MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • Krishnam Raju: ప్రభాస్ ప్రేమగా ఇచ్చిన గిఫ్ట్ ను.. చనిపోయేవరకు దాచుకున్న కృష్ణంరాజు, ఆ బహుమతి ఏంటో తెలుసా?

Krishnam Raju: ప్రభాస్ ప్రేమగా ఇచ్చిన గిఫ్ట్ ను.. చనిపోయేవరకు దాచుకున్న కృష్ణంరాజు, ఆ బహుమతి ఏంటో తెలుసా?

Krishnam Raju: టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి అందరికి తెలిసిందే. పెదనాన్న కృష్ణంరాజు అంటే ప్రభాస్ కు ప్రాణం.. పెదనాన్న కోసం ఆయన ఓ బహుమతి ఇవ్వగా.. అది చనిపోయే వరకూ బద్రంగా దాచుకున్నారట. ఇంతకీ ఏంటా గిఫ్ట్.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 15 2026, 04:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పాన్ ఇండియా క్రేజ్..
Image Credit : Asianet News

పాన్ ఇండియా క్రేజ్..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. కృష్ణంరాజు వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చి.. సొంత టాలెంట్ తో స్టార్ హీరోగా ఎదిగాడు, టాలీవుడ్ నుంచి ఫస్ట్ ప్యాన్ఇండియా హీరోగా ప్రభాస్ రికార్డు సాధించాడు. ప్రస్తుతం ప్రభాస్ తో సినిమా అంటే వందల కోట్ల బడ్జెట్, పాన్ ఇండియాకు సరిపోయే కథ ఉండాల్సిందే. చిన్న చిన్న దర్శకులకు ప్రభాస్ అందడం కష్టం. ప్రస్తుతం స్పిరిట్, ఫౌజీతో పాటు కల్కీ 2 మూవీస్ తో సెట్స్ మీద ఉన్నాడు ప్రభాస్.. ఆతరువాత సలార్ 2 కూడా చేయాల్సి ఉంది. వీటితో పాటు మరికొన్ని సినిమాలు కూడా లైన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ప్రభాస్ ఫ్యామిలీ గురించి చూస్తే.. ఆయన పెదనాన్న.. దివంగత స్టార్ నటుడు కృష్ణంరాజు అంటే ఎంత ఇష్టమో అందరికి తెలిసిందే.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కృష్ణంరాజు వారసుడిగా ప్రభాస్ ఎంట్రీ..
Image Credit : google

కృష్ణంరాజు వారసుడిగా ప్రభాస్ ఎంట్రీ..

రెబెల్ స్టార్ కృష్ణంరాజు , యంగ్ రెబెల్ స్టార్, ప్రభాస్ ల మధ్య ఉన్న అనుబంధం గురించి అందరికి తెలిసిందే. కేవలం పెదనాన్న , అబ్బాయిల అనుబంధంగా కాకుండా, ఒక తండ్రీ కొడుకుల మధ్య ఉండే ప్రేమానురాగాలకు వారి బంధం నిదర్శనంగా నిలిచింది. కృష్ణంరాజు అడుగుజాడల్లోనే పరిశ్రమలోకి అడుగుపెట్టిన ప్రభాస్, ఆయనకు తగ్గ వారసుడిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు.

35
ప్రభాస్ ప్రేమతో ఇచ్చిన గిప్ట్..
Image Credit : google

ప్రభాస్ ప్రేమతో ఇచ్చిన గిప్ట్..

ప్రభాస్ కి విదేశాలకు వెళ్లినప్పుడు తన పెదనాన్న కృష్ణంరాజు (పెద్దబాజి) కోసం ప్రత్యేకమైన కానుకలు తీసుకురావడం అలవాటుగా ఉండేది. ముఖ్యంగా కృష్ణంరాజుకి వాచీలు (గడియారాలు) అంటే ఎంతో ఇష్టం ఉండటంతో, ప్రభాస్ విదేశాల నుంచి రోలెక్స్ (Rolex) లాంటి ఖరీదైన వాచీలను తెచ్చి కానుకగా ఇచ్చేవారు. తన కొడుకు తెచ్చిన కానుకను చూసి కృష్ణంరాజు గారు ఎంతో మురిసిపోయేవారు . ఆయన దగ్గర ఎన్నో వాచీలు ఉన్నప్పటికీ, ప్రభాస్ ప్రేమగా కొనిచ్చిన వాచ్ పెట్టుకోవడానికే ఆయన ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. "నా కొడుకు నాకు ప్రేమగా తెచ్చాడు" అని ఎంతో గర్వంగా, ఆనందంగా ఇతరులకు చెప్పుకునేవారు.

45
ప్రభాస్ వస్తున్నాడంటే..
Image Credit : google

ప్రభాస్ వస్తున్నాడంటే..

ప్రభాస్ ఎప్పుడు కృష్ణంరాజు గారిని కలవడానికి వచ్చినా, కనీసం రెండు గంటల ముందే ఫోన్ చేసి "పెద్దబాజీ, నేను మిమ్మల్ని చూడటానికి వస్తున్నాను" అని చెప్పేవారు. కొడుకు వస్తున్నాడనే విషయం తెలియగానే కృష్ణంరాజు గారు ఎంతో సంతోషపడి, ప్రభాస్ కి ఏమేమి ఫుడ్ ఇష్టమో వాటిని తయారు చేయించేవారు. ఆ సమయంలో ప్రభాస్ తనకు బహుమతిగా ఇచ్చిన వాచ్ పెట్టుకుని, ఎదురెళ్లి మరీ కొడుకుని ఆహ్వానించేవారు. ప్రభాస్ వస్తున్నాడంటే ఆయనకు ఎంతో సంతోషం అని కృష్ణంరాజు భార్య ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. చనిపోయేవరకూ ఆ వాచ్ ను చాలా జాగ్రత్తగా దాచుకున్నారట కృష్ణంరాజు.

55
ఒక్క విషయం తప్ప... అన్నీ పెదనాన్న పోలికలే!
Image Credit : our own

ఒక్క విషయం తప్ప... అన్నీ పెదనాన్న పోలికలే!

కృష్ణంరాజు గారు తరచుగా ప్రభాస్ తో "రాజా! నీకు నా గుణాలు, పోలికలన్నీ వచ్చాయి. మంచి మనసు, ఉదారస్వభావం, ఆతిథ్యం ఇవ్వడంలో నా రూట్ నే ఉన్నావు" అని మెచ్చుకునేవారు .అయితే, ఒకే ఒక్క విషయంలో మాత్రం ప్రభాస్ తన కంటే భిన్నంగా ఉంటాడని కృష్ణంరాజు గారు సరదాగా చెప్పేవారట. అదేంటంటే ప్రభాస్ కి ఉన్న 'మోహమాటం'. కృష్ణంరాజు నిండైన వ్యక్తి.. చాలా గాంభీర్యంతో, ఓపెన్ గా మాట్లాడే స్వభావం ఉన్నా.. ప్రభాస్ మాత్రం బయట కాస్త సిగ్గుపడుతూ మోహమాటపడే వ్యక్తిత్వం కలిగి ఉన్నాడని కృష్ణంరాజు భార్య అన్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
ప్రభాస్
వినోదం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Vijay Son Movie: ఒకేసారి తండ్రీకొడుకుల సినిమాలు.. ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్!
Recommended image2
Chiranjeevi: అల్లు అర్జున్ కు చిరంజీవి చెప్పిన టాప్ సీక్రెట్.. మెగాస్టార్ నుంచి బన్ని నేర్చుకున్నది ఇదేనా?
Recommended image3
Suma: యాంకర్ గా సుమ లైఫ్ లో మర్చిపోలేని ప్రోగ్రామ్ ఏదో తెలుసా? ఆ ఒక్క షో ఎందుకంత స్పెషల్?
Related Stories
Recommended image1
Suma: యాంకర్ గా సుమ లైఫ్ లో మర్చిపోలేని ప్రోగ్రామ్ ఏదో తెలుసా? ఆ ఒక్క షో ఎందుకంత స్పెషల్?
Recommended image2
Chiranjeevi: అల్లు అర్జున్ కు చిరంజీవి చెప్పిన టాప్ సీక్రెట్.. మెగాస్టార్ నుంచి బన్ని నేర్చుకున్నది ఇదేనా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved