MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Ikka On OTT: పనోడితో భార్య చేసిన మిస్టేక్, అడ్డంగా దొరికిపోయిన విలన్.. దుమ్ములేపుతున్న కోర్ట్ రూమ్ డ్రామా

Ikka On OTT: పనోడితో భార్య చేసిన మిస్టేక్, అడ్డంగా దొరికిపోయిన విలన్.. దుమ్ములేపుతున్న కోర్ట్ రూమ్ డ్రామా

సన్నీ డియోల్ నటించిన లేటెస్ట్ కోర్ట్ రూమ్ డ్రామా చిత్రం ఇక్కా. ఓటీటీలో విడుదలైన ఈ మూవీ విశేష స్పందన దక్కించుకుంటోంది. ఈ మూవీలో వచ్చే ట్విస్టులతో థ్రిల్ ఫీల్ అవ్వడం గ్యారెంటీ అనే చెప్పాలి.

2 Min read
Author : Tirumala Dornala
Published : Jul 30 2026, 03:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Ikka Movie
Image Credit : Asianet News

Ikka Movie

సీనియర్ హీరో సన్నీ డియోల్ లాయర్ పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ఇక్కా. ఈ చిత్రం డైరెక్ట్ గా ఓటీటీలో ఇటీవల విడుదలైంది. సిద్దార్థ్ మల్హోత్రా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో దియా మీర్జా, ఆకాంక్ష రాజన్, తిలోత్తమ షోమే ఇతర కీలక పాత్రల్లో నటించారు. ధురంధర్ లో అదరగొట్టిన అక్షయ్ ఖన్నా మరోసారి పవర్ ఫుల్ విలన్ గా నటించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
అదిరిపోయే ట్విస్ట్ లు
Image Credit : Asianet News

అదిరిపోయే ట్విస్ట్ లు

కోర్ట్ రూమ్ డ్రామా అంటే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ పక్కాగా ఉండాలి. ఈ చిత్రంలో అవి 100 శాతం ఉన్నాయి. కోర్ట్ లో రివీల్ అయ్యే ఒక్కో ట్విస్ట్ చివరి వరకు సినిమాపై ఆసక్తిని పెంచుతూనే ఉంటుంది. ఈ మూవీలో దియా మీర్జా, సన్నీ డియోల్ భార్య భర్తలుగా నటించారు. ఇటీవల నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి క్రేజీ రెస్పాన్స్ వస్తోంది. అసలు ఇంతకీ ఇక్కా కథేంటో ఇప్పుడు చూద్దాం.

35
కథ ఏంటంటే
Image Credit : Asianet News

కథ ఏంటంటే

ఓటమి ఎరుగని సీనియర్ లాయర్ గా అర్జున్ మెహ్రా(సన్నీ డియోల్) పేరు ప్రఖ్యాతలు సంపాదించి ఉంటారు. ఆయన బాధితుల తరుపున మాత్రమే వాదిస్తారు. ఎంతటి క్లిష్టమైన కేసుని అయినా, ఈ కేసు ఓడిపోవడం ఖాయం అని అనుకున్నా సరే చివరి నిమిషంలో బలమైన సాక్ష్యం ప్రవేశ పెట్టి విజయం సాధించడం సన్నీ డియోల్ కి వెన్నతో పెట్టిన విద్య. కానీ ఊహించని పరిస్థితుల్లో అతడి కూతురుకి క్యాన్సర్ చివరి దశ అని తెలుస్తుంది.

45
కూతుర్ని రక్షించుకోవడం కోసం
Image Credit : Asianet News

కూతుర్ని రక్షించుకోవడం కోసం

తన కూతుర్ని రక్షించుకోవాలి అంటే సన్నీడియోల్.. తప్పనిసరి పరిస్థితుల్లో విలన్ అక్షయ్ ఖన్నా సాయం కోరాలి. అప్పటికే వారిద్దరికీ శత్రుత్వం ఉంటుంది. అదే టైంలో అక్షయ్ ఖన్నా ఒక యువతి మర్డర్ కేసులో నిందితుడిగా చిక్కుకుంటాడు. తన కూతురిని బతికించుకోవడానికి సన్నీ డియోల్.. అక్షయ్ ఖన్నాని ఆ కేసు నుంచి బయట పడేయడమే మార్గం. దీనితో ఇష్టం లేకపోయినా అతడి తరుపున వాదించడానికి సన్నీ డియోల్ అంగీకరిస్తాడు. గతంలో సన్నీ డియోలో భార్యకి, అక్షయ్ ఖన్నాకి మధ్య ఏం జరిగింది అనేది కూడా కథలో ఆసక్తికరంగా ఉంటుంది.

55
పనోడితో భార్య చేసిన మిస్టేక్
Image Credit : Asianet News

పనోడితో భార్య చేసిన మిస్టేక్

చనిపోయిన యువతి తరుపున తిలోత్తమ షోమే కేసుని వాదిస్తుంది. ఆమె కూడా చాలా తెలివైన లాయర్. కానీ ఆమె ఎత్తుగడలని సన్నీ డియోల్ చిత్తు చేస్తుంటాడు. ఈ క్రమంలో చివరికి కేసు ఎవరు గెలిచారు. ఆ యువతని హత్య చేసింది నిజంగా అక్షయ్ ఖన్నా నేనా ? సన్నీ డియోల్ భార్యతో అక్షయ్ కి సంబంధం ఏంటి ? ఈ కేసుతో అక్షయ్ ఖన్నా భార్యకు సంబంధం ఏంటి ? లాంటి ఆసక్తికర విషయాలు సినిమా చూసే తెలుసుకోవాలి. కథలో వచ్చే ట్విస్టులు కట్టి పడేస్తాయి. బాగా ఎంగేజ్ చేస్తాయి. అక్షయ్ ఖన్నా భార్య వాళ్ళ పనోడితో కలిసి మిస్టేక్ చేస్తుంది. ఆ మిస్టేక్ వల్లే కేసు పూర్తిగా మారిపోతుంది. ఆ ట్విస్ట్ ఇచ్చే హై అంతా ఇంతా కాదు. ఆ ట్విస్ట్ ఏంటో సినిమాలో చూస్తేనే బావుంటుంది. సన్నీ డియోల్ ఎప్పటిలాగే పవర్ ఫుల్ గా అదరగొట్టారు. అక్షయ్ ఖన్నా తన బాడీ లాంగ్వేజ్, మ్యానరిజమ్స్ తో మెప్పించారు. దియా మీర్జా ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఈ చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకుండా చూసేయండి. ఫ్యామిలీ మొత్తం కలసి చూడొచ్చు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Mohan Babu: రాజమౌళికి పొగరు, రాఘవేంద్రరావుకి అహంకారం ఎక్కువ.. మోహన్ బాబు సంచలన కామెంట్స్..
Recommended image2
ఎన్టీఆర్, ఏఎన్నార్ మధ్య పోటీ వల్ల ఆర్టిస్టులు ఎలా నష్టపోయేవారో తెలుసా? సీనియర్ నటుడు చంద్రమోహన్ సంచలన కామెంట్స్..
Recommended image3
Chaitra Rai: వర్షిణి, సుధీర్ హైడ్రామా అట్టర్ ఫ్లాప్.. బిగ్ బాస్ హౌస్ నుంచి చైత్ర రాయ్ అవుట్, మరో ఎలిమినేషన్
Related Stories
Recommended image1
Balakrishna: ఇంద్ర తర్వాత చేసిన సినిమా.. హీరోయిన్లు రివర్స్, ట్రైన్ కూడా రివర్స్..అతి పెద్ద ట్రోల్ మెటీరియల్
Recommended image2
Tollywood: మీడియం రేంజ్ హీరోలు, భారీ బడ్జెట్ సినిమాలు.. వీటికి ఈ ఏడాది కూడా మోక్షం లేదా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved