ఉన్న రియల్ టాలెంట్‌ను బయటకు తీసేందుకు విద్యాశాఖ ఒక క్రేజీ ప్లాన్‌తో ముందుకు వచ్చింది. అదే ‘టెన్ బ్యాగ్ లెస్ డేస్’ ప్రోగ్రామ్. 2026-27 అకడమిక్ ఇయర్‌కు సంబంధించి 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులందరికీ ఈ కొత్త రూల్ వర్తిస్తుందని స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ ఉత్తర్వులు జారీ చేసింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
నెలకు ఒక రోజు 'నో బ్యాగ్ డే'.. క్యాలెండర్ డేట్స్ ఇవే
Image Credit : Asianet News

నెలకు ఒక రోజు 'నో బ్యాగ్ డే'.. క్యాలెండర్ డేట్స్ ఇవే

ఈ కొత్త విధానంలో భాగంగా విద్యా సంవత్సరంలో మొత్తం 10 రోజులను 'నో బ్యాగ్ డే'లుగా కేటాయించారు. సాధారణంగా ప్రతి నెలా వచ్చే 3వ శనివారం రోజున పిల్లలు ఎలాంటి పుస్తకాల బ్యాగ్ తీసుకెళ్లకుండానే జాలీగా స్కూల్‌కి వెళ్లవచ్చు. 2026 సెప్టెంబర్ నుంచి 2027 మార్చి వరకు అమలు చేయాల్సిన ముఖ్యమైన తేదీలను కూడా విద్యాశాఖ ఇప్పటికే ఆఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. అవి

• సెప్టెంబర్ 19, 2026

• నవంబర్ 21, 2026

• డిసెంబర్ 19, 2026

• ఫిబ్రవరి 20, 2027

• మార్చి 20, 2027

ఈ ఫిక్స్ చేసిన డేట్స్ కాకుండా మిగిలిన 5 రోజులను స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఆయా పాఠశాలలే డిసైడ్ చేసుకునే వెసులుబాటు కల్పించారు.

35
స్కూల్లో పుస్తకాలు లేకపోతే ఏం చేస్తారంటే?
Image Credit : Gemini

స్కూల్లో పుస్తకాలు లేకపోతే ఏం చేస్తారంటే?

పుస్తకాలు లేవు కదా అని ఊరికే కూర్చోబెట్టరు.. ఈ ప్రత్యేక రోజుల్లో పిల్లల కోసం SCERT డిజైన్ చేసిన ప్రత్యేక మాడ్యూల్స్ ఆధారంగా యాక్టివిటీస్ నిర్వహిస్తారు.

• స్థానిక ప్రాంతాలకు ఫీల్డ్ విజిట్స్ వుంటాయి.

• లైవ్ సైన్స్ ప్రయోగాలు, క్విజ్ కాంపిటీషన్లు పెడతారు.

• బాలసభలు, డ్రాయింగ్, నాటికలు ఉంటాయి.

• మన ఊరి చేతివృత్తుల వారితో ఇంటరాక్షన్ ఉంటుంది.

• కొత్త స్కిల్స్ నేర్చుకోవడం, ఆటపాటలు

ఈ యాక్టివిటీస్ వల్ల కేవలం సబ్జెక్ట్ నాలెడ్జ్ మాత్రమే కాకుండా పిల్లల్లో అబ్జర్వేషన్, ప్రాక్టికల్ ఆలోచనలు, లీడర్‌షిప్ క్వాలిటీస్ బాగా పెరుగుతాయని అధికారులు చెప్తున్నారు.

45
టీచర్లు, అధికారులకు స్పెషల్ రెస్పాన్సిబిలిటీ
Image Credit : Gemini AI

టీచర్లు, అధికారులకు స్పెషల్ రెస్పాన్సిబిలిటీ

గతంలో కూడా ఈ 'నో బ్యాగ్ డే' ఆలోచన ఉన్నప్పటికీ సరిగ్గా ఇంప్లిమెంట్ కాలేదు. కానీ ఈసారి అలా కాకుండా చాలా సీరియస్‌గా పకడ్బందీగా అమలు చేయాలని విద్యాశాఖ ఆదేశించింది. ఆర్జేడీలు, డీఈవోలు, ఎంఈవోలతో పాటు హెడ్మాస్టర్లు, టీచర్లకు పూర్తి బాధ్యతలు అప్పగించారు.

• స్కూల్ లెవెల్‌లో ప్రత్యేక వార్షిక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి.

• అవుట్‌డోర్ ట్రిప్స్‌కి వెళ్లినప్పుడు పిల్లల సేఫ్టీకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి.

• దివ్యాంగ పిల్లలు కూడా అందరితో పాటు ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసేలా కేర్ తీసుకోవాలి.

• పిల్లలు నేర్చుకున్న విషయాలను టీచర్లు అసెస్ చేసి రిపోర్టులను డాక్యుమెంట్ చేయాల్సి ఉంటుంది.

55
స్టూడెంట్స్, పేరెంట్స్ హ్యాపీ
Image Credit : AI

స్టూడెంట్స్, పేరెంట్స్ హ్యాపీ

చదువు అంటే కేవలం క్లాస్‌రూమ్ కే పరిమితం కాకుండా, హోంవర్క్‌ల భారం లేకుండా పిల్లలు మైండ్ ఫ్రీగా ఆడుతూ పాడుతూ నేర్చుకునేలా ఈ విధానాన్ని డిజైన్ చేయడంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. విద్యాశాఖ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
తెలంగాణ
హైదరాబాద్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Konda Surekha: పదవి పోయిందని ఇంట్లో కూర్చోం.. కొండా సురేఖ కీల‌క వ్యాఖ్య‌లు
Recommended image2
హైద‌రాబాద్‌లో అత్యంత ఎత్తైన బిల్డింగ్స్ ఇవే.. 59 అంత‌స్తులతో మేఘాల‌ను తాకేలా
Recommended image3
Now Playing
Talasani As Revanth Reddy | Telangana Mock Assembly | KTR | KCR | Asianet News Telugu
Related Stories
Recommended image1
Mosquito Repellent Plants: వర్షాకాలంలో దోమల బెడదకు చెక్ పెట్టే అద్భుతమైన ఇండోర్ మొక్కలు ఇవే
Recommended image2
Weather Update: బంగాళాఖాతంలో అల్పపీడనం అలర్ట్.. ఈ ప్రాంతాల్లో మరో 3 రోజులు భారీ వర్షాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved