MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Feature
  • School: స్కూల్ అనే పదానికి అర్ధం ఏంటి? ఏ భాష నుంచి పుట్టిందో తెలుసా?

School: స్కూల్ అనే పదానికి అర్ధం ఏంటి? ఏ భాష నుంచి పుట్టిందో తెలుసా?

School: ఈ స్కూల్ ఎవరు కనిపెట్టాడురా బాబోయ్ అని బాధపడుటుతంటారు కొంత మంది స్టూడెంట్స్. ఉదయాన్నే లేవాలి.. రెడీ అయ్యి స్కూల్ కు వెళ్లాలంటే బద్దకిస్తుంటారు. అసలు స్కూల్ అనే పదం ఎలా పుట్టిందో ఎప్పుడైనా ఆలోచించారా?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Aug 13 2026, 11:54 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
స్కూల్ అంటే ఒత్తిడిగా భావిస్తున్నారు..
Image Credit : Gemini AI

స్కూల్ అంటే ఒత్తిడిగా భావిస్తున్నారు..

ఆధునిక కాలంలో 'స్కూల్' (పాఠశాల) అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేవి కఠినమైన రూల్స్, పరీక్షలు, హోమ్‌వర్క్, క్రమశిక్షణ, రోజూ ఉదయాన్నే పరుగులు, టైమ్ కు వెళ్లాలని ఆరాటం, ఇవే గుర్తుకు వస్తుంటాయి. చదువును చాలామంది విద్యార్థులు ఒక పెద్ద బాధ్యతగా భావిస్తుంటారు. అందుకోసం చాలా ఒత్తిడిని భరిస్తుంటారు. అయితే అసలు 'స్కూల్' అనే పదానికి అర్ధం ఏంటో తెలుసా? ఇది ఎలా పుట్టిందనేది తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే! మనం ప్రస్తుతం భావించే నియంత్రణలకు, ఒత్తిళ్లకు పూర్తి భిన్నంగా... ఈ పదం 'ఖాళీ సమయం' లేదా 'విశ్రాంతి సమయం' (Leisure Time) అనే అర్థం నుండి పుట్టింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
స్కూల్ (School) అనే పదం ఎలా పుట్టింది?
Image Credit : Chatgpt

స్కూల్ (School) అనే పదం ఎలా పుట్టింది?

'స్కూల్' (School) అనే ఇంగ్లీష్ పదం ప్రాచీన గ్రీకు భాషలోని 'స్కోలే' (Schole / Skhole) అనే పదం నుండి వచ్చింది. ప్రాచీన గ్రీకులో 'స్కోలే' అంటే "విశ్రాంతి సమయం", "సమయాన్ని ఆహ్లాదకరంగా గడపడం" లేదా "స్వేచ్ఛా సమయం" అని అర్థం. ఆ తర్వాత ఈ పదం గ్రీకు నుండి లాటిన్ భాషలోకి 'స్కోలా' (Schola) గా మారిపోయింది. లాటిన్‌లో దీనికి "ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి నాలెడ్జ్ కోసం చర్చలు జరిపే ప్రదేశం" అనే అర్థం ఏర్పడింది. అక్కడి నుండి ఇంగ్లీష్ లోకి వచ్చే సరికి 'స్కూల్' (Scol) గా మారి.. చివరకు ఇప్పుడు 'School' గా స్థిరపడింది.

Related Articles

Related image1
Pawan Kalyan: రామ్ చరణ్ తో పాటు వరుణ్ తేజ్ ను కూడా బ్లాక్ మెయిల్ చేసిన పవన్ కళ్యాణ్, ఏందుకలా చేసేవాడంటే ?
Related image2
Asha Chocolate: 90s కిడ్స్ ఫేవరెట్ ఆశ చాక్లెట్ ఎందుకు ఆగిపోయింది? 10 దేశాల్లో అమ్ముడుపోయిన ఆశ ఎలా మాయమయ్యింది?
34
ప్రాచీన గ్రీకులో విద్యా విధానం
Image Credit : Gemini AI

ప్రాచీన గ్రీకులో విద్యా విధానం

ప్రాచీన గ్రీకు సమాజంలో ప్రజలు తమ రోజువారీ పనులు పూర్తి చేసుకున్న తర్వాత ఖాళీ టైమ్ ను 'స్కోలే'గా పిలిచేవారు. ఆ ఖాళీ సమయాన్ని ఊరికే వృథా చేయకుండా, జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఉపయోగించేవారు. అప్పటి ప్లేటో, అరిస్టాటిల్ వంటి గొప్ప తత్వవేత్తలు, ఆలోచనాపరులు ఒకచోట చేరి ప్రకృతి, రాజనీతి, తత్వశాస్త్రం వంటి అంశాలపై మేధోమథనం చేసేవారు. అప్పట్లో చదువు నేర్చుకోవడం అనేది ఒక నిర్బంధం కాదు, అది స్వేచ్చగా, ఖాళీ టైమ్ లో ఇష్టపూర్వకంగా చేసే వ్యాపకం. కానీ అది నేటి సమాజంలో ఎంత ఒత్తడిని పనిగా మారిందో అందరికి తెలుసు.

44
సూల్క్ ఎలా ఏర్పడ్డాయి..?
Image Credit : chatgpt

సూల్క్ ఎలా ఏర్పడ్డాయి..?

ఒకప్పుడు ఖాళీ సమయంలో నాలెడ్జ్ కోసం కేటాయించిన సమయం కాలక్రమంలో నిర్భంధంగా మారింది. మేధావులు, విద్యార్థులు కలిసి చర్చించుకునేందుకు ఉపయోగించిన ప్రదేశాలు క్రమబద్ధమైన విద్యాసంస్థలుగా రూపాంతరం చెందాయి. పారిశ్రామిక విప్లవం, ఆధునిక సమాజ అవసరాల వల్ల పాఠశాలల స్వభావం మారింది. స్వేచ్ఛగా సాగే చర్చల స్థానంలో ప్రత్యేక సిలబస్, టైమ్ రూల్స్, పరీక్షలు, తరగతి గదులు, గ్రేడుల వ్యవస్థ అమల్లోకి వచ్చాయి. దీనివల్ల 'స్కోలే' అనే పదానికి అర్ధం పూర్తిగా మారిపోయింది. స్కోలే లో స్వేచ్ఛగా ఇష్టంతో నాలెడ్జ్ ను నేర్చుకునేవారు. కానీ ఇప్పుడు అది ఒక క్రమశిక్షణా కేంద్రంగా మారింది.

స్కూల్ అనే పదానికి అర్థం 'స్వేచ్ఛా విశ్రాంతి సమయం' కాలక్రమేణా ఇలా తయారవుతుందని అప్పటి వారు అనుకోని ఉండరు. 'స్కూల్' పదం యొక్క ఈ మూలాలను గుర్తుచేసుకోవడం వల్ల మనకు ఒక ముఖ్యమైన విషయం అర్థమవుతుంది.. చదువు అనేది కేవలం పరీక్షల ఒత్తిడి కోసం చేసేది కాదు, అది మనస్సును వికసింపజేసే ఒక ఆహ్లాదకరమైన స్వేచ్ఛా జ్ఞాన ప్రయాణం కావాలి.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
విద్య
ఏషియానెట్ న్యూస్
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Motivational Story: మీ మంచిత‌నం మిమ్మ‌ల్ని ముంచేయ‌కూడ‌దు.. జీవితాన్ని మార్చే గొప్ప క‌థ‌
Recommended image2
Psychology: నచ్చినవాళ్లు మనల్ని పట్టించుకోకపోతే ఎందుకు బాధగా అనిపిస్తుంది? సైకాలజీ ఏం చెబుతోంది?
Recommended image3
స‌చిన్ టెండూల్క‌ర్‌కు ఎయిర్‌పోర్టులో మెట‌ల్ డిటెక్ట‌ర్ చెకింగ్ ఉండదు.. ఎందుకో తెలుసా.?
Related Stories
Recommended image1
Pawan Kalyan: రామ్ చరణ్ తో పాటు వరుణ్ తేజ్ ను కూడా బ్లాక్ మెయిల్ చేసిన పవన్ కళ్యాణ్, ఏందుకలా చేసేవాడంటే ?
Recommended image2
Asha Chocolate: 90s కిడ్స్ ఫేవరెట్ ఆశ చాక్లెట్ ఎందుకు ఆగిపోయింది? 10 దేశాల్లో అమ్ముడుపోయిన ఆశ ఎలా మాయమయ్యింది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved