MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Feature
  • Beer Facts: బీర్‌లో నురగ ఎందుకు వస్తుంది? 6 వేల ఏళ్ల చరిత్ర వెనుక ఆసక్తికర విషయాలివే

Beer Facts: బీర్‌లో నురగ ఎందుకు వస్తుంది? 6 వేల ఏళ్ల చరిత్ర వెనుక ఆసక్తికర విషయాలివే

Beer Facts: బీర్‌.. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన ఆల్కహాలిక్ డ్రింక్స్ లో ఒకటి. అయితే మనం గ్లాసులో బీర్ పోసినప్పుడు పైకి వచ్చే నురగు వెనుక కూడా ఓ శాస్త్రీయ కారణం ఉందని మీకు తెలుసా.?

2 Min read
Author : Narender Vaitla
Published : Sep 01 2026, 04:41 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బీర్‌కు సుమారు 6 వేల ఏళ్ల చరిత్ర
Image Credit : Gemini AI

బీర్‌కు సుమారు 6 వేల ఏళ్ల చరిత్ర

బీర్‌ కు దాదాపు 6,000 సంవత్సరాల చరిత్ర ఉందని చెబుతున్నారు. పురాతన మెసపొటేమియా ప్రాంతంలో ధాన్యాలను పులియబెట్టి తయారు చేసిన పానీయాలు బీర్‌కు తొలి రూపంగా భావిస్తారు. కాలక్రమంలో తయారీ పద్ధతులు అభివృద్ధి చెందుతూ.. ప్రస్తుతం ప్రపంచంలో వందల రకాల బీర్‌లు అందుబాటులోకి వచ్చాయి. బార్లీ ప్రధాన ముడిపదార్థంగా ఉండే బీర్‌లో కొన్ని రకాల ధాన్యాలను కూడా ఉపయోగిస్తారు. గోధుమ, మొక్కజొన్న, బియ్యం వంటి ధాన్యాలను ఆయా బీర్ రకాల ఆధారంగా కలుపుతారు. అందుకే ఒక్కో బీర్‌కు రుచి, రంగు, వాసనలో తేడా కనిపిస్తుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
బీర్ తయారీలో నాలుగు అంశాలు కీలకం
Image Credit : https://chatgpt.com/

బీర్ తయారీలో నాలుగు అంశాలు కీలకం

బీర్ తయారీలో ప్రధానంగా మాల్ట్, హాప్స్, ఈస్ట్, కార్బన్ డయాక్సైడ్ కీలక పాత్ర పోషిస్తాయి. ముందుగా బార్లీ గింజలను మొలకెత్తించి మాల్ట్‌గా తయారు చేస్తారు. ఈ ప్రక్రియలో ఏర్పడే ఎంజైమ్‌లు బార్లీలోని పిండి పదార్థాలను చక్కెరలుగా మార్చేందుకు సహాయపడతాయి. హాప్స్‌ను బీర్‌కు చేదు, ప్రత్యేకమైన సువాసన, రుచి అందించేందుకు ఉపయోగిస్తారు. మరోవైపు ఈస్ట్ చక్కెరలను పులియబెట్టి ఆల్కహాల్‌తో పాటు కార్బన్ డయాక్సైడ్‌ను ఉత్పత్తి చేస్తుంది. చివరగా బీర్‌లో ఉండే CO₂ దాని బుడగలు, ఫిజినెస్‌కు కారణమవుతుంది.

35
మాల్టెడ్ బార్లీ నుంచి బీర్ ఎలా తయారవుతుంది?
Image Credit : Google

మాల్టెడ్ బార్లీ నుంచి బీర్ ఎలా తయారవుతుంది?

బీర్ తయారీ ప్రక్రియను సాధారణంగా బ్రూయింగ్ అంటారు. ముందుగా బార్లీని నియంత్రిత పరిస్థితుల్లో మొలకెత్తిస్తారు. ఆ తర్వాత వేడి చేయడం ద్వారా మొలకల పెరుగుదలను ఆపి మాల్ట్‌ను సిద్ధం చేస్తారు.ఈ మాల్ట్‌ను నీటితో కలిపి వేడి చేస్తే అందులోని పిండి పదార్థాలు చక్కెరలుగా మారతాయి. ఇలా తయారయ్యే తీపి ద్రవాన్ని వార్ట్ (Wort) అంటారు. అనంతరం దీనిని మరిగించి హాప్స్‌ను కలుపుతారు. హాప్స్ వల్ల బీర్‌కు చేదు, సువాసన వస్తాయి. తర్వాత వార్ట్‌ను చల్లబరిచి ఈస్ట్‌ను కలుపుతారు. ఈ దశలో ఫెర్మెంటేషన్ జరుగుతుంది. ఈస్ట్ చక్కెరలను ఆల్కహాల్‌, కార్బన్ డయాక్సైడ్‌గా మార్చుతుంది. ఆ తర్వాత బీర్‌ను అవసరాన్ని బట్టి ఫిల్టర్ చేసి, ప్యాక్ చేస్తారు.

45
గ్లాసులో పోయగానే నురగ ఎందుకు వస్తుంది?
Image Credit : Getty

గ్లాసులో పోయగానే నురగ ఎందుకు వస్తుంది?

బీర్‌లో నురగ రావడానికి ప్రధాన కారణం కార్బన్ డయాక్సైడ్ (CO₂). ఫెర్మెంటేషన్ సమయంలో సహజంగా ఏర్పడే CO₂లో కొంత భాగం బీర్‌లో కరిగి ఉంటుంది. కొన్ని బీర్‌లలో తయారీ చివరి దశలో అదనంగా కార్బొనేషన్ కూడా చేస్తారు. బాటిల్ లేదా క్యాన్ నుంచి బీర్‌ను గ్లాసులో పోసినప్పుడు ఒత్తిడి ఒక్కసారిగా తగ్గుతుంది. దీంతో బీర్‌లో కరిగి ఉన్న CO₂ చిన్న చిన్న బుడగల రూపంలో బయటకు రావడం ప్రారంభిస్తుంది. ఈ బుడగలు పైకి చేరుతూ బీర్‌లోని కొన్ని ప్రోటీన్లు, ఇతర సమ్మేళనాలతో కలిసి ఫోమ్ లేదా హెడ్‌‌ను ఏర్పరుస్తాయి. అందుకే గ్లాసులో బీర్ పోయగానే పైభాగంలో తెల్లటి నురగ కనిపిస్తుంది. గ్లాసును ఏ కోణంలో పట్టుకుని పోస్తున్నారు, బీర్ ఉష్ణోగ్రత ఎంత ఉంది, గ్లాసు ఆకారం ఎలా ఉంది వంటి అంశాలు కూడా నురగ పరిమాణాన్ని ప్రభావితం చేస్తాయి.

55
బీర్ రుచి, వాసనలో నీటి పాత్ర కూడా కీలకమే
Image Credit : Asianet News

బీర్ రుచి, వాసనలో నీటి పాత్ర కూడా కీలకమే

బీర్‌లో ప్రధాన భాగం నీరే. సాధారణంగా బీర్‌లో 90 శాతానికి పైగా నీరు ఉండొచ్చు. అయితే కేవలం నీటి పరిమాణమే కాదు.. అందులో సహజంగా ఉండే ఖనిజాలు కూడా బీర్ తుది రుచిపై ప్రభావం చూపుతాయి. మాల్ట్ బీర్‌కు తీపి, ధాన్యపు రుచిని అందిస్తే.. హాప్స్ చేదు, సువాసనను ఇస్తాయి. ఈస్ట్ ఫెర్మెంటేషన్ ద్వారా ఆల్కహాల్‌, CO₂తో పాటు బీర్ రుచిపై ప్రభావం చూపే ఇతర సమ్మేళనాలను కూడా ఉత్పత్తి చేస్తుంది. వీటన్నింటి సమతుల్యతే ఒక్కో బీర్‌కు ప్రత్యేకమైన రుచి, వాసన, రంగు, నురుగును అందిస్తుంది. సాధారణ బీర్‌లలో ఆల్కహాల్ శాతం ఎక్కువగా 4% నుంచి 8% ABV మధ్య ఉంటుంది. అయితే బీర్ రకాన్ని బట్టి ఈ స్థాయి గణనీయంగా మారొచ్చు. ముఖ్యంగా కొన్ని స్ట్రాంగ్ లేదా క్రాఫ్ట్ బీర్‌లలో ఆల్కహాల్ శాతం మరింత ఎక్కువగా ఉండవచ్చు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వైరల్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Unique Temples : దేవుళ్లకు నైవేద్యంగా మందు, మటన్, చేపలు.. భక్తులకూ ఇవే ప్రసాదం.. ఎక్కడో తెలుసా?
Recommended image2
Telugu Saying: లోకువ మొగుడికి నూకల జావ! ఈ సామెత అసలు అర్థం ఏంటో తెలుసా?
Recommended image3
గాలి నుంచి కరెంట్ ఎలా తయారవుతుంది.? విండ్ టర్బైన్ వెనుక అసలు ప్రాసెస్ ఇదే
Related Stories
Recommended image1
మీరు ఇంట్లో ఖాళీగా కూర్చున్నా సరే.. నెలకు రూ. 20 వేల ఆదాయం మీ సొంతం
Recommended image2
Facts: చెక్‌పై రాసే మొత్తానికి చివర ‘Only’ ఎందుకు రాస్తారు.? అసలు కారణం ఏంటంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved