MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • ఎన్టీఆర్, ఏఎన్నార్ మధ్య పోటీ వల్ల ఆర్టిస్టులు ఎలా నష్టపోయేవారో తెలుసా? సీనియర్ నటుడు చంద్రమోహన్ సంచలన కామెంట్స్..

ఎన్టీఆర్, ఏఎన్నార్ మధ్య పోటీ వల్ల ఆర్టిస్టులు ఎలా నష్టపోయేవారో తెలుసా? సీనియర్ నటుడు చంద్రమోహన్ సంచలన కామెంట్స్..

తెలుగు చలనచిత్ర రంగానికి రెండు కళ్లుగా భావించే నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్), అక్కినేని నాగేశ్వరరావు (ఏఎన్నార్)ల మధ్య ఉన్న పోటీ వల్ల ఆర్టిస్టులు ఎంత ఇబ్బంది పడేవారో తెలుసా? ఈ విషయాల గురించి చంద్రమోహన్ గతంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఏమన్నారంటే...

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 12 2026, 07:24 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
తెలుగు సినిమాకు రెండు కళ్లు..
Image Credit : Asianet News

తెలుగు సినిమాకు రెండు కళ్లు..

తెలుగు చలనచిత్ర పరిశ్రమకు రెండు కళ్లుగా నిలిచిన మహానటులు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్), అక్కినేని నాగేశ్వరరావు (ఏఎన్నార్). తెలుగు సినిమా స్వర్ణయుగాన్ని ఏలిన ఈ ఇద్దరు దిగ్గజాల మధ్య ఎంతటి అనుబంధం ఉండేదో, అంతే వృత్తిపరమైన పోటీ కూడా ఉండేది. సినిమాలు, రాజకీయాల వల్ల వారి మధ్య తలెత్తిన కొన్ని విషయాలకు సంబంధించిన వార్తలు ఇప్పటికీ ఆసక్తికరంగా మారుతుంటాయి. ఈ క్రమంలో వీరిద్దరి పట్టుదల, పోటీ మధ్య చాలామంది ఆర్టిస్టులు ఇబ్బంది పడ్డారని సీనియర్ నటుడు, దివంగత చంద్రమోహన్ తెలిపారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఎన్టీఆర్ - ఏఎన్నార్ పోటీ మధ్య నలిగిన నటీనటులు..
Image Credit : Facebook / Sr NTR Fans

ఎన్టీఆర్ - ఏఎన్నార్ పోటీ మధ్య నలిగిన నటీనటులు..

ఆ కాలంలో ఈ ఇద్దరు హీరోలు పూర్తి స్థాయిలో బిజీగా ఉండేవారు. ఇద్దరి గ్రూపులు వేరు వేరుగా, టెక్నీషియన్లు కూడా వేరు వేరుగా ఉండటంతో నటీనటుల ఎంపిక విషయంలో ఇబ్బందులు ఎదురయ్యేవి. "ఏఎన్నార్‌తో కలిసి నటిస్తే ఎన్టీఆర్ సినిమాల్లో అవకాశాలు రావు" అనే ప్రచారం ఆ రోజుల్లో నిజమేనని చంద్రమోహన్ అన్నారు. ఆ ఇద్దరు దిగ్గజాల మధ్య ఉన్న పోటీ వల్ల పరిశ్రమలో ప్రత్యేకమైన వాతావరణం నెలకొందని ఆయన తెలిపారు. కెరీర్ ప్రారంభంలో ఈ పరిస్థితులను అర్థం చేసుకోవడం తనకు కూడా కష్టమైందని చెప్పారు. రామారావు గారి పక్కన వేషాలు వేయడం ప్రారంభిస్తే, ఆయన ఇతరులను ప్రోత్సహించేవారు కారనే ప్రచారం కూడా తోటి నటుల మధ్య ఉండేదని వివరించారు.

34
ఎవరి గ్రూపులు వారివే..
Image Credit : IMDB

ఎవరి గ్రూపులు వారివే..

ఆ కాలంలో విభేదాలతో పాటు సినిమాల విషయంలో పోటీ పెరగడం వల్ల నాగేశ్వరరావు చెన్నై (మద్రాస్) నుండి హైదరాబాద్‌కు వచ్చి ఇక్కడ అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించడం జరిగిందని చంద్రమోహన్ గుర్తుచేసుకున్నారు. దీనితో పరిశ్రమ రెండు ప్రధాన వర్గాలుగా విడిపోయింది. ఏఎన్నార్‌కి సంబంధించిన నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు వేరేగా ఉంటే; ఎన్టీఆర్‌కి సంబంధించిన నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు వేరేగా ఉండేవారు. అన్నపూర్ణ స్టూడియోస్, జగపతి ఆర్ట్స్, అన్నపూర్ణ బ్యానర్లతో పాటు జగపతి పంపిణీదారులు ఏఎన్నార్‌తోనే సినిమాలు తీసేవారు. నవయుగ లాంటి డిస్ట్రిబ్యూషన్ సంస్థలు, దానితో సంబంధం ఉన్న నిర్మాతలు ఎన్టీఆర్‌తోనే సినిమాలు చేసేవారు. ఈ వర్గాల కారణంగా ఒక గ్రూప్‌కి చెందిన వారు మరొక హీరోతో చిత్రాలు నిర్మించడానికి ముందుకు వచ్చేవారు కాదు.

44
కొత్తగా వచ్చిన తారలు ఇబ్బంది పడ్డారా?
Image Credit : Youtube

కొత్తగా వచ్చిన తారలు ఇబ్బంది పడ్డారా?

ఈ సమీకరణాల వల్ల నటీనటులు ఏదో ఒక గ్రూప్‌ని లేదా ఒక హీరో వైపు మాత్రమే నిలవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చంద్రమోహన్ అన్నారు. ఒకే సమయంలో ఇద్దరి సినిమాల్లోనూ అవకాశాలు రావడం చాలా కష్టంగా ఉండేది. ఒకరి సినిమాలో నటిస్తే మరొక గ్రూప్‌లో అవకాశాలు రావని ఆయన తెలిపారు. తెలుగు చిత్రసీమ స్వర్ణయుగంలో ఒకవైపు వెండితెరపై కలిసి నటించినా, పరిశ్రమలో మాత్రం ఎవరి గ్రూప్‌లను వారు మెయింటెన్ చేశారు. దానివల్ల అప్పుడే పరిశ్రమలోకి వచ్చిన కొత్త నటీనటులు, టెక్నీషియన్లు చాలా ఇబ్బందులు పడ్డారని చంద్రమోహన్ ఆ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
నందమూరి తారక రామారావు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Chaitra Rai: వర్షిణి, సుధీర్ హైడ్రామా అట్టర్ ఫ్లాప్.. బిగ్ బాస్ హౌస్ నుంచి చైత్ర రాయ్ అవుట్, మరో ఎలిమినేషన్
Recommended image2
Shrimad Bhagavatam: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు ఏడు భాగాలుగా విష్ణువు కథ.. భారీ స్కేల్‌లో సినిమాలు
Recommended image3
The Paradise: ది ప్యారడైజ్ మూవీకి ట్రైలర్ లేదు.. బాంబు పేల్చిన నాని, ఏం జరుగుతోంది
Related Stories
Recommended image1
ANR: ఏఎన్నార్ తొలి సంపాదన ఎంతో తెలుసా? దాంతో ఏం చేశారు? అక్కినేని వేల కోట్లకు అధిపతి ఎలా అయ్యారు?
Recommended image2
Bigg Boss Telugu 10: బిగ్ బాస్ తెలుగు సెలబ్రిటీల సొంత ఊరు ఏదో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved