MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • USA: అమెరికాలో డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే ఏమవుతుంది? శిక్షలు ఏ రేంజ్ లో ఉంటాయో తెలుసా?

USA: అమెరికాలో డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే ఏమవుతుంది? శిక్షలు ఏ రేంజ్ లో ఉంటాయో తెలుసా?

USA: మన దగ్గర తాగి బండి నడిపితే ఏం జరుగుతుందో అందరికి తెలుసు? డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లు ఎలా జరుగుతాయి.. అనేది అందరికి అనుభవమే. కానీ అమెరికాలో డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే ఏం జరుగుతుంది? ఏం చేస్తారు? శిక్షలు ఎలా ఉంటాయి?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 01 2026, 09:50 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
జీవితం ఊహించని మలుపు తిరుగుతుంది..
Image Credit : Gemini AI

జీవితం ఊహించని మలుపు తిరుగుతుంది..

అమెరికాలో డ్రైవింగ్ చేయడం అనేది కేవలం ఒక సౌకర్యం మాత్రమే కాదు, అది అత్యంత బాధ్యతతో కూడుకున్న విషయం. ఇతర దేశాలతో పోలిస్తే అమెరికాలో ట్రాఫిక్ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. ముఖ్యంగా మందుతాగి వాహనం నడిపే విషయంలో అమెరికా ప్రభుత్వం- పోలీసులు "జీరో టాలరెన్స్" వైఖరిని అవలంబిస్తారు. సోషల్ మీడియాలో నిత్యం చూస్తున్నట్లుగా, అమెరికాలో మందు తాగి డ్రైవింగ్ చేస్తూ దొరికిపోతే జీవితం ఊహించని మలుపు తిరుగుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
బాడీ-క్యామ్ రికార్డింగ్
Image Credit : Gemini AI

బాడీ-క్యామ్ రికార్డింగ్

అమెరికాలో మందు తాగి వాహనం నడుపుతూ పోలీసులకు చిక్కితే అక్కడ సర్దుబాట్లు ఉండదు, రాజీపడే అవకాశమే లేదు. వారితో వాదించడం, గొడవపడటం లాంటివి చేయకూడదు. చేస్తే విషయం ఇంకా సీరియస్ అయ్యే అవకాశం ఉంటుంది. పోలీసులు కారును ఆపిన క్షణం నుంచే తమ 'బాడీ కెమెరా' (Body Cam) ఆన్ చేసి ప్రతీ విషయాన్ని రికార్డ్ చేస్తారు. సస్పెక్ట్‌కు నేలపై నడవమని చెప్పడం (Field Sobriety Test) లేదా బ్రీత్ ఎనలైజర్ పరీక్ష నిర్వహిస్తారు. రక్తంలో ఆల్కహాల్ శాతం (BAC) 0.08% లేదా అంతకంటే ఎక్కువ ఉంటే, అక్కడికక్కడే చేతులకు సంకెళ్లు (Handcuffs) వేసి అరెస్ట్ చేస్తారు. వాహనాన్ని సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలిస్తారు.

35
భారీ జరిమానాలు ‌- జైలు శిక్ష
Image Credit : Gemini AI

భారీ జరిమానాలు ‌- జైలు శిక్ష

DUI కేసు నమోదైతే మొదటిసారి నేరానికి కూడా భారీగా ఫైన్ తో పాటు క్రిమినల్ శిక్షలు పడతాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ నేరం తీవ్రతను బట్టి $1,000 నుండి $10,000 డాలర్ల వరకు జరిమానా విధిస్తారు. అంతే కాదు మొదటిసారి నేరానికైనా కొన్ని రోజుల నుండి కొన్ని నెలల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఒకవేళ మందు మత్తులో యాక్సిడెంట్ జరిగి ఎవరికైనా గాయాలైతే అది 'ఫెలోని' (Felony) నేరంగా మారి ఏళ్ల తరబడి జైలు శిక్షకు దారితీస్తుంది. కేసు వాదించడానికి లాయర్ల ఫీజులు, కోర్టు ఖర్చులకు మరో $5,000 నుండి $15,000 వరకు అయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం.

డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తారా?

DUI కేసు పడిన వెంటనే సదరు వ్యక్తి డ్రైవింగ్ లైసెన్స్ కొన్ని నెలల నుండి సంవత్సరాల పాటు రద్దవుతుంది. లైసెన్స్ పునరుద్ధరించుకోవాలంటే కోర్టు ఆదేశాల ప్రకారం కారులో 'ఇగ్నిషన్ ఇంటర్‌లాక్ డివైజ్' (Ignition Interlock Device) అమర్చుకోవాలి. ఈ పరికరంలో ఊదితే ఆల్కహాల్ లేదని తేలితేనే కారు స్టార్ట్ అవుతుంది. దీని నెలవారీ నిర్వహణ ఖర్చు కూడా వాహనదారుడే భరించాలి.

45
NRI, విద్యార్థుల పరిస్థితి ఏంటి?
Image Credit : Gemini AI

NRI, విద్యార్థుల పరిస్థితి ఏంటి?

అమెరికాలో నివసిస్తున్న భారతీయ విద్యార్థులు ఉద్యోగులు (H-1B, L-1) DUI కేసుల్లో ఇరుక్కుంటే వారి వీసా స్టేటస్ తీవ్ర ప్రమాదంలో పడుతుంది. U.S. స్టేట్ డిపార్ట్‌మెంట్ నిబంధనల ప్రకారం DUI అరెస్ట్ కాగానే వీసా ఆటోమేటిక్‌గా రద్దయ్యే (Visa Revocation) అవకాశం ఉంటుంది. తిరిగి భారతదేశం వచ్చినప్పుడు వీసా స్టాంపింగ్ కావడం అత్యంత కష్టమవుతుంది. అంతేకాకుండా, గ్రీన్ కార్డ్ (PR) లేదా పౌరసత్వం పొందడంలో శాశ్వత అవరోధాలు ఏర్పడతాయి. భవిష్యత్తులో మంచి ఉద్యోగం రావడం కూడా కష్టమవుతుంది.

55
నేరం మాత్రమే కాదు
Image Credit : our own

నేరం మాత్రమే కాదు

అమెరికాలో "డ్రింక్ చేసి డ్రైవ్ చేయడం" అనేది కేవలం చట్టపరమైన నేరం మాత్రమే కాదు, అది మీ కెరీర్, ఆర్థిక స్థితి , భవిష్యత్తు ఆశయాలను నాశనం చేసే ఒక పెద్ద ప్రమాదం. అందుకే మందు సేవించినప్పుడు డ్రైవింగ్ చేయకుండా ఊబర్ (Uber), లైఫ్ట్ (Lyft) వంటి క్యాబ్ సేవలను ఉపయోగించడం లేదా ఆల్కహాల్ తీసుకోని స్నేహితుడిని (Designated Driver) వాహనం నడపమని చెప్పడం ఏకైక సురక్షితమైన మార్గం.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
ఏషియానెట్ న్యూస్
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Ancient Egypt: రాజులతోపాటు సేవకులనూ పాతిపెట్టేవారంట! ఈ వింత ఆచారం ఎక్కడో తెలుసా?
Recommended image2
నదులు సముద్రంలో కలవకపోతే ఏమవుతుంది.? విపత్తు త‌ప్ప‌ద‌ని తెలుసా.?
Recommended image3
బ్రాయిల‌ర్ చికెన్ తింటే అమ్మాయిలు త్వ‌ర‌గా మెచ్యూర్ అవుతారా.? కోళ్ల‌కు నిజంగానే హార్మోన్స్ ఇస్తారా?
Related Stories
Recommended image1
చిరంజీవిని పేరు పెట్టి పిలిచే ఏకైక కమెడియన్, పవన్ కళ్యాణ్ 'అన్నయ్య' అని పిలుచుకునే నటుడు ఎవరో తెలుసా?
Recommended image2
Hema: చంపేస్తానేమో అని భయం వేసింది.. డిప్రెషన్ నుంచి హేమ ఎలా బయటపడిందో తెలిస్తే షాక్ అవుతారు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved