MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్న స్టార్ హీరోలు.. ఆందోళనలో అభిమానులు, అసలేం జరుగుతుంది ఇండస్ట్రీలో?

ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్న స్టార్ హీరోలు.. ఆందోళనలో అభిమానులు, అసలేం జరుగుతుంది ఇండస్ట్రీలో?

Star Injuries: ఈ మధ్య కాలంలో షూటింగ్స్ లో వరుస ప్రమాదాలకు గురై, గాయాలపాలవుతున్నారు స్టార్ హీరోలు. టాలీవుడ్ హీరోలు చాలామంది ఆసుపత్రి బాట పడుతున్నారు. ఈమధ్యనే ఎక్కువగా సర్జరీలు చేయించుకున్న హీరోల గురించి చూస్తే..?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 30 2026, 10:27 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
స్టార్ హీరోలకు వరుస ప్రమాదాలు ఆందోళనలో అభిమానులు
Image Credit : Asianet News

స్టార్ హీరోలకు వరుస ప్రమాదాలు ఆందోళనలో అభిమానులు

సినిమా తెరపై తమను చూసి ..ఈలలు వేసి సందడి చేసే అభిమానులు, ప్రేక్షకుల ఆనందం కోసం హీరోలు ఎంత రిస్క్ అయినా చేస్తుంటారు. ప్రమాదకరమైన యాక్షన్ సీన్స్‌లో కూడా ప్రాణాలను పణంగా పెట్టి నటిస్తుంటారు. అయితే, ఈ మధ్యకాలంలో టాలీవుడ్ స్టార్ హీరోలు షూటింగ్స్ సమయంలో వరుసగా గాయపడటం, ఆసుపత్రి పాలు కావాల్సి రావడం సినీ వర్గాల్లోనూ, అభిమానుల్లోనూ తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. రీసెంట్ గా స్టార్ హీరోలంతా హాస్పిటల్స్ లో సర్జరీలు చేయించుకుని కోలుకుంటున్నారు. వారిలో ఎవరెవరు ఉన్నారంటే?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కోయంబత్తూరు హాస్పిటల్ లో రామ్ చరణ్
Image Credit : Asianet News

కోయంబత్తూరు హాస్పిటల్ లో రామ్ చరణ్

రామ్ చరణ్ ఊహించని విధంగా కోయంబత్తూరులోని ఆసుపత్రిలో చేరడం అభిమానులను షాక్‌కు గురిచేసింది. పెద్ది సినిమా షూటింగ్ సమయం మొదట్లో ఆయన కంటికి పెద్ద దెబ్బ తగిలింది. ఆ సమయంలో మెగా ఫ్యామిలీతో పాటు అభిమానులు కూడా చాలా భయపడ్డారు. కానీ అంతా సర్ధుకుని, చరణ్ రికవర్ అయ్యారు. ఆ తర్వాత పహిల్వాన్ గా ఫైటింగ్ సన్నివేశాలు తీస్తున్న సమయంలో ఆయన చేతి మణికట్టుకు తీవ్ర గాయం కావడంతో సర్జరీ చేయాల్సి వచ్చింది. దాంతో రీసెంట్ గా ఆయన కోయంబత్తూర్ లో జాయిన్ అయినట్టు తెలుస్తోంది. అయితే అపోలో హాస్పిటల్స్ ఉండగా.. ఆయన కోయంబత్తూర్ లో చేరడంపై రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి.

Related Articles

Related image1
krishna: నీతో సినిమా చేస్తే అడ్రస్‌ గల్లంతే, కృష్ణను భయపెట్టిన స్టార్‌ ప్రొడ్యూసర్‌.. సూపర్‌ స్టార్‌ దెబ్బకి రికార్డులు బ్రేక్‌
Related image2
DVSK Movie Review: దాన వీర శూర కర్ణ మూవీ రివ్యూ, కృష్ణకు చుక్కలు చూపించిన ఎన్టీఆర్ సినిమా
35
బాలకృష్ణకు మోకాలి ఆపరేషన్..
Image Credit : Asianet News

బాలకృష్ణకు మోకాలి ఆపరేషన్..

నటసింహం నందమూరి బాలకృష్ణ 'NBK109' (తల్వార్) సినిమా షూటింగ్‌లో గాయపడ్డారు. కాకినాడలోని ఓ లొకేషన్ లో యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తుండగా మోకాలికి తీవ్రమైన గాయం అయ్యింది. పరిస్థితి తీవ్రంగా ఉండటంతో వైద్యులు ఆయన మోకాలికి ఆపరేషన్ చేశారు. ప్రస్తుతం బాలయ్య కోలుకుంటున్నారు. షూటింగ్ రెండు నెలలకు పోస్ట్ పోన్ అయినట్టు తెలుస్తోంది. గతంలో కూడా బాలయ్య భుజానికి గాయం అవ్వడంతో సర్జరీ జరగింది. కట్టుతోనే ఆయన అన్ స్టాపబుల్ ఎపిసోడ్స్ ను హోస్ట్ చేశారు.

45
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్
Image Credit : others

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

ఒకవైపు రాజకీయాలు, మరోవైపు సినిమాలతో బిజీగా గడుపుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఇటీవల భుజానికి తీవ్ర గాయమైంది. దీనివల్ల ఆయనకు వైద్యులు శస్త్రచికిత్స (సర్జరీ) అందించారు. ముంబయ్ లోని కోకిలా బెన్ హాస్పిటల్ లో ఈ ఆపరేషన్ జరిగింది. సినీరాజకీయ ప్రముఖులు ఆయన్ను పరామార్శించారు. ఈ సర్జరీ కారణంగా ఆయన సినిమాలకు, ఇతర పాలనా కార్యక్రమాలకు కొంతకాలం బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆయన ఇంట్లో విశ్రాంతిలో ఉన్నారు.

55
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్
Image Credit : youtube

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న 'డ్రాగన్' సినిమా షూటింగ్‌లో ఎన్టీఆర్ వరుసగా గాయపడుతున్నారు. కొద్దిరోజుల క్రితం ఆయన చేతికి గాయం కాగా, దాని నుంచి కోలుకుని మళ్ళీ షూటింగ్‌కు వచ్చారు. కానీ సోమవారం నాడు ఊహించని విధంగా ఆయన భుజానికి మరొకసారి తీవ్ర గాయం కావడంతో, వైద్యులు ఆయనను కొన్నిరోజుల పాటు విశ్రాంతి తీసుకోమని సూచించారు. దాంతో మరో రెండు మూడు వారాలు డ్రాగన్ సినిమా షూటింగ్ పోస్ట్ పోన్ అయ్యింది. 

ఈ విషయంలో ప్రశాంత్ నీల్ పై తారక్ అభిమానులు మండిపడుతున్నారు. డూప్ తో చేయించాల్సిన స్టంట్స్ కూడా తారక్ తో చేయించడం వల్లే ఇలా అయ్యిందేమో అని దర్శకుడిపై కోపంగా ఉన్నారు. ఇలా తమ అభిమాన హీరోలు వరుసగా ఆసుపత్రి పాలవ్వడంతో అభిమానులు తీవ్ర ఆందోళనతకు గురవుతున్నారు. త్వరగా కోలుకుని, రెట్టింపు ఉత్సాహంతో తిరిగి షూటింగ్‌లలో పాల్గొనాలని కోరుకుంటున్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
నందమూరి బాలకృష్ణ
పవన్ కళ్యాణ్
రామ్ చరణ్ కొణిదెల
వినోదం
Latest Videos
Recommended Stories
Recommended image1
Balakrishna: ఇంద్ర తర్వాత చేసిన సినిమా.. హీరోయిన్లు రివర్స్, ట్రైన్ కూడా రివర్స్..అతి పెద్ద ట్రోల్ మెటీరియల్
Recommended image2
Raaka: 1000 కోట్ల బడ్జెట్, నలుగురు హీరోయిన్లు, అల్లు అర్జున్ కోసం అంతకు మించి ప్లాన్ చేస్తోన్న అట్లీ?
Recommended image3
Ramayana trailer: 4 నిమిషాల ట్రైలర్ లో సినిమా మొత్తం.. రామాయణలో రావణుడి పాత్రనే హైలెట్ చేశారా?
Related Stories
Recommended image1
krishna: నీతో సినిమా చేస్తే అడ్రస్‌ గల్లంతే, కృష్ణను భయపెట్టిన స్టార్‌ ప్రొడ్యూసర్‌.. సూపర్‌ స్టార్‌ దెబ్బకి రికార్డులు బ్రేక్‌
Recommended image2
DVSK Movie Review: దాన వీర శూర కర్ణ మూవీ రివ్యూ, కృష్ణకు చుక్కలు చూపించిన ఎన్టీఆర్ సినిమా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved