MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • krishna: నీతో సినిమా చేస్తే అడ్రస్‌ గల్లంతే, కృష్ణను భయపెట్టిన స్టార్‌ ప్రొడ్యూసర్‌.. సూపర్‌ స్టార్‌ దెబ్బకి రికార్డులు బ్రేక్‌

krishna: నీతో సినిమా చేస్తే అడ్రస్‌ గల్లంతే, కృష్ణను భయపెట్టిన స్టార్‌ ప్రొడ్యూసర్‌.. సూపర్‌ స్టార్‌ దెబ్బకి రికార్డులు బ్రేక్‌

krishna: ఫిల్మ్ ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా సూపర్‌స్టార్ కృష్ణకు పేరుంది. సాహసాలు చేయడంలో ఆయన తరువాతే ఎవరైనా. అటువంటి హీరో కెరీర్ విషయంలో భయపడిన సందర్భం ఒకటుందని మీకు తెలుసా? ఇంతకీ కృష్ణను భయపెట్టింది ఎవరు? కారణం ఏంటి?

3 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 29 2026, 07:55 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
సాహసానికి మారుపేరు
Image Credit : times of india

సాహసానికి మారుపేరు

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో "సాహసానికి మారుపేరు" ఎవరు అంటే ప్రతి ఒక్కరి నోట వినపడే ఏకైక పేరు సూపర్‌స్టార్ కృష్ణ. కౌబాయ్, ఈస్ట్ మన్ కలర్, సినిమాస్కోప్, 70ఎంఎం.. ఇలా టాలీవుడ్‌కి ఎన్నో కొత్త సాంకేతికతలను పరిచయం చేసిన ఘనత ఆయనది. అంతే కాదు డూప్ లేకుండా ఫైట్స్ చేయడం, యాక్షన్ సీన్స్ చేయడం కృష్ణకు అలవాటు. అంతటి ధైర్యశాలి అయిన డేరింగ్ అండ్ డాషింగ్ హీరో కృష్ణ కూడా తన సినీ ప్రయాణంలో ఒక్కసారి తీవ్ర భయానికి గురైన సందర్భం ఉందంటే నమ్మగలరా?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
నీతో సినిమా చేస్తే అందరూ అయిపోతారు!
Image Credit : facebook.com/ghattamanenisuperstar

నీతో సినిమా చేస్తే అందరూ అయిపోతారు!

సూపర్‌స్టార్ కృష్ణ తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన విప్లవ వీరుడు 'అల్లూరి సీతారామరాజు' చిత్రాన్ని చాలా కష్టపడి పూర్తి చేసి విడుదల చేశారు. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అప్పుడు స్టార్ ప్రొడ్యూసర్ చక్రపాణి కృష్ణకు ఫోన్ చేసి.. ఆ సినిమా చూడాలని అడిగారు. వెంటనే కృష్ణ ఓ ప్రింట్ ను ఆయనకు పంపించారు. అప్పుడు ఆ సినిమా చూసిన విజయా పిక్చర్స్ అధినేత చక్రపాణి వెంటనే కృష్ణను ఇంటికి రమ్మని ఫోన్ చేశారు.

 ఆయన కృష్ణను నీతో ఇప్పుడు ఎంత మంది సినిమా చేస్తున్నారు అని అడిగాడు. దానికి కృష్ణ ఓ ఏడెనిమిది మంది చేస్తున్నారండీ అని అన్నారు. వెంటనే చక్రపాణి వాళ్లంతా అయిపోతారు.. ఇక ముందు రెండేళ్ల వరకూ నీ సినిమాలన్నీ పోతాయి.. అయిన అని షాకింగ్ కామెంట్ చేశారు. దాంతో కృష్ణకు ఏం జరుగుతుందో అర్ధం కాలేదు.

Related Articles

Related image1
DDLJ: 30 ఏళ్లుగా ఒకే ఒక్క థియేటర్లో నడుస్తున్న సినిమా, 4 కోట్ల బడ్జెట్ పెడితే 100 కోట్లు కలెక్ట్ చేసిన మూవీ ఏదో తెలుసా?
Related image2
DVSK Movie Review: దాన వీర శూర కర్ణ మూవీ రివ్యూ, కృష్ణకు చుక్కలు చూపించిన ఎన్టీఆర్ సినిమా
36
చక్రపాణి ఎందుకు కృష్ణతో అలా అన్నారు?
Image Credit : pinterest

చక్రపాణి ఎందుకు కృష్ణతో అలా అన్నారు?

కృష్ణతో చక్రపాణి ఏమన్నారంటే?.."కృష్ణా.. నువ్వు అల్లూరి సీతారామరాజుగా అద్భుతంగా చేశావు. కానీ ఇకపై నీతో సినిమాలు చేసే నిర్మాతలు అయిపోతారు, నీ కెరీర్ ఇబ్బందుల్లో పడుతుంది. నిన్ను అంతటి ఉదాత్తమైన, గొప్ప మహానాయకుని పాత్రలో చూసిన తర్వాత, ప్రేక్షకులు నిన్ను మళ్ళీ సాధారణ కమర్షియల్ పాత్రల్లో చూడటానికి కనీసం రెండేళ్లయినా పడుతుంది" అని హెచ్చరించారు. ఆ మాట విన్నప్పుడు కృష్ణ మనసులో ఒక రకమైన భయం, ఆందోళన కలిగాయి. కానీ ఈ సినిమా హిట్ తరువాత సరిగ్గా ఆయన చెప్పినట్టే జరిగింది. కృష్ణకు గడ్డు కాలం రానే వచ్చింది.

46
అల్లూరి సీతారామరాజు తర్వాత ఏం జరిగింది?
Image Credit : Asianet News

అల్లూరి సీతారామరాజు తర్వాత ఏం జరిగింది?

చక్రపాణి గారు చెప్పిన జోస్యం నిజమయ్యంది. 'అల్లూరి సీతారామరాజు' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత కృష్ణ నటించిన వరుస సినిమాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయ్యాయి. ఆ సమయంలో కృష్ణ నటించిన దాదాపు 13 సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. ఆయన ఎంతో ప్రెస్టేజియస్ గా భావించి నటించిన 'దేవదాసు' చిత్రం కూడా ఈ ఫ్లాపుల ప్రవాహంలో కొట్టుకుపోయింది. ఒక వైపు వరుస ఫ్లాపులు, మరోవైపు పరిశ్రమలో వస్తున్న విమర్శలు.. ఇన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా కృష్ణ గారు అధైర్యపడలేదు. తన పరాజయాలకు తన సినిమాలతోనే సమాధానం చెప్పాలని నిర్ణయించుకున్నారు.

56
కృష్ణ చేసిన మరో పెద్ద సాహసం
Image Credit : Asianet News

కృష్ణ చేసిన మరో పెద్ద సాహసం

వరుస డిజాస్టర్లలో ఉన్న సమయంలో మళ్ళీ నిలదొక్కుకోవడానికి కృష్ణ తన సొంత బ్యానర్ 'పద్మాలయా పిక్చర్స్' పై ఒక గ్రామీణ నేపథ్యంలో సాగే సందేశాత్మక చిత్రాన్ని తీయాలని సాహస నిర్ణయం తీసుకున్నారు. దగ్గరుండి కథను తయారు చేసుకున్నారు అదే 'పాడిపంటలు' (1976). యాక్షన్, కౌబాయ్ ఇమేజ్ ఉన్న కృష్ణ.. పల్లెటూరి వాతావరణం, రైతు సమస్యలు, పాడిపంటల ప్రాముఖ్యత నేపథ్యంలో ఈ సినిమా చేయడం అప్పట్లో పెద్ద రిస్క్. కానీ, తనపై, కథపై ఉన్న నమ్మకంతో పి. చంద్రశేఖరరెడ్డి దర్శకత్వంలో 'పాడిపంటలు' నిర్మించారు. 

యాక్షన్ హీరోవి.. ఈ సినిమా చేయడం నీ కెరీర్ కే దెబ్బ.. అసలే నీ పరిస్థితి బాలేదు అని కొంత మంది సూపర్ స్టార్ కు సలహాలు ఇచ్చారట. ఇక ఈ సినిమా రిలీజ్ టైమ్ లో కూడా కృష్ణను చాలామంది ఆపే ప్రయత్నం చేశారు. సంక్రాంతికి రిలీజ్ చేయాలి అనుకుంటే.. ఆ టైమ్ లో పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ కు ఉన్నాయి. నీకు అసలే టైమ్ బాలేదు.. సంక్రాంతికి ఎందుకు.. సీజన్ అయిపోయాక చేసుకో అని చాలామంది అన్నారు. కానీ కృష్ణ మాత్రం చావో రేవో తేల్చుకోవాల్సిందే అని ముందుకు కదిలారు.

66
సినిమాలతోనే సమాధానం చెప్పిన కృష్ణ
Image Credit : Asianet News

సినిమాలతోనే సమాధానం చెప్పిన కృష్ణ

1976 సంక్రాంతికి విడుదలైన 'పాడిపంటలు' చిత్రం సంచలన విజయాన్ని నమోదు చేసింది. గ్రామీణ ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు. ఈ ఒక్క సినిమాతో కృష్ణ తనపై పడిన ఫ్లాపుల ముద్రను తుడిచిపెట్టేసి, మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కారు. ఈ సినిమాతో పాటు రిలీజ్ అయిన పెద్దపెద్ద సినిమాలు అడ్రెస్ లేకుండా పోయాయి. ఇక ఏ చక్రపాణి "రెండేళ్ల వరకు కోలుకోవడం కష్టం" అన్నారో, అదే సినీ రంగానికి తన పట్టుదలతో సమాధానం చెబుతూ, వరుస విజయాలతో బాక్సాఫీస్ రేసులో దూసుకెళ్లారు. ఓటమి ఎదురైన ప్రతిసారీ అంతకంటే రెట్టింపు వేగంతో పుంజుకోవడం, సరికొత్త ప్రయోగాలు చేయడమే సూపర్‌స్టార్ కృష్ణను టాలీవుడ్ చరిత్రలో చెరగని ముద్రగా నిలిపింది

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
కృష్ణ ఘట్టమనేని
వినోదం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
తెలుగు సినిమా
Latest Videos
Recommended Stories
Recommended image1
Allu Arjun: హేట్‌ చేయోద్దు, అమ్మాయి ఇంటి ముందు కూర్చొని ఎంజాయ్‌ చేయండి.. అభిమానులకు అల్లు అర్జున్‌ సందేశం
Recommended image2
150 కోట్ల హీరో, 40 కోట్ల హీరోయిన్, ఆ ఇండస్ట్రీలో టాప్ రెమ్యునరేషన్ స్టార్స్ ఎవరో తెలుసా?
Recommended image3
Toxic: హాలీవుడ్‌లో టాక్సిక్ మంత్రం.. యశ్ మాటలకు ఫారెన్ మీడియా ఫిదా
Related Stories
Recommended image1
DDLJ: 30 ఏళ్లుగా ఒకే ఒక్క థియేటర్లో నడుస్తున్న సినిమా, 4 కోట్ల బడ్జెట్ పెడితే 100 కోట్లు కలెక్ట్ చేసిన మూవీ ఏదో తెలుసా?
Recommended image2
DVSK Movie Review: దాన వీర శూర కర్ణ మూవీ రివ్యూ, కృష్ణకు చుక్కలు చూపించిన ఎన్టీఆర్ సినిమా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved