MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Feature
  • Train Lower Berth: రైలు ప్రయాణంలో లోయర్ బెర్త్ కన్ఫర్మ్ కావాలా? ఈ ఐదు సీక్రెట్ ట్రిక్స్ మీకోసం

Train Lower Berth: రైలు ప్రయాణంలో లోయర్ బెర్త్ కన్ఫర్మ్ కావాలా? ఈ ఐదు సీక్రెట్ ట్రిక్స్ మీకోసం

Train Lower Berth: రైలు టికెట్ బుక్ చేసేటప్పుడు లోయర్ బెర్త్ దొరకట్లేదా? అయితే, ఈ వివరాలు మీకోసమే.. రైలు ప్రయాణంలో లోయర్ బెర్త్ పొందే టాప్ 5 సింపుల్ టిప్స్ మీకోసం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Sep 13 2026, 11:18 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
రైలు ప్రయాణంలో లోయర్ బెర్త్ రావడం లేదా?
Image Credit : chatgpt

రైలు ప్రయాణంలో లోయర్ బెర్త్ రావడం లేదా?

రైలు ప్రయాణం అంటేనే ఒక విభిన్నమైన అనుభూతి. అయితే ఈ ప్రయాణంలో అందరికీ నచ్చేది, కావాలనుకునేది లోయర్ బెర్త్ మాత్రమే. ముఖ్యంగా వయస్సు పైబడిన వారు, సీనియర్ సిటిజన్లు లోయర్ బెర్త్ దొరికితే ప్రయాణం హాయిగా సాగిపోతుందని భావిస్తారు. కానీ చాలా సార్లు మనం టికెట్ బుక్ చేసినప్పుడు అనుకున్న లోయర్ బెర్త్ రాదు. సీనియర్ సిటిజన్లకు కూడా ఆటోమేటిక్‌గా మిడిల్ లేదా అప్పర్ బెర్త్‌లు కేటాయించడం చూస్తుంటాం.

ఈ వయసులో పై బెర్త్ ఎక్కడం చాలా కష్టం. దీంతో చాలామంది ప్రయాణికులు రైల్వే వ్యవస్థపై అసహనం వ్యక్తం చేస్తుంటారు. అయితే ఐఆర్‌సీటీసీ (IRCTC) వెబ్‌సైట్ లేదా యాప్‌లో టికెట్ బుక్ చేసేటప్పుడు కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే మీకు లేదా మీ ఇంట్లోని పెద్దలకు సులభంగా లోయర్ బెర్త్ పొందే అవకాశం ఉంటుంది. ఆ 5 ముఖ్యమైన టిప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
బెర్త్ ఛాయిస్ ఆప్షన్ సరిగ్గా ఎంచుకోండి
Image Credit : Asianet News

బెర్త్ ఛాయిస్ ఆప్షన్ సరిగ్గా ఎంచుకోండి

చాలామంది ప్రయాణికులు కౌంటర్‌లో టికెట్ తీసుకుంటారు, మరికొందరు ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకుంటారు. ఆన్‌లైన్‌లో బుక్ చేసేటప్పుడు అభ్యర్థి వివరాలు ఇచ్చే సమయంలో చాయిస్ ఆఫ్ బెర్త్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అందులో తప్పనిసరిగా లోయర్ బెర్త్ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

ఈ ఆప్షన్ ద్వారా 60 ఏళ్లు పైబడిన పురుషులకు, 45 ఏళ్లు పైబడిన మహిళలకు లోయర్ బెర్త్ లభించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. టికెట్ బుకింగ్ ప్రాసెస్ ప్రారంభంలోనే ఈ వివరాలను సరిగ్గా నమోదు చేయడం చాలా ముఖ్యం.

36
ఈ ఒక్క కండిషన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి
Image Credit : Getty

ఈ ఒక్క కండిషన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి

ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ సమయంలో మరో ముఖ్యమైన ఆప్షన్ అందుబాటులో ఉంటుంది. అదే 'Book only if at least one lower berth is allotted' అనేది. టికెట్ బుకింగ్ చివరి దశలో ఈ బాక్స్‌ను క్లిక్ చేయాలి.

ఈ ఆప్షన్ ఎంచుకోవడం వల్ల ఒకవేళ రైలులో లోయర్ బెర్త్ ఖాళీగా ఉంటేనే మీ టికెట్ బుక్ అవుతుంది. ఒకవేళ లోయర్ బెర్త్ అందుబాటులో లేకపోతే మీ టికెట్ బుక్ కాకుండా ఆగిపోతుంది. దీనివల్ల మీకు ఇష్టం లేని మిడిల్ లేదా అప్పర్ బెర్త్‌లు రాకుండా చూసుకోవచ్చు.

46
ప్రయాణానికి ముందే ముందస్తు బుకింగ్ చేయండి
Image Credit : gemini and social media

ప్రయాణానికి ముందే ముందస్తు బుకింగ్ చేయండి

మీకు ప్రయాణంలో కచ్చితంగా లోయర్ బెర్త్ కావాలనుకుంటే చివరి నిమిషం వరకు వేచి చూడకండి. ఎంత త్వరగా టికెట్ బుక్ చేసుకుంటే లోయర్ బెర్త్ వచ్చే అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయి.

రైల్వే నిబంధనల ప్రకారం ప్రయాణ తేదీకి 120 రోజుల ముందే టికెట్ బుకింగ్ చేసుకునే వెసులుబాటు ఉంది. ప్రయాణ తేదీకి చాలా రోజుల ముందే బుక్ చేయడం వల్ల లోయర్ బెర్త్‌లు ఖాళీగా ఉండి త్వరగా కన్ఫర్మ్ అవుతాయి. ఆలస్యంగా బుక్ చేస్తే బెర్త్‌లు నిండిపోయి మిడిల్ లేదా అప్పర్ బెర్త్‌లు మాత్రమే మిగులుతాయి.

56
సీనియర్ సిటిజన్ కోటాను ఉపయోగించుకోండి
Image Credit : Asianet News

సీనియర్ సిటిజన్ కోటాను ఉపయోగించుకోండి

మీతో పాటు వయోధికులు లేదా సీనియర్ సిటిజన్లు ప్రయాణిస్తుంటే బుకింగ్ సమయంలో తప్పనిసరిగా 'Senior Citizen Quota' ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

రైల్వే వ్యవస్థ సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేకంగా కొన్ని లోయర్ బెర్త్‌లను కేటాయిస్తుంది. మీరు ఈ కోటాను ఎంచుకోవడం వల్ల వారికి లోయర్ బెర్త్ దొరికే అవకాశాలు చాలా రెట్లు పెరుగుతాయి. కాబట్టి ప్రయాణికుల వయస్సు నమోదు చేసేటప్పుడు ఈ కోటాను ఎంచుకోవడం మర్చిపోవద్దు.

66
టీటీఈ ని కలసి మాట్లాడండి
Image Credit : social media

టీటీఈ ని కలసి మాట్లాడండి

ఒకవేళ టికెట్ కన్ఫర్మ్ అయ్యి కూడా మీకు లోయర్ బెర్త్ రాకపోతే కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్రయాణం రోజు రైలు ఎక్కిన తర్వాత సంబంధిత కోచ్ టీటీఈ ని నేరుగా కలవండి.

మీ సమస్యను టీటీఈకి వివరిస్తే, రైలులో ఏవైనా లోయర్ బెర్త్‌లు ఖాళీగా ఉన్నాయో లేదో చూస్తారు. లేదా వేరే ప్రయాణికులతో మాట్లాడి సీటు మార్పిడి చేయడానికి సహాయం చేస్తారు. కాబట్టి ఆందోళన చెందకుండా టీటీఈ సాయం కోరడం మంచిది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ప్రయాణం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
వినాయ‌కుడి చెవులు పెద్ద‌గా, కండ్లు చిన్న‌గా ఎందుకుంటాయి? ఒక్కో అవ‌యం వెనుక ఇంత అర్థ‌ముందా?
Recommended image2
Motivational Story: కష్టాల నుంచి పారిపోతున్నారా.? మీకు కూడా ఈ రాయికి పట్టిన గతే పడుతుంది
Recommended image3
మూసి ఉన్న బియ్యం డబ్బాలోకి పురుగులు ఎలా వ‌స్తాయో ఎప్పుడైనా ఆలోచించారా.?
Related Stories
Recommended image1
Seed Ganesha Idols: చిరంజీవి మెచ్చిన సీడ్ గణేష.. సీడ్ వినాయకుడితో మనకు వచ్చే 5 మైండ్ బ్లాకింగ్ బెనిఫిట్స్ ఇవే
Recommended image2
Farmer Success Story: ఒక ఎకరం పొలంలో రోజుకు 12 వేల ఆదాయం.. ఈ యువరైతు ఎలా సంపాదిస్తున్నాడో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved