MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • Movie Reviews
  • DVSK Movie Review: దాన వీర శూర కర్ణ మూవీ రివ్యూ, కృష్ణకు చుక్కలు చూపించిన ఎన్టీఆర్ సినిమా

DVSK Movie Review: దాన వీర శూర కర్ణ మూవీ రివ్యూ, కృష్ణకు చుక్కలు చూపించిన ఎన్టీఆర్ సినిమా

DVSK Movie Review: తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోయే సినిమాలలో దాన వీర శూర కర్ణ కూడా ఒకటి. ఎన్టీఆర్ సృష్టించిన అద్భుతాలలో ఈ సినిమా కూడా ఒకటి. ఈ సినిమాను ఇంత అద్భుతంగా ఎలా చేయగలిగారనే సందేహం ఇప్పటికీ చాలామందిలో ఉంది.

3 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 26 2026, 07:31 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
తెలుగు సినిమా చరిత్రలో ఒక సంచలనం
Image Credit : Asianet News

తెలుగు సినిమా చరిత్రలో ఒక సంచలనం

తెలుగు సినిమా చరిత్రలో పౌరాణిక సినిమాలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అందులోనూ ‘నటరత్నం’ విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) స్వీయ దర్శకత్వంలో, నిర్మాణంలో తెరకెక్కించిన ‘దాన వీర శూర కర్ణ’ (1977) ఒక సంచలనం. ఒకే సినిమాలో మూడు ప్రధానమైన పాత్రలను పోషిస్తూ, కేవలం 43 రోజుల్లో ఈ మహా కావ్యాన్ని పూర్తిచేసి, ప్రపంచ సినిమా రంగాన్ని ఆశ్చర్యపరిచారు ఎన్టీఆర్. ఈ క్లాసిక్ మాస్టర్‌పీస్ గురించిన అధికారిక విశేషాలు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
దాన వీర శూర కర్ణ కథ, విశ్లేషణ
Image Credit : Asianet News

దాన వీర శూర కర్ణ కథ, విశ్లేషణ

మహాభారతం ఆధారంగా రూపొందించిన ఈ సినిమాలో ఎన్టీఆర్ మహాభారతంలోని కౌరవుల వైపు ఉన్న ఉదాత్తతను, కర్ణుడి దానగుణం లాంటి వాటిని ముఖ్యమైన అంశాలుగా తీసుకున్నారు. సమాజంలో కుల వివక్షకు గురైన కర్ణుడి ఆవేదన, రారాజు దుర్యోధనుడు, అతనికి ఇచ్చిన ఇంపార్టెన్స్, వారిద్దరి మధ్య ఉన్న పవిత్రమైన స్నేహం.. ఈ చిత్రానికి ప్రాణం. సాధారణంగా దుర్యోధనుడిని విలన్‌గా చూపే సంప్రదాయానికి భిన్నంగా, ఆయనలోని రాజసానికీ, స్నేహధర్మానికి ఎన్టీఆర్ తన నటన ద్వారా సరికొత్త గౌరవాన్ని తెచ్చారు. మరోవైపు, ఈ నాటకాంతా నడిపించే సూత్రధారిగా శ్రీకృష్ణుడి పాత్రలోనూ లీనమై నటించి ప్రేక్షకులను సమ్మోహన పరిచారు.

Related Articles

Related image1
Gundamma katha Review : గుండమ్మకథ అసలు హీరో ఎవరు? ఎవర్ గ్రీన్ కల్ట్ క్లాసిక్ గా నిలిపిన అంశాలు ఏంటి? తెర వెనుక ఇంత జరిగిందా?
Related image2
మాయాబజార్ మూవీ రివ్యూ, గ్రాఫిక్స్ లేని రోజుల్లో అద్భుతమైన సీన్స్ ఎలా తీయగలిగారు? ఈ సినిమాకు అసలు హీరో ఎవరో తెలుసా?
37
తారాగణం – పాత్రలు
Image Credit : Asianet News

తారాగణం – పాత్రలు

ఈ చిత్రంలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేయడమే కాకుండా, తన కుటుంబ సభ్యులను, దిగ్గజ నటులను కీలక పాత్రలకు ఎంపిక చేశారు.ఎన్.టి. రామారావు కర్ణుడు, సుయోధనుడు (దుర్యోధనుడు), శ్రీకృష్ణుడుడిగా త్రిపాత్రాభినయం చేశారు. ఇక ఆయన కుమారుడు నందమూరి బాలకృష్ణ అభిమన్యుడిగా కనిపించారు. ఎన్టీఆర్ పెద్ద కుమారుడు నందమూరి హరికృష్ణ అర్జునుడిగా నటించి మెప్పించారు. 

ఇక బి. సరోజాదేవి సుయోధనుడి భార్యగా, నటి ప్రభ సుభద్రాదేవిగా.. ఇక శారద ద్రౌపదిగా, ధూళిపాళ శకుని పాత్రలో, కైకాల సత్యనారాయణ భీముడి పాత్రలో ..గుమ్మడి వెంకటేశ్వరరావు పరశురాముడిగా, ముక్కామల ధృతరాష్ట్రుడిగా నటించగా.. చలపతి రావు మాత్రం ఈ సినిమాలో మరీంత స్పెషల్ అయ్యారు. ఈమూవీలో ఏకంగా 5 పాత్రల్లో ఆయన నటించారు. జరాసంధుడిగా, ఇంద్రుడిగా, మరోక 3 అతిథి పాత్రల్లో చలపతిరావు కనిపించారు.

47
కొండవీటి వేంకటకవి డైలాగ్స్ పవర్
Image Credit : Asianet News

కొండవీటి వేంకటకవి డైలాగ్స్ పవర్

ఈ సినిమాకు ప్రధాన బలం కొండవీటి వేంకటకవి రాసిన డైలాగులు. పొన్నూరు సంస్కృత కళాశాల ప్రిన్సిపాల్ అయిన ఆయనను ఎన్టీఆర్ స్వయంగా ఒప్పించి రాయించారు."ఏమంటివి... ఏమంటివి... మానధనుడు, ఆత్మగౌరవ రక్షకుడు అయిన సుయోధనుని గురించా నీవు మాట్లాడునది..."అంటూ ఎన్టీఆర్ సుయోధనుడి పాత్రలో చెప్పిన లాంగ్ డైలాగ్స్ తెలుగు సినీ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించబడ్డాయి. ఇప్పటికీ చాలామంది నటులు ఆ డైలాగ్స్ ను బట్టీ బట్టి తమ టాలెంట్ చూపిచుకునే ప్రయత్నాలు చేస్తుంటారు.

57
దానవీర శూర కర్ణ రికార్డులు
Image Credit : Asianet News

దానవీర శూర కర్ణ రికార్డులు

4 గంటల 17 నిమిషాల సుదీర్ఘమైన రన్ టైమ్ ఉన్న ఈ మహాకావ్యాన్ని ఎన్టీఆర్ కేవలం 43 వర్కింగ్ డేస్‌లోనే పూర్తి చేసి రికార్డు సృష్టించారు. అంతే కాదు ఇండియన్ సినిమా చరిత్రలోనే థియేటర్లలో సెన్సార్ లేకుండా సుదీర్ఘకాలం ప్రదర్శితమైన అతి పెద్ద చిత్రాల్లో (4:17 hours) ఇది మొదటి వరసలో నిలుస్తుంది. దాదాపు 4 గంటల నిడివి ఉన్న ఈ సినిమాలో ఎన్టీఆర్ స్వయంగా 3 గంటల 30 నిమిషాలకు పైగా తెరపై కనిపిస్తారు. ఆయన మూడు పాత్రల్లో అద్భుంగా నటించి మెప్పించారు. 

కేవలం రూ. 10 లక్షల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం, ఆ కాలంలోనే 1.5 నుండి 2 కోట్లకు పైగా వసూళ్లు సాధించి (పెట్టిన పెట్టుబడికి 15-20 రెట్లు) అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రంగా నిలిచింది. అంతే కాదు 1994లో మళ్లీ విడుదలైనప్పుడు కూడా రూ. 1 కోటికి పైగా వసూలు చేసి రీ-రిలీజ్‌లో కోటి రూపాయలు సాధించిన మొదటి భారతీయ చిత్రంగా రికార్డులకెక్కింది. అంతే కాదు కేవలం ఈ సినిమాలోని డైలాగ్ ఆడియో క్యాసెట్లు విక్రయాల పరంగా ఆ రోజుల్లో ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించాయి.

67
ఎదురు దెబ్బలు ‌- సవాళ్లు
Image Credit : Asianet News

ఎదురు దెబ్బలు ‌- సవాళ్లు

‘దాన వీర శూర కర్ణ’ నిర్మాణ సమయం ఎన్టీఆర్‌కు అనేక సవాళ్లు ఎదురయ్యాయి. ఈ సినిమా చేస్తున్న టైమ్ లోనే సూపర్ స్టార్ కృష్ణ పోటీగా . భారీ బడ్జెట్‌తో, ‘కురుక్షేత్రం’ అనే చిత్రాన్ని నిర్మించడం మొదలుపెట్టారు. ఎన్టీఆర్ పిలిచి వద్దు అని చెప్పినా.. ఆయన వినలేదు. పైగా ఈ సినిమా కలర్ ప్రింట్ తో పాటు భారీ హంగులతో చెన్నై, రాజస్థాన్ లొకేషన్లలో షూటింగ్ చేశారు. ఈ సినిమాలో శోభన్ బాబు, కృష్ణంరాజు లాంటి స్టార్స్ నటించారు. ఎన్టీఆర్ ఈ పోటీని సవాలుగా తీసుకుని, అప్పుడే కొత్తగా నిర్మిస్తున్న హైదరాబాద్‌లోని 'రామకృష్ణ సినీ స్టూడియోస్' లోనే సెట్లు వేసి డే-నైట్ షూటింగ్స్ చేశారు. ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ తో కృష్ణకు పెద్ద షాక్ ఇచ్చారు ఎన్టీఆర్.

77
మేకప్ కోసం ఏకంగా 5 గంటలు..
Image Credit : google

మేకప్ కోసం ఏకంగా 5 గంటలు..

ఎన్టీఆర్ ప్రతిరోజూ కర్ణుడు, కృష్ణుడు, సుయోధనుడు పాత్రల కోసం మేకప్ వేసుకోవడానికి, తీయడానికి రోజూ 4 నుండి 5 గంటల సమయం కేటాయించేవారు. టెక్నికల్ సపోర్ట్ తో పాటు, టైమ్ కూడా తక్కువగా ఉన్నప్పటికీ, క్రమశిక్షణ, పట్టుదలతో 1977 సంక్రాంతికే సినిమాను విడుదల చేశారు. పోటీగా వచ్చిన ‘కురుక్షేత్రం’ చిత్రం కంటే ‘దాన వీర శూర కర్ణ’ బాక్సాఫీస్ వద్ద గొప్ప విజయాన్ని సాధించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

దుమ్మురేపిన సంగీతం, పద్యాలు..

‘దాన వీర శూర కర్ణ’ సినిమాకు పెండ్యాల నాగేశ్వరరావు అందించిన సంగీతం, డాక్టర్ సి. నారాయణరెడ్డి, దాశరథి పాటలు ఎప్పటికీ నిలిచిపోతాయి. “చిత్రం భళారే విచిత్రం”, “ఈ తల్లి నిను కన్నదో”, “జయీభవ విజయోత్సవ” (పూర్తి సంస్కృత సమాసాలతో కూడిన పాట) లాంటి పాటలు సూపర్ హిట్లుగా నిలిచాయి. 

'దాన వీర శూర కర్ణ’ కేవలం ఒక సినిమా మాత్రమే కాదు... అదొక విశ్వరూపం! ఒకే ఒక్క వ్యక్తి నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, స్క్రీన్‌ప్లే రచయితగా ఒకే చిత్రంలో ఇన్ని విభాగాలు నిర్వహిస్తూ ప్రపంచ చలనచిత్ర రంగాన్నే విస్తుపోయేలా చేసిన అద్భుతం. తెలుగు వారి ఆత్మగౌరవానికి, నటనా ప్రతిభకు నిలువెత్తు రూపం ఈ చిత్రం. ఈ సినిమా చూడాలి అనుకునే వారికి యూట్యూబ్ లో అందుబాటులో ఉంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
నందమూరి తారక రామారావు
కృష్ణ ఘట్టమనేని
వినోదం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Samarasimha Reddy Review: చిరంజీవికి ఎంతో ఇష్టమైన బాలకృష్ణ సినిమా, 365 రోజులు ఆడిన ట్రెండ్ సెట్టర్, సమరసింహా రెడ్డి రివ్యూ
Recommended image2
Mangalya Balam Review: టాలీవుడ్ చరిత్రలో ఫస్ట్ 100 డేస్ సినిమా.. ఏఎన్నార్, సావిత్రి రొమాంటిక్ మూవీ, 'మాంగల్య బలం' రివ్యూ
Recommended image3
Gang Leader Review: చిరంజీవి కోసం కెరీర్‌ను పణంగా పెట్టిన నాగబాబు, మెగాస్టార్ రఫ్ఫాడించి 35 ఏళ్లు.. గ్యాంగ్ లీడర్ రివ్యూ
Related Stories
Recommended image1
Gundamma katha Review : గుండమ్మకథ అసలు హీరో ఎవరు? ఎవర్ గ్రీన్ కల్ట్ క్లాసిక్ గా నిలిపిన అంశాలు ఏంటి? తెర వెనుక ఇంత జరిగిందా?
Recommended image2
మాయాబజార్ మూవీ రివ్యూ, గ్రాఫిక్స్ లేని రోజుల్లో అద్భుతమైన సీన్స్ ఎలా తీయగలిగారు? ఈ సినిమాకు అసలు హీరో ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved