MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Yash Mother: అల్లు అరవింద్ కి యశ్ తల్లి కౌంటర్, మా వాడిని అణచాలని చూస్తున్నారా.. డబ్బున్నవాళ్ళ కొడుకు కాదు

Yash Mother: అల్లు అరవింద్ కి యశ్ తల్లి కౌంటర్, మా వాడిని అణచాలని చూస్తున్నారా.. డబ్బున్నవాళ్ళ కొడుకు కాదు

అల్లు అరవింద్ మూడేళ్ళ క్రితం చేసిన కామెంట్స్ కి హీరో యశ్ తల్లి కౌంటర్ ఇచ్చారు. టాక్సిక్ పై జరుగుతున్న ట్రోలింగ్ నేపథ్యంలో యశ్ తల్లి పుష్ప సంచలన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

2 Min read
Author : Tirumala Dornala
Published : Aug 31 2026, 09:29 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Yash
Image Credit : Asianet News

Yash

రాకింగ్ స్టార్ యశ్ నటించిన పాన్ ఇండియా మూవీ టాక్సిక్ ఆగష్టు 26న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అత్యంత భారీ బడ్జెట్ లో, పలువురు స్టార్ హీరోయిన్లు యశ్ తో నటించిన ఈ చిత్రానికి తొలి షో నుంచే నెగిటివ్ టాక్ మొదలైంది. గీతూ మోహన్ దాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి నెగిటివ్ టాక్ రావడంతో పాటు యశ్, గీతూ మోహన్ దాస్ పై ట్రోలింగ్ కూడా జరుగుతోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
టాక్సిక్ పై ట్రోలింగ్
Image Credit : Facebook

టాక్సిక్ పై ట్రోలింగ్

ఈ మూవీలో రొమాంటిక్ సీన్లు, యాక్షన్ సీన్లు తప్ప కథలో బలం లేదు అని ట్రోల్ చేస్తున్నారు. యశ్ పై జరుగుతున్న ట్రోలింగ్ పై అతడి తల్లి పుష్ప తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఘాటుగా స్పందించారు. మూడేళ్ళ క్రితం అల్లు అరవింద్ ఓ ఈవెంట్ లో మాట్లాడుతూ.. అసలు కేజీఎఫ్ రాకముందు యశ్ ఎవరు ? కేజీఎఫ్ కి ముందు అతను పెద్ద హీరోనా ? అని అల్లు అరవింద్ కామెంట్స్ చేశారు. హీరోల రెమ్యునరేషన్స్ గురించి మాట్లాడే క్రమంలో అల్లు అరవింద్ యశ్ గురించి అలా అన్నారు.

35
అల్లు అరవింద్ కి యశ్ తల్లి కౌంటర్
Image Credit : X

అల్లు అరవింద్ కి యశ్ తల్లి కౌంటర్

హీరోలతో సంబంధం లేకుండా సినిమాని భారీగా చూపిస్తేనే ఆదరిస్తున్నారు అంటూ అల్లు అరవింద్ పేర్కొన్నారు. అల్లు అరవింద్ కామెంట్స్ కి కూడా తాజాగా యశ్ తల్లి పుష్ప కౌంటర్ ఇచ్చారు. పుష్ప మాట్లాడుతూ కొంతమంది కేజీఎఫ్ కి ముందు యశ్ ఎవరు ? ఎక్కడి నుంచి వచ్చారు అని అడుగుతున్నారు. వాళ్లకు కాస్తైనా మనసుండాలి. యశ్ సాధారణ కుటుంబంలో పుట్టి కేజీఎఫ్ కంటే ముందు పెద్ద హిట్లు కొట్టాడు. అతడేమీ ఉగ్రవాది కాదు.

45
యశ్ ని అణచలేరు
Image Credit : Instagram

యశ్ ని అణచలేరు

టాక్సిక్ మూవీపై ట్రోల్ చేస్తున్న వారికి కూడా పుష్ప గట్టిగా సమాధానం ఇచ్చారు. నా కొడుకు డబ్బున్న కుటుంబం నుంచి రాలేదు. వాడిని చూసి కొందరు ఎందుకు అంత భయాడుతున్నారు. ఉద్దేశ పూర్వకంగానే యశ్ ని అణచాలని చూస్తున్నారు. కానీ ప్రేక్షకుల అభిమానం ఉన్నంతవరకు యశ్ ఎదుగుతూనే ఉంటాడు. అతడి ఎదుగుదలకి మీరు అడ్డుకోలేరు అంటూ పుష్ప ఘాటుగా సమాధానం ఇచ్చారు.

55
తల్లిగా నా బాధ్యత
Image Credit : Facebook

తల్లిగా నా బాధ్యత

యశ్ పై జరుగుతున్న కుట్రలపై మాట్లాడడం నా బాధ్యత. అందుకే మాట్లాడుతున్నా. పేద కుటుంబం నుంచి వచ్చిన యశ్ ని చూసి మీరు అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కేజీఎఫ్ కి ముందు యశ్ ఏంటి అని అడిగిన వాళ్లకు ఇదే నా సమాధానం. వాళ్ళ లాగా డబ్బుతో యశ్ రాలేదు అంటూ పుష్ప బదులిచ్చారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: రోహిత్ రొట్టగ్యాంగ్, నోరు జారిన త్రిగుణ్, షాలినీ వర్సెస్ నీతూ, ఆరో వారం నామినేషన్స్‌లో పీక్స్‌కి చేరిన రచ్చ..
Recommended image2
Jailer 2 Review: జైలర్‌ 2 ఫస్ట్ రివ్యూ.. ముత్తువేల్‌ పాండియన్‌గా రజనీ విశ్వరూపం, కానీ మైనస్‌ ఏంటంటే?
Recommended image3
Villains Turned Comedians: ఒకప్పుడు టెర్రర్ విలన్లు.. ఇప్పుడు కామెడీ స్టార్స్! రూటు మార్చిన 5గురు నటులు
Related Stories
Recommended image1
OTT Movies: పవర్ ఫుల్ థ్రిల్లర్ తో తాప్సి రెడీ, నత్తి ఉండే అమ్మాయి కోర్ట్ లో ఎలా..ఈ వారం ఓటీటీ మూవీస్ ఇవే
Recommended image2
Ram Charan: అది బ్యాడ్ మూవీ కాదు, రాంచరణ్ సినిమాపై డైరెక్టర్ కామెంట్స్.. స్టైలిష్ గా ఉంటుంది, అయినా ఫ్లాప్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved