MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • సచిన్, ధోని, రోహిత్, కోహ్లీ లకు ఆడపిల్లలే పుట్టడానికి కారణమేంటో తెలుసా?

సచిన్, ధోని, రోహిత్, కోహ్లీ లకు ఆడపిల్లలే పుట్టడానికి కారణమేంటో తెలుసా?

క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ నుండి కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోని వరకు… చాలామంది స్టార్ క్రికెటర్లకు ఆడపిల్లలు సంతానంగా ఉన్నారు. ఇలా క్రీడాకారులకు ఎక్కువగా ఆడపిల్లలు పుట్టడం వెనక దాగున్న సైన్స్ ఏంటి?

3 Min read
Author : Arun Kumar P
Published : Sep 01 2026, 03:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
క్రిికెటర్లకు ఎక్కువగా ఆడపిల్లలే ఉంటారు... ఎందుకో తెలుసా?
Image Credit : Instagram/Sakshi Singh

క్రిికెటర్లకు ఎక్కువగా ఆడపిల్లలే ఉంటారు... ఎందుకో తెలుసా?

ఇండియన్ క్రికెట్ చరిత్రలో నిలిచిపోయే స్టార్స్ ఎవరంటే టక్కున సచిన్ టెండూల్కర్, మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల పేర్లు వినిపిస్తాయి. అయితే వీరి ఆటతీరులోనే కాదు పర్సనల్ లైఫ్‌లోనూ ఒక పోలిక ఉంది... వీరందరికీ ఆడపిల్లలు సంతానంగా ఉన్నాయి. సచిన్ కు సారా, ధోనికి జివా, విరాట్ కోహ్లీకి వామిక, రోహిత్ శర్మకు సమైరా సంతానం. వీళ్లకే కాదు రవీంద్ర జడేజా లాంటి మరికొందరు ఇండియన్ క్రికెటర్లకు కూడా ఆడపిల్లలు ఉన్నారు.

కేవలం ఇండియన్ క్రికెటర్స్ కే కాదు ఇతర క్రీడాకారులకు ఎక్కువగా ఆడపిల్లలే సంతానంగా ఉండటం గమనించే ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా కూడా అగ్రశ్రేణి పుట్ బాల్, వాలీబాల్ క్రీడాకారులు, అథ్లెట్లకు కూతుర్లే ఎక్కువగా ఉంటారు. ఇలా క్రీడాకారులకు మగపిల్లలు పుట్టే అవకాశాలు తక్కువగా, ఆడపిల్లలు పుట్టే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. దీనికి శాస్త్రీయ కారణం కూడా ఉంది... అదేంటో తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
పిల్లల లింగ నిర్ధారణ ఎలా జరుగుతుంది?
Image Credit : Getty

పిల్లల లింగ నిర్ధారణ ఎలా జరుగుతుంది?

సాధారణంగా తల్లి గర్భంలో శిశువు ప్రాణం పోసుకుంటుంది... కానీ పుట్టేది ఆడా, మగా అనేది నిర్ణయించేది మాత్రం తండ్రే. శిశువు లింగనిర్దారణ అంటే ఆడా లేదా మగా అనేది నిర్ణయించేది తండ్రి వీర్యంలోని క్రోమోజోమ్‌లే అనే విషయం సైన్స్ ద్వారా నిరూపించబడింది. మానవ శరీరంలోని ప్రతి కణంలో 23 జతల క్రోమోజోమ్‌లు ఉంటాయి. ఇందులో స్త్రీలలో కేవలం 'XX' క్రోమోజోమ్‌లు మాత్రమే ఉంటాయి. కానీ పురుషుల వీర్య కణాలలో ‘X’, 'Y' (XY) అనే రెండు రకాల క్రోమోజోమ్‌లు ఉంటాయి.

గర్భధారణ సమయంలో తల్లిలోని 'X' క్రోమోజోమ్‌తో, తండ్రి వీర్యంలోని 'X' క్రోమోజోమ్ కలిస్తే ఆడపిల్ల (XX) జన్మిస్తుంది. అదే తల్లిలోని 'X' క్రోమోజోమ్‌తో, తండ్రి వీర్యంలోని 'Y' క్రోమోజోమ్ కలిస్తే మగపిల్లాడు (XY) జన్మిస్తాడు. అంటే పుట్టబోయే బిడ్డ లింగాన్ని నిర్ణయించే కీలకమైన అంశం తండ్రి వీర్యంలో ఉండే X లేదా Y క్రోమోజోమ్ మాత్రమే.

35
X, Y క్రోమోజోమ్‌ల ప్రవర్తన ఎలా ఉంటుంది?
Image Credit : freepik

X, Y క్రోమోజోమ్‌ల ప్రవర్తన ఎలా ఉంటుంది?

పురుషుడి వీర్యంలోని X, Y క్రోమోజోమ్‌లు ఒకేలా ఉండవు... వీటి పరిమాణం, వేగంలో తేడా ఉంటుంది. అలాగే కఠిన పరిస్థితులను తట్టుకునే శక్తిలో కూడా గణనీయమైన వ్యత్యాసాలు ఉంటాయి. ఇదే శిశువు లింగ నిర్దారణలో కీలకంగా మారుతుంది.

Y క్రోమోజోమ్ (మగ బిడ్డకు కారణమయ్యేది) : ఇవి పరిమాణంలో చిన్నవిగా ఉండి, చాలా వేగంగా ఈదగలవు. కానీ ఇవి చాలా సున్నితమైనవి. ప్రతికూల వాతావరణాన్ని లేదా అధిక ఉష్ణోగ్రతలను ఇవి ఎక్కువ సేపు తట్టుకోలేవు. వీటి ఆయుష్షు చాలా తక్కువ.

X క్రోమోజోమ్ (ఆడ బిడ్డకు కారణమయ్యేది) : ఇవి కొద్దిగా పెద్దవిగా, నెమ్మదిగా కదులుతాయి. కానీ ఇవి అత్యంత బలమైనవి. ఎలాంటి ప్రతికూల పరిస్థితులనైనా తట్టుకుని ఎక్కువ సమయం సజీవంగా ఉండే శక్తి వీటికి ఉంటుంది.

45
క్రీడాకారులకు ఆడపిల్లలు పుట్టే ఛాన్సెస్ ఎక్కువ.. ఎందుకో తెలుసా?
Image Credit : x.com

క్రీడాకారులకు ఆడపిల్లలు పుట్టే ఛాన్సెస్ ఎక్కువ.. ఎందుకో తెలుసా?

క్రికెటర్లు, ఇతర క్రీడాకారులు తమ ఫిట్‌నెస్ కోసం నిరంతరం కఠినమైన శిక్షణ పొందుతారు. గంటల తరబడి మైదానంలో వ్యాయామాలు చేయడం, కార్డియో, వెయిట్ లిఫ్టింగ్ వంటి తీవ్రమైన శారీరక శ్రమ చేయడం వల్ల వారి శరీర ఉష్ణోగ్రత సహజంగానే పెరుగుతుంది. అలాగే నిరంతరం మ్యాచ్‌లు ఆడటం, ప్రదర్శన ఒత్తిడికి గురికావడం వల్ల వారి శరీరంలో శారీరక, మానసిక అలసట ఎక్కువగా ఉంటుంది.

వైద్య నిపుణుల ప్రకారం.. పురుషులు కఠినమైన వర్కౌట్లు చేసినప్పుడు లేదా నిరంతరం శారీరక శ్రమకు గురైనప్పుడు వారి వీర్యంలో సున్నితంగా ఉండే 'Y' క్రోమోజోమ్‌ల సంఖ్య తగ్గిపోతుంది. అధిక ఉష్ణోగ్రత, అలసట వల్ల Y క్రోమోజోమ్ కణాలు త్వరగా నశించిపోతాయి లేదా తమ ఈదే సామర్థ్యాన్ని కోల్పోతాయి. కానీ గట్టి నిర్మాణం కలిగిన 'X' క్రోమోజోమ్‌లు ఈ ప్రతికూల పరిస్థితులను, ఒత్తిడిని తట్టుకుని చాలా సేపు సజీవంగా ఉంటాయి. దీనివల్ల గర్భధారణ సమయంలో తండ్రిలోని 'X' క్రోమోజోమ్ తల్లిలోని 'X' క్రోమోజోమ్‌తో కలిసే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయి. ఫలితంగా ఆడపిల్లలు జన్మించే సంభావ్యత ఎక్కువగా ఉంటుంది.

ఆర్మీ సిబ్బంది, అథ్లెట్లలో ఇదే ధోరణి..

కేవలం క్రికెటర్లకే కాదు.. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ వంటి డిఫెన్స్ విభాగాల్లో పనిచేసే సైనికులకు, మారథాన్ రన్నర్లకు, నిరంతరం హెవీ ఫిట్‌నెస్ సాధన చేసే బాడీబిల్డర్లకు కూడా ఎక్కువగా ఆడపిల్లలే జన్మిస్తున్నట్లు పలు అంతర్జాతీయ అధ్యయనాలు పేర్కొంటున్నాయి. రన్నింగ్, కఠినమైన సైనిక శిక్షణ వల్ల శరీరంలో కోర్టిసాల్ వంటి స్ట్రెస్ హార్మోన్లు విడుదలవుతాయి. ఈ జీవరసాయన మార్పులు వీర్యంలోని Y క్రోమోజోమ్‌ల కంటే X క్రోమోజోమ్‌లు మనుగడ సాగించడానికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తాయి.

55
సైన్స్ ఏం చెబుతోంది?
Image Credit : Getty

సైన్స్ ఏం చెబుతోంది?

సంతానం ఆడా లేదా మగా అనేది ప్రకృతి ప్రసాదించే అద్భుతం అయినప్పటికీ... తండ్రి జీవనశైలి, శారీరక శ్రమ, వర్కౌట్లు, శరీర ఉష్ణోగ్రత వంటి అంశాలు బిడ్డ లింగ నిర్ధారణలో పరోక్షంగా కీలక పాత్ర పోషిస్తాయని సైన్స్ వెల్లడిస్తోంది. కాబట్టి ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి క్రీడా దిగ్గజాలకు కుమార్తెలు జన్మించడం వెనుక వారి నిరంతర ఫిట్‌నెస్ సాధన, కఠినమైన శారీరక శ్రమ, శరీర జీవక్రియల్లో జరిగే ఈ మార్పులే ప్రధాన శాస్త్రీయ కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

జిమ్‌లలో తీవ్రంగా శ్రమించే ఫిట్‌నెస్ ప్రేమికులు, సైనిక విభాగాల్లో పనిచేసేవారికి కూడా ఎక్కువగా కుమార్తెలే జన్మించడానికి కూడా ఇదే కారణం. ఇలా క్రీడాకారులకు ఎక్కువగా ఆడపిల్లలు పుట్టడం కాకతాళీయంగా జరిగే విషయం కాదు... దీని వెనుక బలమైన శాస్త్రీయ కారణం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
క్రీడలు
క్రికెట్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
రోడ్లు స్ట్రెయిట్ గా వేస్తే దూరం తగ్గుతుందిగా.. మరి వంకరటింకరగా, మలుపులు తిప్పుతూ ఎందుకు వేస్తారు?
Recommended image2
మేఘాలను తాకే అనుభూతి కావాలా? ఏపీలోని ‘వంజంగి మేఘాల కొండ’ల మీదకు వెళ్లండి
Recommended image3
Snakes : పాములు రోజుకు ఎంత నీరు తాగుతాయి? వాటి దాహం ఎలా తీరుతుంది?
Related Stories
Recommended image1
Baby Boy Names: శ్రీవారి స్ఫూర్తితో చిన్నారుల కోసం అందమైన పేర్లు
Recommended image2
Gender Gap Report: లింగ స‌మాన‌త్వంలో వెనుక‌బ‌డ్డ భార‌త్‌.. మ‌న‌కంటే దిగువ‌న 11 దేశాలే.. !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved