MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ‘ఎన్బీకే107’ రిలీజ్ డేట్ కూడా ఫైనల్.! దద్దరిళ్లనున్న థియేటర్లు.. ఎప్పుడంటే?

‘ఎన్బీకే107’ రిలీజ్ డేట్ కూడా ఫైనల్.! దద్దరిళ్లనున్న థియేటర్లు.. ఎప్పుడంటే?

తెలుగు చిత్ర పరిశ్రమలో రూపుదిద్దుకుంటున్న భారీ చిత్రాలు ఒక్కొక్కటిగా రిలీజ్ డేట్ ను ప్రకటిస్తున్నాయి. తాజాగా నందమూరి నటసింహం బాలకృష్ణ (Balakrishna) నటిస్తున్న ‘ఎన్బీకే107’కు కూడా మేకర్స్ రిలీజ్ డేట్ ను ఫైనల్ చేస్తున్నారు. 

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Aug 19 2022, 11:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

నందమూరి నటసింహం, టాలీవుడ్ సీనియర్ నటుడు బాలకృష్ణ చివరిగా ‘అఖండ’తో సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. 100 రోజుల పాటు చిత్రం థియేటర్లలో ప్రదర్శించబడి తెలుగు సినిమా సత్తాను చూపారు. ప్రస్తుతం అభిమానులంతా బాలయ్య తదుపరి చిత్రం ‘ఎన్బీకే107’ కోసం ఎదురుచూస్తున్నారు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

తెలుగులో రూపుదిద్దుకుంటున్న ఒక్కో చిత్రపు విడుదల తేదీలను మేకర్స్ ప్రకటిస్తున్నారు. ఇటీవల భారీ యాక్షన్ ఫిల్మ్ ‘సలార్’ను వచ్చే ఏడాది సెప్టెంబర్ 18న, మహేశ్ బాబు తదుపరి చిత్రం ‘ఎస్ఎస్ఎంబీ 28’ ఏప్రిల్ 28న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. అలాగే ప్రభాస్ పాన్ వరల్డ్ ఫిల్మ్ ‘ప్రాజెక్ట్ కే’ను కూడా వచ్చే ఏడాది అక్టోబర్ లో రిలీజ్  చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో బాలయ్య చిత్రం విడుదలపైనా క్రేజీ బజ్ వినిపిస్తోంది.

36

‘క్రాక్’తో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు గోపీచంద్ మలినేని  - బాలయ్య కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న చిత్రం   NBK107ను  వచ్చే ఏడాది రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. 2023లో భారీ చిత్రాలు విడుదలవుతుండగా బాలయ్య కూడా బరిలోకి దిగుతున్నారు. తాజా సమాచారం ప్రకారం..  ‘ఎన్బీకే107’ను వచ్చే ఏడాది ఏప్రిల్ 7న రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తోంది. 

46

బాలయ్య రాబోతున్న నెలలో మహేష్ బాబు చిత్రం కూడా రిలీజ్ కానుండటంతో మంచి పోటీ ఏర్పడనుంది. మరోవైపు మహేశ్ బాబు కూడా త్రివిక్రమ్ డైరెక్షన్ లో హ్యాట్రిక్ ఫిల్మ్ ను చాలా శ్రద్ధగా నిర్మించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇటు బాలయ్య కూడా అదిరిపోయే యాక్షన్ తో ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ అందించనున్నారు. ఏదేమైనా ఆడియెన్స్ కు మాత్రం ఫుల్ కిక్క్ మాత్రం ఖాయమని అర్థమవుతోంది.  
 

56

ఇక ఎన్బీకే107 చిత్ర షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేస్తున్నారు దర్శకుడు గోపీచంద్ మలినేని.. బాలయ్య క్రేజ్ కు తగ్గట్టుగా, అభిమానులకు కోరుకునే విధంగా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే చిత్రం నుంచి వచ్చిన పోస్టర్లు, టీజర్ సినిమాపై అంచనాలను పెంచేస్తోంది. ప్రస్తుతం ఏపీలో కర్నూలు ఏరియాలో చిత్ర షూటింగ్ జరుగుతోంది. 
 

66

ఈ చిత్రంలో బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తుండగా గ్లామర్ బ్యూటీ శృతి హాసన్ (Shruti Haasan) హీరోయిన్ గా నటిస్తోంది. తొలిసారిగా బాలయ్య సరసన అందాలు ఆరబోయనుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవి శంకర్ నిర్మిస్తున్నారు. లేడీ విలన్ వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్ పలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు. 
 

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Arjun Sarja: అర్జున్‌ చెంప చెల్లుమనిపించిన డైరెక్టర్‌.. కోపంతో ఊగిపోయిన యాక్షన్‌ కింగ్‌ ఏం చేశాడంటే
Recommended image2
Peddi Collections: ఫస్ట్ డే పెద్ది బాక్సాఫీసు వద్ద ఊచకోత.. ప్రభాస్‌, ఎన్టీఆర్‌ రికార్డులు బ్రేక్‌
Recommended image3
Darshan Viral Video: లైవ్‌లోకి వచ్చిన దర్శన్, కన్నీళ్లు పెట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved