MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Facilities in Jail : జైల్లో ఖైదీలకు బెడ్, పరుపు, దుప్పటి ఇస్తారా? స్నానానికి సబ్బు సంగతేంటి?

Facilities in Jail : జైల్లో ఖైదీలకు బెడ్, పరుపు, దుప్పటి ఇస్తారా? స్నానానికి సబ్బు సంగతేంటి?

జైలులో ఖైదీలకు లగ్జరీ ఉండదు… కానీ కనీస సదుపాయాలు మాత్రం ఉంటాయి. మరి ఖైదీలు పడుకోడానికి బెడ్, మ్యాట్రెస్, బ్లాంకెట్ ఇస్తారా? స్నానానికి సబ్బు ఇస్తారా..?

2 Min read
Author : Arun Kumar P
Published : Sep 01 2026, 01:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
జైల్లో ఖైదీలకు కల్పించే సదుపాయాలేంటి?
Image Credit : Gemini AI

జైల్లో ఖైదీలకు కల్పించే సదుపాయాలేంటి?

Facilities in Jail : తప్పు చేసినవారిని శిక్షించేందుకు ప్రభుత్వాలు జైళ్లను ఉపయోగిస్తాయి. కోర్టులు జైలు శిక్ష విధించగా పోలీసులు దాన్ని అమలుచేస్తారు... ఇలా ప్రభుత్వం, కోర్టులు, పోలీస్ వ్యవస్థలు కలిసి జైళ్ల పర్యవేక్షణ చూసుకుంటాయి. నేరాలకు పాల్పడినవారిలో పరివర్తన తీసుకువచ్చేలా జైలు శిక్షను అమలుచేస్తారు... అందుకే ఇక్కడ చాలా కఠిన నియమ నిబంధనలు పాటిస్తారు. మరి భారతదేశంలోని జైళ్లలో ఖైదీలకు ఎలాంటి సదుపాయాలు కల్పిస్తారో ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
జైల్లో ఖైదీలకు బెడ్ ఉంటుందా?
Image Credit : Gemini AI

జైల్లో ఖైదీలకు బెడ్ ఉంటుందా?

జైళ్ల నిర్వహణ అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం... కాబట్టి ఒక్కోరాష్ట్రంలోని ఖైదీలకు ఒక్కో రకమైన సదుపాయాలు ఉంటాయి. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో అయితే జైలులోని సాధారణ ఖైదీలకు బెడ్ (మంచం) ఉండదు.. నేలపైనే పడుకోవాలి. అయితే కింద పర్చుకోడానికి బెడ్ షీట్ లేదా చాప ఇస్తారు.... అలాగే కప్పుకోడానికి దుప్పటి కూడా అందిస్తారు.

అయితే కోర్టు అనుమతితో లేదా ఆరోగ్య కారణాలతో డాక్టర్ల సూచనమేరకు కొందరు ఖైదీలు బెడ్ సదుపాయం పొందవచ్చు. ఇక విఐపి ఖైదీలను జైలులోని ప్రత్యేక బ్యారక్స్ లో ఉంచుతారు... ఇందులో బెడ్ తో పాటు టేబుల్, కుర్చీ వంటి ప్రత్యేక వసతులు ఉంటాయి. కోర్టు అనుమతితో టీవి, న్యూస్ పేపర్ సదుపాయాన్ని కూడా కొందరు విఐపి ఖైదీలు పొందుతుంటారు.

ఇండియాలో ఆధునిక జైళ్లు వస్తున్నాయి... వీటిలో ఖైదీలకు విదేశీ జైళ్ల తరహా సదుపాయాలను కల్పిస్తున్నారు. ఖైదీలకు మెరుగైన వసతులు కల్పించేందుకు బంక్ బెడ్స్ అంటే ఒకదానిపై ఒకటి ఉండే మంచాలను ఏర్పాటుచేస్తున్నారు. ఇలా ఇటీవల కాలంలో నిర్మించిన సెంట్రల్ జైళ్ళలో సాధారణ ఖైదీలకు కూడా బెడ్ సదుపాయం కల్పిస్తున్నారు.

35
జైళ్లలోనే బెడ్ షీట్స్, దుప్పట్లు తయారీ
Image Credit : Gemini

జైళ్లలోనే బెడ్ షీట్స్, దుప్పట్లు తయారీ

తెలంగాణ జైళ్లలో ఖైదీలు ఉపయోగించే బెడ్ షీట్స్, దుప్పట్లను స్వయంగా వాళ్లు తయారుచేసుకున్నవే ఉంటాయి. అంటే జైళ్ల శాఖ ఆధ్వర్యంలో ఖైదీలతో వీటిని తయారుచేయిస్తారు... రాష్ట్రంలోని అన్ని జైళ్లకు సరఫరా చేస్తారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే పోలీస్ శిక్షణా కేంద్రాల్లోనూ ఖైదీలు తయారుచేసిన బెడ్ షీట్స్, దుప్పట్లనే వాడతారు.

ఖైదీలు వాడే అనేక వస్తువులను వాళ్లే తయారుచేసుకుంటున్నట్లు తెలంగాణ జైళ్ల శాఖ చెబుతోంది. ఖైదీల డ్రెస్సులు, రంగురంగుల బెడ్ షీట్లు, టవల్స్, నాప్కిన్లు, లుంగీలు తయారు చేయడంలోనూ అనేకమంది నైపుణ్యం, పాక్షిక నైపుణ్యం గలవారు పనిచేస్తున్నారని చెబుతోంది. ఖైదీలు, జైలు సిబ్బంది పరుపుల కోసం పిట్‌లూమ్ దర్రీలను తయారు చేస్తున్నారు... వీటిని తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జైళ్లకు సరఫరా చేస్తున్నారు.

45
జైళ్లలో పిల్లోస్ ఇవ్వరు.. ఎందుకో తెలుసా?
Image Credit : Getty

జైళ్లలో పిల్లోస్ ఇవ్వరు.. ఎందుకో తెలుసా?

జైలులో ఖైదీలకు బెడ్ షీట్స్, పరుపులు ఇచ్చినా పిల్లో (దిండు) మాత్రం ఇవ్వరు. ఖైదీలు తమకు తాము హాని చేసుకోడానికి లేదా ఇతరులపై అటాక్ చేయడానికి దిండును ఉపయోగించే అవకాశాలు ఉంటాయి.. అందుకే వీటిపై జైళ్లశాఖ నిషేదం విధించింది. బ్లేడ్లు, మొనదేలిన వస్తువులు, మాదకద్రవ్యాలు, మొబైల్ ఫోన్ల మాదిరిగానే దిండును కూడా జైలు నిషేదిత జాబితాలో చేర్చారు.

55
ఖైదీల స్నానానికి సబ్బు ఇస్తారా?
Image Credit : Gemini AI

ఖైదీల స్నానానికి సబ్బు ఇస్తారా?

జైల్లో ఖైదీల పరిశుభ్రత విషయంలో అధికారులు చాలా కఠినంగా వ్యవహరిస్తారు. అందుకే ఖైదీలు ప్రతిరోజు స్నానం చేయాల్సిందే... ఎవరి బట్టలు వాళ్లు ఉతుక్కోవాల్సిందే. అయితే తెలంగాణలో ఖైదీలు తమ అవసరాల కోసం సబ్బులను స్వయంగా తయారుచేసుకుంటారు... బట్టల సబ్బుల ఉత్పత్తి కూడా జైల్లో జరుగుతుంది. తమ అవసరాలకు సరిపడా ఉపయోగించుకుని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ సంస్థలకు కూడా ఈ సబ్బులను సరఫరా చేస్తోంది జైళ్ళ శాఖ. ఇక రాష్ట్రంలోని అన్ని జైళ్ల పారిశుధ్యం కోసం ఖైదీలతో బ్లాక్ ఫినైల్‌ను తయారు చేయిస్తోంది తెలంగాణ హోంశాఖ.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
రోడ్లు స్ట్రెయిట్ గా వేస్తే దూరం తగ్గుతుందిగా.. మరి వంకరటింకరగా, మలుపులు తిప్పుతూ ఎందుకు వేస్తారు?
Recommended image2
మేఘాలను తాకే అనుభూతి కావాలా? ఏపీలోని ‘వంజంగి మేఘాల కొండ’ల మీదకు వెళ్లండి
Recommended image3
Snakes : పాములు రోజుకు ఎంత నీరు తాగుతాయి? వాటి దాహం ఎలా తీరుతుంది?
Related Stories
Recommended image1
Education In Jail: జైలు గోడల మధ్యే కాలేజీ చదువులు.. ఖైదీలకు ఇలాంటి ఛాన్స్ ఉందా? ఈ రూల్స్ తెలిస్తే షాకవుతారు
Recommended image2
Jail Food : జైలులోని ఖైదీలకు ఏమేం ఫుడ్ ఐటమ్స్ పెడతారో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved