MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Onion Tears : ఉల్లిపాయ కోస్తే కన్నీళ్లు ఎందుకు వస్తాయి? దీని వెనక ఇంత కెమిస్ట్రీ దాగుందా?

Onion Tears : ఉల్లిపాయ కోస్తే కన్నీళ్లు ఎందుకు వస్తాయి? దీని వెనక ఇంత కెమిస్ట్రీ దాగుందా?

ఉల్లిపాయ కోసేటప్పుడు కళ్లలోంచి నీళ్లు రావడం చాలా కామన్ విషయం. మరి ఏ కూరగాయ కోసినా రాని కన్నీరు ఉల్లిపాయలు కోస్తేనే ఎందుకు వస్తాయి…? దీని వెనకున్న కెమిస్ట్రీ ఏంటి?

2 Min read
Author : Arun Kumar P
| Updated : Sep 01 2026, 05:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఉల్లిపాయ కోస్తే కన్నీళ్లు ఎందుకు వస్తాయి?
Image Credit : Gemini AI

ఉల్లిపాయ కోస్తే కన్నీళ్లు ఎందుకు వస్తాయి?

తెలుగువారి వంటింట్లో ఎక్కువగా ఉపయోగించే కూరగాయ ఏదంటే చాాలామంది గృహిణుల నుండి వచ్చే సమాధానం… ఉల్లిపాయ. కూర, పప్పు, సాంబార్… ఇలా ప్రతి వంటకంలో ఉల్లిపాయ ఉండాల్సిందే… చివరికి బిర్యానీ తింటున్నా పక్కన ఉల్లిపాయ నంజుకోవాల్సిందే.

అయితే వంటలో ఎంత పెద్ద ఎక్స్‌పర్ట్ అయినా సరే ఉల్లిపాయ కోసేటప్పుడు కళ్లలో మంట, నీళ్లు రావడం ఖాయం. ఇది కేవలం ఉల్లి ఘాటు వల్ల మాత్రమే కాదు. దీని వెనుక ఓ ఆసక్తికరమైన కెమిస్ట్రీ ఉందని తెలుస్తోంది. ఉల్లిపాయల వెనకున్న ఆ సైన్స్ రహస్యం ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
అసలు సైన్స్ సీక్రెట్ ఏంటి?
Image Credit : pinterest

అసలు సైన్స్ సీక్రెట్ ఏంటి?

మనం ఉల్లిపాయను కోసినప్పుడు దాని కణాలు దెబ్బతిని 'అల్లినేస్', 'లాక్రిమేటరీ ఫాక్టర్ సింథేస్ (Lachrymatory Factor Synthase - LFS)' అనే ఎంజైమ్‌లు విడుదలవుతాయి. ఇవి ఉల్లిపాయలోని అమైనో ఆమ్లాలతో చర్య జరిపి సల్పెనిక్ ఆమ్లాన్ని, 'సిన్-ప్రోపనెథియల్-ఎస్-ఆక్సైడ్' అనే ఘాటైన గ్యాస్‌ను విడుదల చేస్తాయి. ఈ వాయువు గాలితొ చర్య జరిపి కళ్లలో మంట పుట్టిస్తుంది.

34
కన్నీళ్లు తెప్పించే ఫ్యాక్టర్
Image Credit : pinterest

కన్నీళ్లు తెప్పించే ఫ్యాక్టర్

ఈ సిన్-ప్రోపనెథియల్-ఎస్-ఆక్సైడ్ అనే వాయువు గాలిలో కలిసి మన కళ్లను చేరుతుంది… అక్కడ కంటిలోని నరాలను ప్రేరేపించి మంట పుట్టిస్తుంది. అప్పుడు కళ్లను రక్షించుకోవడానికి, మన కన్నీటి గ్రంథులు ఎక్కువగా కన్నీళ్లను ఉత్పత్తి చేస్తాయి. అందుకే ఉల్లిపాయ కోసేటప్పుడు మనకు ఏడుపు వస్తుంది. దీన్నే సైంటిస్టులు 'లాక్రిమేటరీ ఫ్యాక్టర్' (lachrymatory factor) అని పిలుస్తారు.

2017లో 'ACS కెమికల్ బయాలజీ' జర్నల్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం… ఉల్లిపాయలో మనిషి కన్నీళ్లకు కారణమయ్యే రసాయనం ఏర్పడటంలో లాక్రిమేటరీ ఫ్యాక్టర్ సింథేస్ (LFS) ఎంజైమ్ కీలక పాత్ర పోషిస్తుందని తేలింది. అంటే ఉల్లిపాయ మనల్ని ఎమోషనల్‌గా ఏడిపించదు. దాని కణాలు దెబ్బతిన్నప్పుడు విడుదలయ్యే ఒక రసాయన వాయువే మన కళ్లలో మంట పుట్టించి కన్నీళ్లు తెప్పిస్తుంది. ఇదంతా పక్కా సైన్స్!

44
కన్నీళ్లు రాకుండా ఉల్లిపాయ కోయడానికి సింపుల్ టిప్స్
Image Credit : pinterest

కన్నీళ్లు రాకుండా ఉల్లిపాయ కోయడానికి సింపుల్ టిప్స్

1. మొద్దుబారిన కత్తితో కోస్తే ఉల్లి కణాలు ఎక్కువగా దెబ్బతింటాయి. దీనివల్ల రసాయనాలు ఎక్కువ రిలీజ్ అవుతాయి. అందుకే పదునైన కత్తి వాడితే కణాలకు నష్టం తక్కువగా ఉంటుంది. మంట కూడా తగ్గుతుంది.

2. కిటికీ దగ్గర లేదా ఎగ్జాస్ట్ ఫ్యాన్ (exhaust fan) కింద ఉల్లిపాయ కోయండి. దీనివల్ల ఆ రసాయన వాయువులు గాలిలో కలిసిపోయి, నేరుగా కళ్లకు చేరకుండా ఉంటాయి.

3. కోసిన ఉల్లిపాయలను ఎక్కువసేపు గాలికి వదిలేయొద్దు. అలాంటి వాటిని మళ్లీ కోసేటప్పుడు కళ్లమంట ఎక్కువగా ఉంటుంది.

4. ఉల్లిపాయను కోసే ముందు కాసేపు నీళ్లలో నానబెట్టడం కూడా మంచిదే. దీనివల్ల ఘాటు తగ్గి కంటనీరు తక్కువగా వస్తాయి.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఆహారం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఉన్నదాంతో తృప్తి చెందకపోతే.. ఉన్నది కూడా పోతుంది. జీవిత సత్యాన్ని చాటే గొప్ప కథ
Recommended image2
Psychology: సైకాలజీ ప్రకారం ఒక వ్యక్తి నిజంగా ఎలాంటివాడో చెప్పే 5 సందర్భాలు ఇవే!
Recommended image3
IndianRailways: మంచుకొండల్లో రైల్వే వంతెన.. కిటికీలోంచి కశ్మీర్ అందాలు చూడొచ్చు.. ఈ ట్రైన్ జర్నీ మిస్ కావొద్దు
Related Stories
Recommended image1
ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లు రాకూడదంటే ఈ చిన్న సింపుల్ ట్రిక్స్ చాలు
Recommended image2
Onion Price : తెలుగోళ్లూ రెడీగా ఉండండి.. బస్తాల కొద్దీ ఉల్లిపాయలు కొనే టైమొచ్చింది, మిస్ అయ్యారో అంతే సంగతి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved