MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Birds: ఈ గ్రామంలో పక్షులన్నీ ఒకేసారి ఆత్మహత్య చేసుకుంటాయి.. అది కూడా సెప్టెంబర్ నెలలోనే.. ఎందుకో తెలుసా?

Birds: ఈ గ్రామంలో పక్షులన్నీ ఒకేసారి ఆత్మహత్య చేసుకుంటాయి.. అది కూడా సెప్టెంబర్ నెలలోనే.. ఎందుకో తెలుసా?

Birds: ప్రతి ఏడాది సెప్టెంబర్ నెల వస్తే చాలు.. కుప్పల కొద్దీ పక్షులు అర్థరాత్రి పూట కుప్పలు తెప్పలుగా ఒక గ్రామంలో ఆత్మహత్య చేసుకుంటాయి. దీని వెనక కారణం ఏంటో తెలుసా?

2 Min read
Author : ramya Sridhar
Published : Sep 01 2026, 05:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Birds
Image Credit : Pixabay

Birds

మన దేశంలో చాలా రకాల పక్షులు ఉన్నాయి. పక్షులు ఒక్కో ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలసలు వెళుతూ ఉంటాయి.. వస్తూ ఉంటాయి. కానీ, కుప్పలు తెప్పలుగా ఒకే గ్రామంలో చనిపోవడం గురించి ఎప్పుడైనా విన్నారా? ఈ సంఘటన అస్సాంలోని డిమా హసావో జిల్లాలోని జటింగాలో ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటుంది. పక్షులు ఇలా ఎందుకు చనిపోతున్నాయి? ఇక్కడ మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది అనే విషయాలు ఇప్పుడు చూద్దాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
అక్కడ ఏం జరుగుతుంది..?
Image Credit : Gemini AI

అక్కడ ఏం జరుగుతుంది..?

ప్రతి సంవత్సరం వర్షాకాలంలో చివరలో సెప్టెంబర్ నుంచి నవంబర్ మధ్య అమావాస్య లేదా చీకటి రాత్రుల్లో ఈ వింత జరుగుతుంది. రాత్రి 7 గంటల నుంచి 10 గంటల సమయంలో దట్టమైన పొగమంచు, ఈదురుగాలులు, వర్షం ఉన్నప్పుడు పక్షులు ఉన్నట్లుండి.. గ్రామంలో వెలుగుతున్న దీపాల వైపు దూసుకొచ్చు కింద పడిపోతూ ఉంటాయి.

పక్షులు నిజంగా ఆత్మహత్య చేసుకుంటాయా?

పక్షులు నిజంగా ఆత్మహత్య చేసుకుంటాయా అంటే.. చేసుకోవు. జీవశాస్త్రం ప్రకారం పక్షులకు 'ఆత్మహత్య' చేసుకునే ఉద్దేశం లేదా ఆలోచనా శక్తి ఉండదు. అసలు కారణం దిశానిర్దేశం కోల్పోవడం వల్ల ఇలా జరుగుతుంది. భారీ గాలులు, దట్టమైన పొగమంచు ఉన్నప్పుడు పక్షులు ఎటు ఎగరాలో తెలియక అయోమయానికి గురవుతాయి. ఆ కారుచీకట్లో గ్రామంలోని దీపాలు లేదా గ్రామస్తులు వెలిగించిన మంటల వెలుతురు మాత్రమే వాటికి కనిపిస్తుంది. ఆ కాంతి వైపు అత్యంత వేగంగా దూసుకువచ్చే క్రమంలో.. వాతావరణంలో అస్పష్టంగా ఉండే చెట్లు, ఇళ్ల గోడలు, కరెంటు స్తంభాలను బలంగా ఢీకొడతాయి. ఆ దెబ్బకు గాయాలపాలై, స్పృహతప్పి నేలకూలుతాయి.

33
ఈ పక్షులు ఎక్కడి నుంచి వస్తాయి..?
Image Credit : Gemini AI

ఈ పక్షులు ఎక్కడి నుంచి వస్తాయి..?

చాలామంది ఇవి సుదూర ప్రాంతాల నుండి వచ్చే వలస పక్షులు అని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. పాండ్ హెరాన్, కింగ్‌ఫిషర్, టైగర్ బిట్టర్న్ వంటి సుమారు 44 రకాల స్థానిక అటవీ పక్షులే ఈ ప్రమాదానికి గురవుతాయి. వీటిలో ఎక్కువ శాతం సరిగ్గా ఎగరడం తెలియని చిన్న పక్షులు ఉంటాయి.

గ్రామస్థులు ఏమంటున్నారంటే...

దశాబ్దాల క్రితం, రాత్రిపూట ఆకాశం నుంచి కిందపడుతున్న పక్షులను చూసి గ్రామస్తులు వాటిని 'దుష్టశక్తులు' లేదా ఆకాశం నుంచి వస్తున్న దెయ్యాలుగా భావించి కర్రలతో కొట్టి చంపేసేవారు. ఈ ఆచారమే జటింగా మిస్టరీని మరింత భయంకరంగా మార్చింది.

ప్రస్తుతం అటవీ శాఖ అధికారులు, పక్షి శాస్త్రవేత్తలు చేసిన కృషి వల్ల గ్రామస్తుల్లో మార్పు వచ్చింది. ఇప్పుడు వారు కిందపడిన పక్షులను చంపకుండా సురక్షిత ప్రాంతంలో ఉంచి, మరుసటి రోజు ఉదయం తిరిగి గాలిలోకి వదిలేస్తున్నారు. అలాగే ఆ నిర్దిష్ట నెలల్లో గ్రామాల్లో అనవసరంగా పెద్ద పెద్ద లైట్లు వేయకుండా జాగ్రత్త పడుతున్నారు. కాబట్టి, ఈ పక్షులు నిజంగా పక్షుల ఆత్మహత్య ఏదీ లేదు..

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Dinner Mistakes: రాత్రి భోజనం విషయంలో 90 శాతం మంది చేసే 5 తప్పులు ఇవే!
Recommended image2
Maggi Masala: ఇంట్లోనే కేవలం పది నిమిషాల్లో మ్యాగీ మసాలా..ఎలా చేయాలో తెలుసా?
Recommended image3
Gold Necklaces: అరతులంలో అదిరిపోయే బంగారు నెక్లెస్ డిజైన్లు
Related Stories
Recommended image1
Cooking Tips: అన్నం కానీ, పప్పు కానీ మాడిపోయిందా? నిమిషాల్లో ఆ మాడువాసన పోగొట్టే చిట్కా ఇది..!
Recommended image2
Washing Machine:వాషింగ్ మెషిన్‌లో ఐస్ క్యూబ్స్ వేస్తే.. బట్టలు ముడతలు పడవా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved