MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • School Holidays : ఈ వారంలో ఇంకా మూడ్రోజులే స్కూళ్లు, కాలేజీలు నడిచేది.. తర్వాత వరుస సెలవులు, ఎన్నిరోజులో తెలుసా?

School Holidays : ఈ వారంలో ఇంకా మూడ్రోజులే స్కూళ్లు, కాలేజీలు నడిచేది.. తర్వాత వరుస సెలవులు, ఎన్నిరోజులో తెలుసా?

వరుస సెలవులతో ఈ వీకెండ్ కూడాా లాంగ్ వీకెండ్ గా మారనుంది. సెప్టెంబర్ లో ఫస్ట్ మూడు రోజులే ఫుల్ వర్కింగ్ డేస్… తర్వాత మూడ్రోజులు సెలవులే… ఏరోజు, ఎందుకు సెలవుందో తెలుసా?

2 Min read
Author : Arun Kumar P
Published : Aug 31 2026, 06:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
సెప్టెంబర్ లోనూ సెలవులే సెలవులు
Image Credit : Getty

సెప్టెంబర్ లోనూ సెలవులే సెలవులు

School Holidays : ఇక ఆగస్ట్ 2026 ముగిసినట్లే... మరికొద్ది గంటల్లో సెప్టెంబర్ నెలలోకి అడుగుపెట్టబోతున్నాం. అయితే ఈ ఆగస్ట్ లో మాదిరిగానే సెప్టెంబర్ లోనూ స్కూళ్లు, కాలుజీలు, ఆఫీసులకు వరుస సెలవులు రాబోతున్నాయి... ముఖ్యంగా ఈ నెల ఆరంభంలో వచ్చే సెలవుల గురించి తెలిస్తే విద్యార్థులు ఎగిరిగంతేస్తారు. ఒకటి రెండ్రోజులు కాదు వరుసగా మూడ్రోజుల సెలవులు వస్తున్నాయి... ఈసారి వీకెండ్ కాదు లాంగ్ వీకెండ్ రెడీగా ఉంది.

ఇవాళ ఆగస్ట్ 31 (సోమవారం) దాదాపు గడిచిపోయినట్లే... రేపు (మంగళవారం) సెప్టెంబర్ నెల ప్రారంభం. ఈ నెలలో ఫస్ట్ మూడ్రోజులే స్కూళ్లు, కాలేజీలకు ఫుల్ వర్కింగ్ డే... తర్వాత ఓ పండగ, ప్రత్యేక పర్వదినం, ఆదివారంతో కలిసి వస్తున్నాయి... దీంతో ఫస్ట్ వీక్ లోనే వరుస సెలవులు వస్తున్నాయి. మరి ఏరోజు, ఎందుకు సెలవు ఉందో ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
సెప్టెంబర్ 4న కృష్ణాష్టమి సెలవు
Image Credit : Gemini AI

సెప్టెంబర్ 4న కృష్ణాష్టమి సెలవు

హిందువుల ఆరాధ్యదైవం శ్రీ కృష్ణుడి జన్మదిన వేడుకను దేశవ్యాప్తంగా వైభవంగా జరుపుకుంటారు. తెలుగు ప్రజలు కూడా కృష్ణాష్టమి వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. అయితే ఈసారి సెప్టెంబర్ 4న (శుక్రవారం) కృష్ణాష్టమి వస్తోంది... అందుకే తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాలు ఈరోజు సెలవు ఇచ్చాయి. అంటే తెలుగు విద్యార్థులు, ఉపాధ్యాయులకే కాదు ఉద్యోగులకు కూడా ఈరోజు అధికారిక సెలవు ఉందన్నమాట.

అయితే కొన్ని విద్యాసంస్థల్లో కృష్ణాష్టమికి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు... ఇందులో భాగంగానే చిన్నారులతో శ్రీ కృష్ణుడు, గోపికల వేషం వేయిస్తారు. వారితో ఉట్టికొట్టించడం, కోలాటం ఆడించడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇలా కృష్ణాష్టమికి స్కూళ్లు నడిచినా క్లాసెస్ నిర్వహించరు... కేవలం వేడుకలను మాత్రమే నిర్వహిస్తారు.

34
సెప్టెంబర్ 5న టీచర్స్ డే
Image Credit : Getty

సెప్టెంబర్ 5న టీచర్స్ డే

కృష్ణాష్టమి తర్వాతిరోజు అంటే సెప్టెంబర్ 5న (శనివారం) టీచర్స్ డే (ఉపాధ్యాయ దినోత్సవం). ప్రతి సంవత్సరం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటారు. ఈరోజు విద్యాసంస్థల్లో ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయి.. కొన్నిచోట్ల విద్యార్థులే టీచర్లుగా మారి పాఠశాలను నడిపిస్తారు. ఇలా టీచర్స్ డే ని తెలుగు విద్యార్థులు కూడా చాలా ప్రత్యేకంగా జరుపుకుంటారు... కాబట్టి చాలా స్కూల్స్ లో క్లాసెస్ జరిగే అవకాశాలుండవు.

ఇక హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో ఐటీ, కార్పోరేట్ ఉద్యోగులకు వీకెండ్ రెండ్రోజులు సెలవు ఉంటుంది. ఇలాంటి ఉద్యోగుల పిల్లలు ఎక్కువగా చదివే విద్యాసంస్థలకు కూడా ప్రతి శని, ఆదివారం సెలవులుంటాయి. కాబట్టి టీచర్స్ డే సందర్భంగా కొందరికి, వీకెండ్ సందర్భంగా మరికొందరికి సెప్టెంబర్ 5న సెలవుండే అవకాశాలున్నాయి. అయితే ఈ సెలవు అన్ని విద్యాసంస్థలకు ఉండవని విద్యార్థులు గమనించాలి.

44
సెప్టెంబర్ 6న సాధారణ సెలవు
Image Credit : Getty

సెప్టెంబర్ 6న సాధారణ సెలవు

కృష్ణాష్టమి, టీచర్స్ డే ఆదివారంతో కలిసివస్తున్నాయి... అందుకే వరుసగా మూడ్రోజులు సెలవులు రాబోతున్నాయి. సెప్టెంబర్ 4, 5 తేదీల్లో సెలవుండే వారికి సెప్టెంబర్ 6న సాధారణ సెలవుతో వీకెండ్ కాస్త లాంగ్ వీకెండ్ గా మారుతోంది. వరుస సెలవుల్లో విద్యార్థులు, ఉద్యోగులు హ్యాపీగా గడిపేందుకు, ఫ్యామిలీతో ఎంజాయ్ చేసేందుకు సిద్దమవుతున్నారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
భారతదేశంలో ప్రభుత్వ సెలవులు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Heavy Rain Alert : బంగాళాఖాతంలో తుపాను లోడ్ అవుతోందా? ఈ ప్రాంతాల్లో అతిభారీ వర్షాలతో అల్లకల్లోలం తప్పదా?
Recommended image2
9 రోజులు.. కానీ 8 నైవేద్యాలే.. బతుకమ్మ వేడుకల్లో ఒక రోజు నైవేద్యం ఎందుకు ఉండదో తెలుసా?
Recommended image3
Dasara Special Trains: గుడ్ న్యూస్ చెప్పిన భారతీయ రైల్వే.. దసరా బతుకమ్మ ప్రత్యేక రైళ్లు
Related Stories
Recommended image1
September Holidays : సెప్టెంబర్ లో స్కూళ్ళు, కాలేజీలు, ఆఫీసులకు వచ్చే వరుస సెలవులు, లాంగ్ వీకెండ్స్ ఇవే
Recommended image2
School: స్కూల్ అనే పదానికి అర్ధం ఏంటి? ఏ భాష నుంచి పుట్టిందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved