MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Feature
  • Motivational Story: కష్టాల నుంచి పారిపోతున్నారా.? మీకు కూడా ఈ రాయికి పట్టిన గతే పడుతుంది

Motivational Story: కష్టాల నుంచి పారిపోతున్నారా.? మీకు కూడా ఈ రాయికి పట్టిన గతే పడుతుంది

Motivational Story: జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు చాలామంది వెనక్కి తగ్గిపోతుంటారు. కొద్దిసేపు సుఖంగా ఉంటే చాలని భావిస్తారు. కానీ మనం తప్పించుకునే ప్రతి కష్టం భవిష్యత్తులో మరో రూపంలో మన ముందుకు రావచ్చు. దీనిని చక్కగా వివరించే క‌థ ఇప్పుడు తెలుసుకుందాం.

2 Min read
Author : Narender Vaitla
Published : Sep 12 2026, 06:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రామాపురం గ్రామంలో శిల్పి
Image Credit : Gemini AI

రామాపురం గ్రామంలో శిల్పి

ఒకప్పుడు రామాపురం అనే గ్రామంలో ఓ శిల్పి ఉండేవాడు. దేవతల విగ్రహాలను ఎంతో అందంగా చెక్కడం అతడికి తెలుసు. ఒక రోజు మంచి రాయి కోసం గ్రామం బయటకు వెళ్లాడు. అలా వెతుకుతుండగా అతడికి రెండు పెద్ద బండరాళ్లు కనిపించాయి. వాటిని చూసిన శిల్పికి ఈ రాళ్లతో మంచి విగ్రహం తయారు చేయవచ్చని అనిపించింది.

మొదట అతడు ఒక రాయిని ఎంచుకున్నాడు. దానిపై ఉలిని పెట్టి సుత్తితో కొట్టడం ప్రారంభించాడు. ఉలి దెబ్బలు పడుతున్న కొద్దీ ఆ రాయికి తీవ్రమైన నొప్పి కలిగింది. అయినా శిల్పి మాత్రం తన పని ఆపలేదు. రాయిని మరింత అందమైన ఆకారంలోకి తీసుకురావడానికి వరుసగా ఉలి దెబ్బలు కొడుతూనే ఉన్నాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కష్టం భరించలేని రాయి ఏమందంటే?
Image Credit : Gemini AI

కష్టం భరించలేని రాయి ఏమందంటే?

ఉలి దెబ్బలు ఎక్కువయ్యే కొద్దీ మొదటి రాయి తట్టుకోలేకపోయింది. చివరకు అది శిల్పితో ఇలా వేడుకుంది. “ఈ బాధను నేను భరించలేను. ప్రతిసారీ ఉలితో కొడుతుంటే చాలా నొప్పిగా ఉంది. దయచేసి నన్ను వదిలేయండి” అని బతిమాలుకుంది. ఆ రాయి మాటలకు శిల్పి దానిని పక్కన పెట్టేశాడు. “ఇది ఇంత కష్టాన్ని కూడా భరించలేకపోతోంది. దీనితో విగ్రహం చేయడం కష్టం” అని భావించాడు. ఆ తర్వాత రెండో బండరాయి దగ్గరకు వెళ్లాడు. రెండో రాయిపై కూడా ఉలిని పెట్టి కొట్టడం ప్రారంభించాడు. ఈసారి కూడా దెబ్బలు బలంగానే పడ్డాయి. రాయికి నొప్పి కలిగింది. కానీ అది ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కష్టం వచ్చినా మౌనంగా భరించింది. శిల్పి కొడుతున్న ప్రతి ఉలి దెబ్బతో ఆ రాయి తన రూపాన్ని మార్చుకుంటూ వచ్చింది.

35
కష్టాలను భరించిన రాయి వినాయకుడిగా మారింది
Image Credit : Gemini AI

కష్టాలను భరించిన రాయి వినాయకుడిగా మారింది

కొన్ని గంటలు గడిచాయి. శిల్పి కష్టపడి ఆ రాయిని చెక్కాడు. చివరకు ఆ బండరాయి అందమైన వినాయకుడి విగ్రహంగా మారిపోయింది. ఆ విగ్రహాన్ని చూసిన శిల్పి ఎంతో సంతోషించాడు. తన పని పూర్తయ్యాక ఆ వినాయకుడి విగ్రహాన్ని తీసుకుని గ్రామంలోని గుడికి వెళ్లాడు. మొదట వదిలేసిన రాయిని కూడా తన వెంట తీసుకెళ్లాడు. గుడిలో అందమైన వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. భక్తులు ప్రతిరోజూ ఆ విగ్రహానికి పూజలు చేయడం ప్రారంభించారు. పూలు సమర్పించారు. హారతులు ఇచ్చారు. భక్తిశ్రద్ధలతో మొక్కుకున్నారు. అయితే మొదట కష్టాన్ని భరించలేక శిల్పిని వేడుకున్న రాయికి మాత్రం మరో పని వచ్చింది. గుడి బయట దాన్ని ఉంచి భక్తులు కొబ్బరికాయలు కొట్టేందుకు ఉపయోగించడం ప్రారంభించారు.

45
ఉలి దెబ్బలను భరించలేకపోతే.. కొబ్బరి దెబ్బలు తప్పవు
Image Credit : Gemini AI

ఉలి దెబ్బలను భరించలేకపోతే.. కొబ్బరి దెబ్బలు తప్పవు

ఇప్పుడు ఆ రెండు రాళ్ల పరిస్థితిని ఒక్కసారి ఆలోచించండి. ఒక రాయి కొంతకాలం ఉలి దెబ్బలను భరించింది. ఆ కష్టాల తర్వాత అది అందమైన వినాయకుడి విగ్రహంగా మారింది. జీవితాంతం భక్తుల పూజలు అందుకుంటోంది. మరో రాయి మాత్రం మొదట్లో వచ్చిన కష్టాన్ని భరించలేక వెనక్కి తగ్గింది. అందుకే అది విగ్రహంగా మారే అవకాశం కోల్పోయింది. చివరకు జీవితాంతం భక్తులు కొట్టే కొబ్బరికాయల దెబ్బలను భరించాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ కథలోని అసలు నీతి మన జీవితాలకు కూడా వర్తిస్తుంది.

55
గొప్ప నీతి
Image Credit : Gemini AI

గొప్ప నీతి

జీవితంలో ఎదురయ్యే కష్టాల నుంచి ప్రతిసారీ పారిపోతే సమస్యలు మన వెంట వస్తూనే ఉంటాయి. కానీ కొంతకాలం ఓపికగా కష్టాలను భరిస్తే అదే కష్టాలు మన జీవితాన్ని గొప్ప స్థాయికి తీసుకెళ్లవచ్చు. చదువులో వచ్చే కష్టం కావచ్చు.. ఉద్యోగం కోసం చేసే ప్రయత్నం కావచ్చు.. వ్యాపారంలో ఎదురయ్యే నష్టాలు కావచ్చు.. జీవితంలో ఎదురయ్యే ఏ సమస్య అయినా మనల్ని బలంగా మార్చేందుకే రావచ్చు. ఈరోజు పడే కష్టం రేపటి విజయానికి పునాది కావచ్చు.

అందుకే కష్టం వచ్చిన ప్రతిసారీ “ఇది నా వల్ల కాదు” అని వెనక్కి తగ్గకండి. కొంతకాలం కష్టాన్ని భరించండి. ఓపిక పట్టండి. ప్రయత్నాన్ని ఆపకండి. ఎందుకంటే ఉలి దెబ్బలను కొంతకాలం భరించిన రాయే చివరికి పూజలు అందుకునే విగ్రహంగా మారుతుంది. కష్టాల నుంచి పారిపోయిన రాయికి మాత్రం జీవితాంతం దెబ్బలు తప్పలేదు. కాబట్టి ఈరోజు కష్టం చూసి భయపడకండి.. అదే కష్టం రేపు మీ జీవితాన్ని మార్చే అవకాశంగా మారవచ్చు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
ఫీల్ గుడ్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
మూసి ఉన్న బియ్యం డబ్బాలోకి పురుగులు ఎలా వ‌స్తాయో ఎప్పుడైనా ఆలోచించారా.?
Recommended image2
Curd : పాలను గడ్డకట్టించి పెరుగుగా మార్చేది ఓ బ్యాక్టీరియానా? పెరుగుకు పుల్లటి రుచి ఎలా వస్తుంది?
Recommended image3
Unique Temples : దేవుళ్లకు నైవేద్యంగా మందు, మటన్, చేపలు.. భక్తులకూ ఇవే ప్రసాదం.. ఎక్కడో తెలుసా?
Related Stories
Recommended image1
Telangana: తెలంగాణ‌లోని ఈ ప‌ట్ట‌ణంలో.. రూ. 54 కోట్ల‌తో అత్యాధునిక బ‌స్టాండ్ నిర్మాణం
Recommended image2
మూసి ఉన్న బియ్యం డబ్బాలోకి పురుగులు ఎలా వ‌స్తాయో ఎప్పుడైనా ఆలోచించారా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved