MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Feature
  • Snakes : పాములు పదేపదే నాలుక ఎందుకు బయటపెడతాయి? రెండుగా చీలిన నాలుకలో ఇంత విషయం దాగుందా..!

Snakes : పాములు పదేపదే నాలుక ఎందుకు బయటపెడతాయి? రెండుగా చీలిన నాలుకలో ఇంత విషయం దాగుందా..!

మీరు జూలోగానీ లేదంటే బహిరంగ ప్రదేశాల్లోగానీ పామును ప్రత్యక్షంగా చూస్తే ఓ డౌట్ వస్తుంది… ఇది పదేపదే నాలుకను ఎందుకలా బైటపెడుతుంది? ఆ నాలుక ఎందుకలా ఉంది? అని.

3 Min read
Author : Arun Kumar P
Published : Sep 08 2026, 02:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పాములు నాలుక వెనక నమ్మలేని నిజాలు...
Image Credit : Gemini AI

పాములు నాలుక వెనక నమ్మలేని నిజాలు...

Snakes : పామును చూసిన వెంటనే చాలామందికి కనిపించే ఒక ఆసక్తికరమైన విషయం దాని నాలుక. పాము నోటి నుంచి పదేపదే సన్నగా, పొడవుగా ఉన్న నాలుక బయటకు వచ్చి మళ్లీ లోపలికి వెళ్లిపోతూ ఉంటుంది. పాము ఇలా ఎందుకు చేస్తుంది అనే డౌట్ చాలామందికి వచ్చే ఉంటుంది. అలాగే ఇంకో సందేహం కూడా వస్తుంది... పాములకు రెండు నాలుకలు ఉంటాయా? లేక ఒకే నాలుక రెండుగా చీలి ఉంటుందా? అని. పాములకు సంబంధించిన ఈ డౌట్స్ ను ఇక్కడ క్లియర్ చేసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
పాములకు రెండు నాలుకలు ఉంటాయా?
Image Credit : AI Image

పాములకు రెండు నాలుకలు ఉంటాయా?

నిజానికి పాముకు రెండు నాలుకలు ఉండవు... అన్ని జంతువుల్లా ఒకే నాలుక ఉంటుంది. అయితే దాని చివరి భాగం రెండు కొసలుగా చీలిపోయి ఉంటుంది. ఈ ప్రత్యేక నిర్మాణం పాముకు ప్రకృతి ఇచ్చిన వరం అనే చెప్పాలి... ఇది అత్యంత అద్భుతమైన సెన్సార్ వ్యవస్థలా పనిచేస్తుంది. మనం కళ్లతో చూసి, ముక్కుతో వాసన చూసి పరిసరాలను అర్థం చేసుకుంటే పాము మాత్రం తన నాలుక సాయంతో చుట్టుపక్కల ఉన్న రసాయన సంకేతాలను సేకరిస్తుంది... వీటి ఆధారంగా చుట్టుపక్కల ప్రపంచాన్ని అర్థం చేసుకుంటుంది.

నాలుక రెండు కొసలుగా ఎందుకు చీలిపోయి ఉంటుంది?

పాము నాలుక చివర రెండు భాగాలుగా ఉండటం వెనక కూడా ఒక ప్రత్యేకమైన ప్రయోజనం ఉంది. నాలుకలోని రెండు కొసలు చుట్టుపక్కల వేర్వేరు ప్రాంతాల్లోని రసాయన సంకేతాలను ఒకేసారి సేకరిస్తాయి. ఒకవైపు నుంచి వచ్చే వాసన లేదా రసాయన సంకేతం మరొక వైపు కంటే ఎక్కువగా ఉంటే, ఆ తేడాను పాము గుర్తించగలదు.

ఉదాహరణకు ఆహారం కుడివైపు ఉన్నప్పుడు ఆ దిశ నుంచి వచ్చే రసాయన సంకేతం నాలుక కుడి కొసకు ఎక్కువగా చేరవచ్చు. ఎడమవైపు నాలుక కొసకు ఎలాంటి అహార సంకేతాలు అందలేవు అనుకుందాం. అప్పుడు పాము కుడివైపుకు వెళ్లి అహారం సేకరిస్తుంది. ఇలా రెండు కొసల ద్వారా వచ్చే సంకేతాల్లోని తేడా పాము ఎటు వెళ్లాలో అంచనా వేయడంలో సహాయపడుతుంది. దీనిని ఇంకా సులభంగా చెప్పాలంటే పాము ఒకరకంగా “స్టీరియో స్మెల్లింగ్” చేస్తుందన్నమాట. అంటే వాసన ఉందా లేదా అన్నది మాత్రమే కాదు, అది ఏ దిశ నుంచి వస్తోందో కూడా గుర్తించే సామర్థ్యం దానికి ఉంటుంది.

Related Articles

Related image1
Snake Meat Food : చికెన్ పకోడీ రొటీన్.. పాము పకోడీ వెరైటీ..! ఇలా లొట్టలేసుకుంటూ తింటున్నారేంట్రా బాబు!!
Related image2
Snake vs Mongoose : ముంగీస, పాము మధ్య గొడవేంటి..? ఇది ఎక్కడ మొదలైందో తెలుసా?
35
పాములు నాలుక బయటపెట్టడం వెనక అసలు కారణం ఇదే..
Image Credit : Gemini AI

పాములు నాలుక బయటపెట్టడం వెనక అసలు కారణం ఇదే..

పాము నాలుకను పదే పదే బయటకు పెట్టడం కోపం వల్ల కాదు... ఎదుటివారిని కాటేయడానికి సిద్ధమవుతోందని కూడా కాదు. తనచుట్టూ ఉండే పరిసరాలను అర్థం చేసుకునేందుకు పాము ఇలా నాలుక బయట పెడుతుంది. వాతావరణంలో, నేలపై లేదా ఇతర వస్తువులపై ఉన్న సూక్ష్మ రసాయన కణాల వాసనకు నాలుక ద్వారా సేకరించి, విశ్లేషిస్తుంది... దీన్నిబట్టే పాము కదలికలు ఉంటాయి.

పాము నాలుక బయటకు వచ్చినప్పుడు గాలిలోని రసాయన కణాలు దాని నాలుకపై అంటుకుంటాయి. తర్వాత నాలుకను తిరిగి నోటిలోకి తీసుకుంటుంది. అక్కడ నోటి పైభాగంలో ఉండే ప్రత్యేక ఇంద్రియ వ్యవస్థకు ఈ సమాచారం చేరుతుంది. దీనిని జాకబ్సన్ ఆర్గాన్ లేదా వోమెరోనాసల్ ఆర్గాన్ (Jacobson's or vomeronasal organ) అంటారు. ఇక్కడి సెన్సార్ కణాలు ఆ రసాయన సమాచారాన్ని విశ్లేషించి మెదడుకు సంకేతాలు పంపుతాయి. దీంతో చుట్టుపక్కల ఆహారం ఉందా, ఇతర జీవులు ఉన్నాయా, మరో పాము వెళ్లిందా, జతను గుర్తించాల్సిన సమయం వచ్చిందా వంటి సమాచారాన్ని పాము అంచనా వేయగలదు.

45
పాము నాలుక నిజంగా సెన్సార్‌లా పనిచేస్తుందా?
Image Credit : chatgpt

పాము నాలుక నిజంగా సెన్సార్‌లా పనిచేస్తుందా?

అవును... ఆధునిక సెన్సార్ గాలిలోని లేదా పరిసరాల్లోని సమాచారాన్ని సేకరించి ప్రాసెసింగ్ యూనిట్‌కు పంపినట్లే, పాము నాలుక కూడా రసాయన సమాచారాన్ని సేకరించే సాధనంగా పనిచేస్తుంది. అయితే నాలుక స్వయంగా ఆ సమాచారాన్ని పూర్తిగా విశ్లేషించదు. అది ఒకరకంగా సమాచారాన్ని సేకరించి అందించే సాధనం. నాలుక సేకరించిన రసాయన కణాలు నోటిలోని జాకబ్సన్ ఆర్గాన్‌కు చేరిన తర్వాత అసలు విశ్లేషణ జరుగుతుంది.

అందుకే పాము నాలుకను ఎక్కువసార్లు బయటకు పెడుతూ ఉంటుంది. ముఖ్యంగా కొత్త ప్రదేశంలోకి వెళ్లినప్పుడు, ఆహారం కోసం వెతుకుతున్నప్పుడు లేదా చుట్టుపక్కల పరిస్థితిని అంచనా వేయాల్సిన సమయంలో tongue flicking మరింత కీలకంగా మారుతుంది. పాము వేటాడే జంతువు వదిలిన రసాయన జాడలను అనుసరించడంలో కూడా ఈ వ్యవస్థ ఎంతో ఉపయోగపడుతుంది.

పాములకు ముక్కు ఉన్నప్పుడు నాలుక ఎందుకు అవసరం?

పాములకు నాసికా రంధ్రాలు ఉంటాయి. కానీ వాటి రసాయన సమాచారాన్ని గుర్తించే విధానం మనుషుల మాదిరిగా పనిచేయదు. పాముల విషయంలో నాలుక-జాకబ్సన్ ఆర్గాన్ వ్యవస్థ చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా వేటాడే జంతువు వదిలిన రసాయన జాడలను గుర్తించడం, మరో పామును గుర్తించడం, పరిసరాల్లోని మార్పులను అర్థం చేసుకోవడంలో ఈ ప్రత్యేక వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుంది.

పాములకు చెవులు ఉండవా?

పాముల గురించి మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే వాటికి మనుషుల్లా బయటికి కనిపించే చెవులు ఉండవు. బాహ్య చెవి రంధ్రాలు, చెవిపొరలు కూడా ఉండవు. అయినప్పటికీ అవి పూర్తిగా వినలేవని అనుకోవడం పొరపాటు. నేల ద్వారా వచ్చే కంపనాలను, శరీరం ద్వారా ప్రసరించే వైబ్రేషన్లను పాములు గుర్తించగలవు. అందువల్ల సమీపంలో ఏదైనా కదలిక జరిగినప్పుడు దానిని గ్రహించే సామర్థ్యం వాటికి ఉంటుంది.

55
పాము నాలుక బయటకు పెట్టిందంటే కాటేయబోతోందా?
Image Credit : Asianet News

పాము నాలుక బయటకు పెట్టిందంటే కాటేయబోతోందా?

ఇది కూడా చాలామందిలో ఉన్న అపోహే. పాము నాలుక బయటకు పెట్టడం అనేది సాధారణంగా పరిసరాలను పరిశీలించే సహజ ప్రవర్తన. కాబట్టి నాలుకను బయటకు పెట్టిందంటే వెంటనే దాడి చేస్తుందని అర్థం కాదు. అయితే ఏ పామైనా ప్రమాదంలో ఉందని భావించినప్పుడు ఆత్మరక్షణ కోసం దాడి చేసే అవకాశం ఉంటుంది. అందువల్ల అడవిలో, పొలాల్లో లేదా ఇళ్ల పరిసరాల్లో పాము కనిపిస్తే దానికి దగ్గరగా వెళ్లడం, పట్టుకునేందుకు ప్రయత్నించడం ప్రమాదకరం.

చర్మాన్ని ఎందుకు వదిలేస్తాయి?

పాముల గురించి మరో ఆసక్తికరమైన విషయం వాటి చర్మం. పెరుగుదల, చర్మ పునరుద్ధరణ ప్రక్రియలో భాగంగా పాములు పాత చర్మాన్ని వదిలేస్తాయి. దీనినే సాధారణంగా షెడ్డింగ్ లేదా స్లఫింగ్ అంటారు. కొత్త చర్మం పాత చర్మం కింద ఏర్పడిన తర్వాత పాము తన తలను, శరీరాన్ని గరుకైన ఉపరితలాలకు రుద్దుతూ పాత చర్మం నుంచి బయటకు వస్తుంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Top 5 Nude Beach : ఈ బీచ్ లకు వెళ్లాలంటే ఒంటిపై నూలుపోగు కూడా ఉండకూడదు
Recommended image2
Train: రైలులో బైక్ వేరే ప్రాంతానికి పార్శిల్ చేస్తున్నారా? ఈ పత్రాలు, నిబంధనలు తెలీకపోతే ఫైన్ పడుతుంది
Recommended image3
Home Work: హోంవర్క్ కనిపెట్టిన వ్యక్తి ఎవరో తెలుసా? పిల్లలు ఎప్పటి నుంచి హోంవర్క్ చేయడం మొదలుపెట్టారంటే..
Related Stories
Recommended image1
Snake Meat Food : చికెన్ పకోడీ రొటీన్.. పాము పకోడీ వెరైటీ..! ఇలా లొట్టలేసుకుంటూ తింటున్నారేంట్రా బాబు!!
Recommended image2
Snake vs Mongoose : ముంగీస, పాము మధ్య గొడవేంటి..? ఇది ఎక్కడ మొదలైందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved