- Home
- Entertainment
- Simran Choudhary : ఫ్యాట్ కరిగించేందుకు సిమ్రాన్ చౌదరి ఏం చేస్తుందో తెలుసా? మీరూ ట్రై చేస్తారా!
Simran Choudhary : ఫ్యాట్ కరిగించేందుకు సిమ్రాన్ చౌదరి ఏం చేస్తుందో తెలుసా? మీరూ ట్రై చేస్తారా!
యంగ్ హీరోయిన్ సిమ్రాన్ చౌదరి (Simran Choudhary) లేటెస్ట్ పోస్ట్ ఆసక్తికరంగా మారింది. తన ఫిట్ నెస్ కోసం చేస్తున్న వర్కౌట్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇంతకీ ఈ ముద్దుగుమ్మ ఎలాంటి వర్కౌట్ చేస్తుందో చూద్దాం..

‘ఈ నగరానికి ఏమైంది?’ (Ee Nagaraniki Emaindi) హీరోయిన్ సిమ్రాన్ చౌదరి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా కనిపిస్తుందనే విషయం తెలిసిందే. ఇంట్రెస్టింగ్ గా పోస్టులు పెడుతూ ఆకట్టుకుంటూ ఉంటుంది.
తన మొదటి, రెండోచిత్రంతోనే ఈ ముద్దుగుమ్మ మంచి గుర్తింపు చేసుకుంది. ఆమె నటనతో ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. ఆ తర్వాత ‘బొంభాట్’, ‘చెక్’, ‘పాగల్’, ‘సెహరి’ వంటి సినిమాలతో అలరించింది.
తన బ్యూటీఫుల్ లుక్ తోపాటు అలాగే తన అందంతో ఆకట్టుకుంటోంది. ఆసక్తికరమైన పోస్టులతో పాటు అదిరిపోయే అవుట్ ఫిట్లలో ఫొటోషూట్లు చేస్తూ మతులు పోగొడుతోంది.
అయితే ఈ యంగ్ హీరోయిన్ ఎప్పుడూ ఫిట్ గానే కనిపిస్తోంది. అయితే ఫిట్ నెస్ కోసం సిమ్రాన్ ఓ ప్రత్యేమైన వర్కౌట్ చేస్తోంది. ఒంటిని విల్లులా వంచుతూ ఫ్యాట్ బర్న్ చేస్తోంది.
స్పైనల్ కండీషనింగ్ అంటూ ఓ వీడియోను పంచుకుంది. మెలోడీ ట్యూన్ కు తగట్టుగా పలు ఫోజులలో బాడీని మూవ్ చేస్తూ కనిపించింది. తన ఫిటెన్ మంత్రం ఇదేనని వీడియోతో చెప్పుకొచ్చింది. తన ఇన్ స్ట్రా పేజీలో వీడియోను చూడొచ్చు.
ఇలా ట్రై చేస్తే కొద్దిరోజుల్లోనే వొంట్లోని ఫ్యాట్ బర్న్ కావడంతో పాటు ఫిట్ గా కనిపిస్తారు. అలాగే ఫిజికల్ స్ట్రెంథ్ పెరుగుతుందని కూడా చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారుతోంది.