MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Dangerous Island: ఇక్కడికి వెళ్తే శవం కూడా దొరకదు! భారత్‌లోని అత్యంత భయంకరమైన ఐలాండ్ రహస్యాలివే !

Dangerous Island: ఇక్కడికి వెళ్తే శవం కూడా దొరకదు! భారత్‌లోని అత్యంత భయంకరమైన ఐలాండ్ రహస్యాలివే !

Dangerous Island: భారతదేశంలోని నార్త్ సెంటినెల్ ఐలాండ్ అత్యంత ప్రమాదకరమైన ప్రదేశంగా గుర్తింపు పొందింది. 60 వేల ఏళ్లుగా బయటి ప్రపంచానికి దూరంగా ఉన్న ఇక్కడి తెగ రహస్యాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Sep 01 2026, 11:06 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
భారతదేశంలోనే అత్యంత ప్రమాదకరమైన ద్వీపం.. అక్కడ అడుగుపెడితే చావే
Image Credit : Chatgpt

భారతదేశంలోనే అత్యంత ప్రమాదకరమైన ద్వీపం.. అక్కడ అడుగుపెడితే చావే

అండమాన్ నికోబార్ దీవుల మధ్య నీలి సముద్రంలో ఒక విచిత్రమైన, భయానక ప్రపంచం ఉంది. ఆధునిక సాంకేతికతకు, నేటి నాగరిక సమాజానికి ఇది చాలా దూరంగా ఉంటుంది. ఇది భారత్‌లోనే అత్యంత ప్రమాదకరమైన, రహస్యమైన ప్రదేశంగా గుర్తింపు పొందింది. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి 80 ఏళ్లు అవుతోంది.

ఈ ఇన్నేళ్లలో దేశంలోని మూ మూలలకు ఆధునిక పాలన, చట్టాలు, టెక్నాలజీ వ్యవస్థలు చేరాయి. కానీ, భారత పటంలో భాగమైనా కూడా ఏ ప్రభుత్వానికీ లొంగని ఒక రహస్య ద్వీపం ఉంది. తన ఇష్టానుసారం స్వతంత్రంగా జీవించే ఆ ప్రదేశం గురించి చాలామందికి తెలియదు. అక్కడ పాలన చేయడం అటుంచితే, ఆ ప్రజలను కనీసం సంప్రదించడం కూడా సాధ్యం కాలేదు. వారిని కలిసేందుకు వెళ్లిన వారు ప్రాణాలతో తిరిగి రాలేదు. ఆ మరణాల ద్వీపం విశేషాలు ఇప్పుడు చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఏమిటా ద్వీపం? 60,000 ఏళ్లుగా ఒంటరి జీవితం
Image Credit : our own

ఏమిటా ద్వీపం? 60,000 ఏళ్లుగా ఒంటరి జీవితం

అండమాన్ నికోబార్ దీవుల మధ్య ఉన్న ఈ భయంకర ప్రదేశమే ‘నార్త్ సెంటినెల్ ఐలాండ్’. ఆధునిక సాంకేతికతకు, నేటి సమాజానికి పూర్తిగా దూరంగా ఉండే అత్యంత ప్రమాదకర ప్రాంతం ఇది.

ఇక్కడ నివసించే వారిని ‘సెంటినెలీస్’ తెగ అంటారు. వీరు గత 60,000 ఏళ్లుగా బయటి ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేకుండా పూర్తిగా ఒంటరిగా జీవిస్తున్నారు. నేటి డిజిటల్ యుగంలో కూడా వీరు చరిత్ర పూర్వ యుగం నాటి మానవుల లాగే వేటాడుతూనే కాలం వెళ్లదీస్తున్నారు.

34
కనిపిస్తే చాలు బాణాల దాడి
Image Credit : others

కనిపిస్తే చాలు బాణాల దాడి

ఈ ద్వీప ప్రజలకు బయటి ప్రపంచ మానవులంటే తీవ్రమైన ద్వేషం, భయం. వారి ద్వీపానికి దగ్గరగా హెలికాప్టర్లు ఎగిరినా లేదా పడవలు వెళ్లినా సరే.. వారు విల్లు-బాణాలు, ఈటెలు, భయంకరమైన ఆయుధాలతో దాడి చేస్తారు.

వెళ్లిన వారు ఎవరూ తిరిగి రాలేదు

2006 లో అక్రమంగా చేపల వేట సాగిస్తున్న ఇద్దరు భారతీయ జాలర్ల పడవ ప్రమాదవశాత్తూ ఈ ద్వీపం తీరానికి కొట్టుకుపోయింది. దాంతో ఆ తెగ ప్రజలు ఆ ఇద్దరినీ దారుణంగా హత్య చేశారు.

తరువాత 2018 లో జాన్ అలెన్ చౌ అనే 26 ఏళ్ల అమెరికన్ క్రిస్టియన్ మత ప్రచారకుడు అక్రమంగా ఈ ద్వీపంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించాడు. సెంటినెలీస్ అతడిపై బాణాలతో దాడి చేసి చంపేశారు. చివరికి అతని మృతదేహాన్ని కూడా వెనక్కి తీసుకురావడం భారత ప్రభుత్వానికి సాధ్యం కాలేదు.

44
చట్టబద్ధమైన నిషేధం
Image Credit : PR

చట్టబద్ధమైన నిషేధం

పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకున్న కేంద్ర ప్రభుత్వం ఈ ద్వీపం చుట్టూ ఉన్న 5 కిలోమీటర్ల ప్రాంతాన్ని నిషేధిత ప్రాంతంగా ప్రకటించింది. భారత నౌకాదళం, కోస్ట్ గార్డ్ సిబ్బంది ఇక్కడ నిరంతరం కాపలా కాస్తుంటారు.

ఈ నిషేధానికి ముఖ్య కారణం ఏంటి?

ఈ నిబంధన కేవలం పర్యాటకుల రక్షణ కోసం మాత్రమే కాదు, ఆ తెగ ప్రజల రక్షణ కోసం కూడా పెట్టిందే. వారు వేలాది సంవత్సరాలుగా ప్రపంచానికి దూరంగా విడివిడిగా ఉన్నారు. అందువల్ల మనలో ఉండే సాధారణ జ్వరం, దగ్గు వంటి వైరస్‌లను తట్టుకునే రోగనిరోధక శక్తి వారి శరీరాల్లో లేదు. మనం వారి వద్దకు వెళ్తే, మన ద్వారా వ్యాపించే చిన్నపాటి వ్యాధి కూడా ఆ తెగ మొత్తాన్ని శాశ్వతంగా తుడిచిపెట్టే ప్రమాదం ఉంది. అందుకే ప్రభుత్వం ఈ ప్రాంతానికి వెళ్లడం పై నిషేధం విధించింది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
భారత దేశం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
మరణం తర్వాత మ‌నిషి శరీరంలో ఏం జరుగుతుంది? మొదట మారేది ఇదే..
Recommended image2
Godavari: గోదావరి నది సముద్రంలో కలిసే చోట కనిపించే అద్భుతం.. ‘అన్నా చెల్లెళ్ల గట్టు’
Recommended image3
Gold Hating Country: ఈ దేశంలో బంగారమంటేనే పడదు, గోల్డ్ జ్యూయలరీ వేసుకోవడం పెద్ద వింత
Related Stories
Recommended image1
Mosquito Repellent Plants: వర్షాకాలంలో దోమల బెడదకు చెక్ పెట్టే అద్భుతమైన ఇండోర్ మొక్కలు ఇవే
Recommended image2
Science Facts: 12 ఏళ్ల వయసులో అబ్బాయిలుగా మారే అమ్మాయిలు.. విచిత్ర గ్రామం ఇది !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved