MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Feature
  • world’s longest train : 7 కిలొమీటర్ల పెద్ద రైలే..! ప్రపంచంలోనే అతి పొడవైన ట్రైన్ ఏదో తెలుసా?

world’s longest train : 7 కిలొమీటర్ల పెద్ద రైలే..! ప్రపంచంలోనే అతి పొడవైన ట్రైన్ ఏదో తెలుసా?

ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైలు ఏదో తెలుసా? దీని పొడవే 7 కిలోమీటర్లకు పైగా ఉంటుందట.. ఏకంగా 682 వ్యాగన్లను, 8 ఇంజన్లను కలిగి ఉంటుందట. ఈ రైలు బరువెంతో తెలిస్తే అవాక్కవడం ఖాయం.

2 Min read
Author : Arun Kumar P
Published : Jul 20 2026, 07:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ప్రపంచంలోనే పొడవైన రైలు ఏది?
Image Credit : Gemini AI

ప్రపంచంలోనే పొడవైన రైలు ఏది?

ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైలు ఆస్ట్రేలియాలో ఉంది. దీని పొడవు ఏకంగా 7 కిలోమీటర్లకు పైనే ఉంటుంది. ఈ భారీ రైలు 682 వ్యాగన్లను కలిగివుండగా, వాటిని లాగడానికి ఏకంగా 8 శక్తివంతమైన ఇంజన్లు ఉంటాయి. అయితే ఇది ప్రయాణికులను తీసుకెళ్లే ప్యాసింజర్ ట్రైన్ కాదు, కేవలం సరుకు రవాణా చేసే గూడ్స్ రైలు. ఆస్ట్రేలియాలోని అతిపెద్ద మైనింగ్ కంపెనీ BHP సంస్థకు చెందిన 'ఐరన్ ఓర్'ను ఈ రైలు నిరంతరం సరఫరా చేస్తుంది. ఈ రైలు నిజంగా ఒక ఇంజనీరింగ్ అద్భుతమనే చెప్పాలి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఇండియాలో అతి పొడవైన రైలు ఏదో తెలుసా?
Image Credit : Gemini

ఇండియాలో అతి పొడవైన రైలు ఏదో తెలుసా?

భారతదేశంలో కూడా ఇలాంటి రైలే గతేడాది నుండి పట్టాలపై పరుగుతీస్తొంది, వేలు, లక్షల టన్నుల సరుకును సరఫరా చేస్తోంది... దానిపేరు 'రుద్రాస్త'. ఇది ఏకంగా 4.5 కిలోమీటర్లు పొడవు ఉంటుంది… అయిదే ఇదీ ఆస్ట్రేలియా రైలులాగే గూడ్స్ ట్రైన్... అంటే ప్రయాణికుల రవాణాకు కాకుండా సరుకుల రవాణాకు ఉపయోగిస్తారు. 354 వ్యాగన్లు (బోగీలు) కలిగిన ఈ ట్రైన్ ను లాగడానికి 7 శక్తివంతమైన ఇంజన్లు ఉంటాయి.

సాధారణంగా ఇండియన్ రైల్వేలో గూడ్స్ రైలుకు 40 నుండి 60 వరకు వ్యాగన్లు ఉంటాయి... కానీ ఈ రుద్రాస్త రైలుకు మాత్రం 354 ఉన్నాయి. అంటే ఆరు సాధారణ గూడ్స్ ట్రైన్స్ ను కలిపితే ఒక్క రుద్రాస్తకు సమానం. ఇలా ఒకే రైలుకు అత్యధిక బోగీలు కలిగివుండటం ద్వారా ఎక్కువ సరుకు రవాణా చేయవచ్చు... పదేపదే గూడ్స్ రైళ్ల కోసం ప్రయాణికుల రైళ్లను ఆపే అవసరం ఉండదు.

Related Articles

Related image1
Metro Rail Jobs: మెట్రో రైల్‌లో ఉద్యోగ అవకాశాలు...మొత్తం ఖాళీలు ఇవే
Related image2
Train Horn Meaning: ట్రైన్ హారన్ వెనుక ఇంత అర్థముందా? ఇవి కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!
35
ప్రపంచంలో అత్యంత పొడవైన ప్యాసింజర్ రైలు ఏది?
Image Credit : gemini

ప్రపంచంలో అత్యంత పొడవైన ప్యాసింజర్ రైలు ఏది?

ప్రపంచంలోనే అత్యంత పొడవైన ప్యాసింజర్ రైలు స్విట్జర్లాండ్‌లో పరుగులు తీస్తోంది. దీని పొడవు ఏకంగా 1.9 కిలోమీటర్లు, 100 కోచ్‌లను కలిగి ఉంటుంది. ఈ రైలు నిత్యం వేలాదిమంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తుంది. ఇది యునెస్కో ద్వారా ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించబడిన ప్రాచీన అల్బూలా రైల్వే మార్గం గుండా ప్రయాణిస్తుంది... ప్రముఖ ఆల్ప్ పర్వతాల మీదుగా ప్రయాణం సాగుతుంది. దీని బరువు 2,990 టన్నులు ఉంటుంది... 4,550 సీట్ల సామర్థ్యం కలిగివున్న ఈ రైలు 30 నుండి 40 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది.

45
ఇండియాలో పొడవైన ప్యాసింజర్ రైలు ఏది?
Image Credit : ai image

ఇండియాలో పొడవైన ప్యాసింజర్ రైలు ఏది?

భారతదేశంలో అత్యంత పొడవైన ప్యాసింజర్ రైలు ప్రయాగ్‌రాజ్ ఎక్స్‌ప్రెస్. ఇది ఏకంగా 24 కోచ్‌లను కలిగి ఉంటుంది. దేశంలో అత్యధిక కోచ్‌లతో నడిచే ఈ రైలు వేలాదిమంది ప్రయాణికులను తీసుకెళ్తుంది. 

అయితే అత్యంత దూరం ప్రయాణించే రైలు వివేక్ ఎక్స్‌ప్రెస్. ఈ రైలు అస్సాంలోని దిబ్రూఘర్ నుండి తమిళనాడులోని కన్యాకుమారి వరకు ప్రయాణిస్తుంది. దాదాపు 4,273 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి దీనికి 82 గంటలు అంటే నాలుగు రోజులు పడుతుంది. ఈ రైలు ప్రయాణం దేశంలోని భౌగోళిక వైవిధ్యాన్ని చూపుతుంది.

55
రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులు
Image Credit : Gemini

రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులు

ప్రపంచవ్యాప్తంగానే కాదు భారతదేశంలో నడుస్తున్న ఈ అతి పొడవైన రైళ్లు రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులను తీసుకొస్తున్నాయి. ఆస్ట్రేలియాలోని 7 కిలోమీటర్ల గూడ్స్ రైలు భారీ ఖనిజాలను, భారతదేశంలోని 4.5 కిలోమీటర్ల రుద్రాస్త్ర రైలు వేల టన్నుల సరుకును తక్కువ సమయంలోనే చేరవేస్తాయి. స్విట్జర్లాండ్ లోని 1.9 కిలోమీటర్ల ప్యాసింజర్ రైలు ఒకేసారి వేలాదిమందిని తరలిస్తుంది. ఈ భారీ రైళ్లు ఎక్కువ సరుకును లేదా ప్రయాణికులను ఒకేసారి తరలించడం ద్వారా సామర్థ్యాన్ని పెంచుతాయి. రవాణా ఖర్చులను తగ్గించి, సమయాన్ని ఆదా చేస్తాయి. ఇది రవాణా రంగంలో ఆధునికతకు నిదర్శనం.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ప్రపంచం
భారత దేశం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Onion Tears : ఉల్లిపాయ కోస్తే కన్నీళ్లు ఎందుకు వస్తాయి? దీని వెనక ఇంత కెమిస్ట్రీ దాగుందా?
Recommended image2
Beer Facts: బీర్‌లో నురగ ఎందుకు వస్తుంది? 6 వేల ఏళ్ల చరిత్ర వెనుక ఆసక్తికర విషయాలివే
Recommended image3
సచిన్, ధోని, రోహిత్, కోహ్లీ లకు ఆడపిల్లలే పుట్టడానికి కారణమేంటో తెలుసా?
Related Stories
Recommended image1
Metro Rail Jobs: మెట్రో రైల్‌లో ఉద్యోగ అవకాశాలు...మొత్తం ఖాళీలు ఇవే
Recommended image2
Train Horn Meaning: ట్రైన్ హారన్ వెనుక ఇంత అర్థముందా? ఇవి కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved