MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Feature
  • Train Horn Meaning: ట్రైన్ హారన్ వెనుక ఇంత అర్థముందా? ఇవి కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!

Train Horn Meaning: ట్రైన్ హారన్ వెనుక ఇంత అర్థముందా? ఇవి కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!

Train Horn Meaning: సాధారణంగా ట్రైన్ రకరకాల హారన్స్ ఇస్తూ ఉంటుంది. నిజానికి వాటి వెనుక ప్రత్యేక సంకేతాలు, అర్థాలు దాగి ఉంటాయని చాలామందికి తెలియదు. అసలు రైలు ఎలాంటి హారన్స్ ఇస్తుంది. ఏ హారన్ ఏ సంకేతాన్ని సూచిస్తుందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం. 

2 Min read
Author : Kavitha G
Published : Jun 08 2026, 12:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రైలు కూత వెనుక ఉన్న అర్థాలు
Image Credit : Getty

రైలు కూత వెనుక ఉన్న అర్థాలు

మనలో చాలామంది రైళ్లలో ప్రయాణిస్తూ ఉంటారు. రైల్వే స్టేషన్‌లో నిలబడి ఉన్నప్పుడు లేదా రైల్వే క్రాసింగ్ దగ్గర వెయిట్ చేస్తున్నప్పుడు రైలు కూత వినిపించడం సాధారణమే. అయితే లోకో పైలట్ ఇచ్చే ప్రతి హారన్ వెనుక ఒక ప్రత్యేక అర్థం ఉంటుందని చాలామందికి తెలియదు. ప్రయాణికులకు, రైల్వే సిబ్బందికి, ట్రాక్ సమీపంలో ఉన్న వారికి ముఖ్యమైన సమాచారాన్ని చేరవేయడానికి ఈ హారన్ సంకేతాలను ఉపయోగిస్తారు. ఇక్కడ రైలు హారన్ రకాల గురించి, వాటి అర్థాల గురించి తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఒక చిన్న హారన్
Image Credit : Getty

ఒక చిన్న హారన్

రైలు ఒక చిన్న హారన్ ఇచ్చినప్పుడు సాధారణంగా అది రైల్వే యార్డ్‌లోకి వెళ్లబోతున్నట్లు లేదా ఇంజిన్‌ను మరో లైన్‌కు మార్చే ప్రక్రియలో ఉన్నట్లు సూచిస్తుంది. ఇది సాధారణ ఆపరేషన్‌కు సంబంధించిన సంకేతంగా భావిస్తారు.

రెండు చిన్న హారన్లు

రెండు చిన్న హారన్లు వినిపిస్తే రైలు బయలుదేరడానికి సిద్ధంగా ఉందని అర్థం. స్టేషన్‌లో గార్డ్ లేదా ఇతర సిబ్బందికి ఇది ఒక సంకేతంగా పనిచేస్తుంది. కొన్ని సందర్భాల్లో రైలు కదలబోతుందని కూడా ఈ హారన్ ద్వారా తెలియజేస్తారు.

Related Articles

Related image1
Railway Track: రైలు పట్టాలపై కంకర రాళ్లు ఎందుకు ఉంటాయో ఎప్పుడైనా ఆలోచించారా?
Related image2
Train Ticket Booking Tips: ట్రైన్ టికెట్ బుక్ చేసేటప్పుడు ఈ 5 ఫాలో అయితే చాలా డబ్బులు ఆదా!
35
మూడు చిన్న హారన్లు
Image Credit : X

మూడు చిన్న హారన్లు

ఇది చాలా అరుదుగా వినిపించే సంకేతం. మూడు చిన్న హారన్లు సాధారణంగా బ్రేక్ వ్యవస్థలో సమస్య ఉన్నప్పుడు లేదా అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు ఉపయోగిస్తారు. ఈ సంకేతం రైల్వే సిబ్బంది వెంటనే స్పందించాల్సిన అవసరాన్ని సూచిస్తుంది.

ఒక లాంగ్ హారన్

ఒక లాంగ్ హారన్ సాధారణ హెచ్చరిక సంకేతం. రైలు స్టేషన్‌ను దాటుతున్నప్పుడు, ట్రాక్ సమీపంలో ప్రజలు లేదా జంతువులు ఉన్నప్పుడు, లేదా ముందున్న వారికి జాగ్రత్త చెప్పాల్సిన సందర్భాల్లో ఈ హారన్ వినిపిస్తుంది. రైల్వే క్రాసింగ్‌ల దగ్గర కూడా ఇది తరచుగా వినిపిస్తుంది.

45
రెండు లాంగ్ హారన్లు
Image Credit : Getty

రెండు లాంగ్ హారన్లు

రైలు ఒక స్టేషన్‌ను దాటబోతున్నప్పుడు లేదా వేగంగా ముందుకు కదులుతున్నప్పుడు రెండు లాంగ్ హారన్లు వినిపించవచ్చు. ఇది ట్రాక్‌పై ఉన్న సిబ్బంది, ఇతరులకు హెచ్చరికగా పనిచేస్తుంది.

లాంగ్ హారన్ తర్వాత ఒక షార్ట్ హారన్

ఈ సంకేతం సాధారణంగా రైలు ప్రయాణంలో బ్రేక్ పరీక్షలు లేదా ఇతర సాంకేతిక ప్రక్రియలకు సంబంధించింది. రైల్వే సిబ్బంది మధ్య సమాచార మార్పిడికి ఇది ఉపయోగపడుతుంది.

55
వరుసగా చిన్న హారన్లు
Image Credit : Getty

వరుసగా చిన్న హారన్లు

రైలు వరుసగా చిన్న చిన్న హారన్లు ఇస్తుంటే అది ప్రమాద హెచ్చరికగా భావించాలి. ట్రాక్‌పై ఎవరైనా ఉన్నప్పుడు, వాహనం క్రాసింగ్ వద్ద ఆగకుండా ముందుకు వచ్చినప్పుడు లేదా ఇతర ప్రమాదకర పరిస్థితుల్లో లోకో పైలట్ ఈ విధంగా హారన్ మోగిస్తారు. అలాంటి సమయంలో వెంటనే ట్రాక్‌లకు దూరంగా వెళ్లడం మంచిది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
ప్రయాణం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
సచిన్, ధోని, రోహిత్, కోహ్లీ లకు ఆడపిల్లలే పుట్టడానికి కారణమేంటో తెలుసా?
Recommended image2
Nepal Tourism : నేపాల్ లో ఇండియన్స్ అత్యధికంగా సందర్శించే టూరిస్ట్ స్పాట్స్ ఇవే..
Recommended image3
Facilities in Jail : జైల్లో ఖైదీలకు బెడ్, పరుపు, దుప్పటి ఇస్తారా? స్నానానికి సబ్బు సంగతేంటి?
Related Stories
Recommended image1
Railway Track: రైలు పట్టాలపై కంకర రాళ్లు ఎందుకు ఉంటాయో ఎప్పుడైనా ఆలోచించారా?
Recommended image2
Train Ticket Booking Tips: ట్రైన్ టికెట్ బుక్ చేసేటప్పుడు ఈ 5 ఫాలో అయితే చాలా డబ్బులు ఆదా!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved