MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Feature
  • కాఫీ, టీలు లేనప్పుడు మన పూర్వీకులు ఏం తాగేవారు? అసలు ఈ పానీయాలు మనకెలా అలవాటయ్యాయి?

కాఫీ, టీలు లేనప్పుడు మన పూర్వీకులు ఏం తాగేవారు? అసలు ఈ పానీయాలు మనకెలా అలవాటయ్యాయి?

ఇప్పుడు ఉదయం లేచిన వెంటనే కాఫీ, టీలు తాగనిదే పని మొదలుపెట్టరు మన భారతీయులు. కానీ ఈ రెండు మనదేశానికి చెందినవేనా? ఇవి మనకు తెలియక ముందు ఉదయాన్నే ఏమి తాగేవారం? అసలు ఈ కాఫీ, టీలను మనకు ఎవరు పరిచయం చేశారు?

2 Min read
Author : Haritha Chappa
Published : Aug 24 2026, 10:17 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
కాఫీ, టీలు లేనప్పుడు...
Image Credit : Gemini AI

కాఫీ, టీలు లేనప్పుడు...

ఉదయం నిద్రలేచిన వెంటనే వేడివేడిగా టీ లేదా కాఫీ పొట్టలో పడాల్సిందే. ఆ తరువాతే పనులు చేయడం మొదలుపెడతారు. ఇప్పుడంటే మనకు కాఫీ, టీలు తెలుసు కానీ మన పూర్వీకులకు వీటి సంగతే తెలియదట. పూర్వీకులు ఉదయాన్నే శరీరానికి పోషణ, రోగనిరోధక శక్తినిచ్చే సహజ పానీయాలను తీసుకునేవారు. ప్రధానంగా ఆవు పాలు, గోరువెచ్చని నీటిలో కలుపుకున్న ఆవు నెయ్యి లేదా తేనె, తులసి, అల్లం, దాల్చినచెక్క, మిరియాలతో కాచిన మూలికా కషాయాలు తాగేవారు. దక్షిణ భారతదేశంలో రాత్రి మిగిలిన అన్నంలో నీళ్లు, మజ్జిగ పోసి పులియబెట్టిన చద్దన్నం తినడం చేసేవారు. ఇది పొట్టకు చలువ చేయడంతో పాటు సహజ ప్రోబయోటిక్స్‌ను అందించేది. గ్రామీణ ప్రాంతాల్లో తాజా మజ్జిగ, రాగి అంబలి, బార్లీ నీళ్లు వంటివి ఉదయం తాగేవారు. ఇవి వారికి శారీరక శ్రమకు అవసరమైన శక్తిని, చల్లదనాన్ని ఇచ్చే పానీయాలు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
భారత్‌లోకి కాఫీ, టీల ప్రవేశం
Image Credit : Pixabay

భారత్‌లోకి కాఫీ, టీల ప్రవేశం

కాఫీ భారతదేశానికి 16వ శతాబ్దం చివరలో లేదా 17వ శతాబ్దం ఆరంభంలో ప్రవేశించినట్టు చెబుతారు. బాబా బుదాన్ అనే సూఫీ సన్యాసి యెమెన్ దేశంలోని మోచా నగరం నుంచి ఏడు పచ్చి కాఫీ గింజలను తన వస్త్రంలో దాచి దొంగతనంగా భారత్‌కు తీసుకొచ్చారు. వాటిని కర్ణాటకలోని చిక్‌మగళూరు సమీపంలోని చంద్రద్రోణ పర్వతాలలో నాటారు. ప్రస్తుతం ఆ కొండలను బాబా బుదాన్‌గిరి అంటారు. మరోవైపు, ఈశాన్య భారత్‌లోని సింగ్‌ఫో తెగ ప్రజలు అడవి తేయాకులను ఔషధంగా వాడుతున్నప్పటికీ, బ్రిటీష్ పాలనలోనే టీ వాణిజ్య రూపం దాల్చింది. 1823లో రాబర్ట్ బ్రూస్ అనే స్కాటిష్ అధికారి అస్సాంలో స్థానిక టీ మొక్కలను గుర్తించారు. చైనాపై తేయాకు ఆధిపత్యాన్ని తగ్గించేందుకు ఈస్ట్ ఇండియా కంపెనీ 1830ల నుంచి అస్సాం, డార్జిలింగ్‌లలో విస్తారంగా తేయాకు తోటలను పెంచడం ప్రారంభించింది.

Related Articles

Related image1
ఉదయాన్నే 30 రోజుల పాటూ తులసి నీళ్లు తాగి చూడండి.. మీరు ఊహించని మార్పులు
Related image2
Magic Drink: ఈ మ్యాజిక్ డ్రింక్ ప్రతిరోజూ తాగారంటే చర్మం కళకళలాడిపోతుంది
33
టీ, కాఫీలు అలవాటుగా ఎలా?
Image Credit : Pixabay

టీ, కాఫీలు అలవాటుగా ఎలా?

ప్రారంభంలో కాఫీ, టీలను ధనికులు, బ్రిటీష్ అధికారులకు తాగే అవకాశం ఉండేది. వీటిని అప్పట్లో విలాసవంతమైన పానీయాలుగా చెప్పుకునేవారు. 1903లో బ్రిటీష్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 'ఇండియన్ టీ మార్కెట్ ఎక్స్‌పాన్షన్ బోర్డ్' బాగా ప్రచారాలను చేపట్టింది. రైల్వే స్టేషన్లు, ఫ్యాక్టరీలు, పట్టణ కూడళ్లలో ఉచితంగా టీ అందించడం, పాలు-చక్కెర కలిపి మరిగించే భారతీయ శైలి 'చాయ్' తయారీ విధానాన్ని ప్రోత్సహించడం చేసింది. అప్పుడు సామాన్యులకు కూడా టీ అలవాటు అయింది. అదే సమయంలో దక్షిణ భారతంలో ఫిల్టర్ కాఫీ నిత్య జీవితంలో భాగమైంది. అలా బ్రిటీష్ వాణిజ్య ప్రయోజనాల కోసం మొదలైన ప్రయాణం, క్రమంగా భారతదేశంలో ప్రతి ఉదయాన్ని కాఫీ, టీల సువాసనతో మేల్కొనేలా మార్చేసింది

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
భారత దేశం

Latest Videos
Recommended Stories
Recommended image1
Shiva Purana Rules: మహిళలు రుద్రాక్ష ధరించవచ్చా? శివాభిషేకం చేసేటప్పుడు ఏ వైపు నిలబడాలి? శివపురాణం ఏం చెప్తోంది?
Recommended image2
అన్నీ ఉన్నాయన్న పొగరు పనికి రాదు.. జీవితం ఎప్పుడెలా పరీక్ష పెడుతుందో తెలియ‌దు
Recommended image3
Worlds Cheapest House: ప్రపంచంలోనే అత్యంత చౌకైన ఇల్లు.. కేవలం 1 డాలర్‌ మాత్రమే !
Related Stories
Recommended image1
ఉదయాన్నే 30 రోజుల పాటూ తులసి నీళ్లు తాగి చూడండి.. మీరు ఊహించని మార్పులు
Recommended image2
Magic Drink: ఈ మ్యాజిక్ డ్రింక్ ప్రతిరోజూ తాగారంటే చర్మం కళకళలాడిపోతుంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved