MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Life
  • Magic Drink: రోజూ ఈ మ్యాజిక్ డ్రింక్ ప్రతిరోజూ తాగారంటే చర్మం కళకళలాడిపోతుంది

Magic Drink: రోజూ ఈ మ్యాజిక్ డ్రింక్ ప్రతిరోజూ తాగారంటే చర్మం కళకళలాడిపోతుంది

Magic Drink: చర్మం కాంతిహీనంగా మారిందా? దాన్ని మెరిపించాలంటే ప్రతిరోజూ చిన్న పని చేయండి చాలు. దానిమ్మ జ్యూస్‌ను రోజూ తాగడం వల్ల ముఖం మెరిసిపోతుంది. అలాగే శరీరంలో కూడా ఎన్నో మంచి మార్పులు కలుగుతాయి.

2 Min read
Author : Haritha Chappa
Published : Aug 23 2026, 07:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
దానిమ్మ జ్యూస్ ఒక మ్యాజిక్ డ్రింక్
Image Credit : Getty

దానిమ్మ జ్యూస్ ఒక మ్యాజిక్ డ్రింక్

చర్మం కళాహీనంగా, కాంతిరహితంగా ఉందా? అయితే మీ చర్మాన్ని మెరిపించేందుకు దానిమ్మ జ్యూస్ ప్రతిరోజూ తాగడం అలవాటు చేసుకోండి. పోషకాలతో నిండిన రుచికరమైన పానీయం ఇది. అందుకే దీన్ని మ్యాజిక్ డ్రింక్ అని పిలుచుకోవచ్చు. దీన్ని ప్రతిరోజూ తాగడం వల్ల కొన్ని రోజుల్లోనే మీ ముఖంలో, శరీరంలో ఎన్నో మార్పులు కనిపిస్తాయి. జీర్ణ సమస్యలకు దానిమ్మ ఒక అద్భుతమైన పరిష్కారం. ఇందులో ఉండే విటమిన్ సి, శరీరంలో ఐరన్ గ్రహించడాన్ని పెంచి రక్తహీనతను నివారిస్తుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
చర్మానికి మెరుపు
Image Credit : Getty

చర్మానికి మెరుపు

దానిమ్మ జ్యూస్‌లో శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు (ప్యునికలాజిన్స్, పాలీఫెనాల్స్) విటమిన్-సి పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి వృద్ధాప్య ఛాయలను, ముడతలను తగ్గిస్తాయి. ఇది శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి, రక్తప్రసరణను మెరుగుపరచడం ద్వారా చర్మానికి తగినంత ఆక్సిజన్, పోషకాలను అందిస్తుంది. రోజూ దానిమ్మ రసం తాగడం వల్ల చర్మ కణాలు లోపలి నుంచి పునరుజ్జీవం పొంది, నల్లటి మచ్చలు తగ్గి ముఖం సహజమైన మెరుపుతో, కాంతివంతంగా మారుతుంది.

దానిమ్మ జ్యూస్‌లోని యాంటీఆక్సిడెంట్లు ఆరోగ్యకరమైన రక్త ప్రసరణకు సహాయపడతాయి. రోజూ ఒక గ్లాసు దానిమ్మ జ్యూస్ తాగడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. ముఖ్యంగా అధిక రక్తపోటు ఉన్నవారికి ఇది మేలు చేస్తుంది. ప్యూనికాలాగిన్స్ (punicalagins) రక్తనాళాలలో నైట్రిక్ ఆక్సైడ్ లభ్యతను పెంచుతాయి. ఆక్సిడేటివ్ ఒత్తిడిని తగ్గిస్తాయి. ఇవి రక్తనాళాలు రిలాక్స్ అవ్వడానికి కూడా సహాయపడతాయి. రక్త ప్రవాహాన్ని, రక్తపోటును నియంత్రించడానికి శరీరం ఉపయోగించే ముఖ్యమైన అణువులలో నైట్రిక్ ఆక్సైడ్ ఒకటి.

Related Articles

Related image1
ఉదయాన్నే 30 రోజుల పాటూ తులసి నీళ్లు తాగి చూడండి.. మీరు ఊహించని మార్పులు
Related image2
Toxic Wife: మీ భార్యలో ఇలాంటి లక్షణాలు ఉంటే ఆమె వెరీ టాక్సిక్ వ్యక్తి అని అర్థం
33
రక్త హీనత రాదు
Image Credit : stocks

రక్త హీనత రాదు

దానిమ్మ జ్యూస్ తాగడం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరగడమే కాకుండా, రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. దానిమ్మ రసంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది హిమోగ్లోబిన్ స్థాయిని, ఎర్ర రక్త కణాల సంఖ్యను పెంచడానికి సహాయపడుతుంది.

దానిమ్మలో ఉండే నైట్రిక్ యాసిడ్, ధమనులలో పేరుకుపోయిన కొవ్వును తొలగించడానికి సహాయపడుతుంది. 70 శాతానికి పైగా కొలెస్ట్రాల్‌ను తొలగించే సామర్థ్యం దానిమ్మకు ఉందని నిపుణులు చెబుతున్నారు.

టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు దానిమ్మ జ్యూస్‌ను రోజూ తాగే ముందు తప్పనిసరిగా డాక్టర్‌ను సంప్రదించాలి. దానిమ్మ, దాని రసంలో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే గుణాలు ఉన్నప్పటికీ, దీనికి గ్లైసెమిక్ ఇండెక్స్ కొంచెం ఎక్కువని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
ఉదయాన్నే 30 రోజుల పాటూ తులసి నీళ్లు తాగి చూడండి.. మీరు ఊహించని మార్పులు
Recommended image2
Toxic Wife: మీ భార్యలో ఇలాంటి లక్షణాలు ఉంటే ఆమె వెరీ టాక్సిక్ వ్యక్తి అని అర్థం
Recommended image3
కరివేపాకులు వీరు తింటే ఎంత ప్రమాదమో
Related Stories
Recommended image1
ఉదయాన్నే 30 రోజుల పాటూ తులసి నీళ్లు తాగి చూడండి.. మీరు ఊహించని మార్పులు
Recommended image2
Toxic Wife: మీ భార్యలో ఇలాంటి లక్షణాలు ఉంటే ఆమె వెరీ టాక్సిక్ వ్యక్తి అని అర్థం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved