MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Entertainment
  • Tollywood: మీడియం రేంజ్ హీరోలు, భారీ బడ్జెట్ సినిమాలు.. వీటికి ఈ ఏడాది కూడా మోక్షం లేదా ?

Tollywood: మీడియం రేంజ్ హీరోలు, భారీ బడ్జెట్ సినిమాలు.. వీటికి ఈ ఏడాది కూడా మోక్షం లేదా ?

టాలీవుడ్ లో మీడియం రేంజ్ హీరోల భారీ బడ్జెట్ సినిమాలు ఆలస్యం అవుతున్నాయి. పలు మార్లు రిలీజ్ డేట్లు వాయిదా పడుతున్నాయి. నాగ చైతన్య, సాయి ధరమ్ తేజ్ లాంటి హీరోలు నటించిన ఆ చిత్రాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.

2 Min read
Author : Tirumala Dornala
Published : Jul 29 2026, 12:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
భారీ బడ్జెట్ సినిమాలు ఆలస్యం
Image Credit : Asianet News

భారీ బడ్జెట్ సినిమాలు ఆలస్యం

పాన్ ఇండియా సినిమాల హవా పెరిగిన తర్వాత టాలీవుడ్ సినిమా బడ్జెట్ కూడా పెరిగిపోయింది. మీడియం రేంజ్ హీరోల సినిమాలకు కూడా వందల కోట్ల బడ్జెట్ వెచ్చిస్తున్నారు. టాలీవుడ్ లో చాలా కాలంగా నిర్మాణంలో ఉన్న సినిమాలు ఇప్పటికీ విడుదలకు నోచుకోవడం లేదు. మీడియం రేంజ్ హీరోలు నటిస్తున్న చిత్రాలు అవి. నిఖిల్, నాగ చైతన్య, సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న ఆ చిత్రాల వివరాలు ఇప్పుడు చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
స్వయంభు
Image Credit : our own

స్వయంభు

హీరో నిఖిల్ సిద్దార్థ్ కార్తికేయ 2 చిత్రంతో పాన్ ఇండియా గుర్తింపు పొందారు. నిఖిల్ చిత్రాలు సాధారణంగా మీడియం బడ్జెట్ లలో తెరకెక్కుతుంటాయి. కానీ నిఖిల్ నటిస్తున్న పీరియాడిక్ వార్ యాక్షన్ డ్రామా స్వయంభు చిత్రం భారీ బడ్జెట్ లో తెరకెక్కుతోంది. పలుమార్లు ఈ చిత్ర రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. కానీ పోస్ట్ పోన్ అయింది. ఓ సందర్భంలో నిఖిల్ మాట్లాడుతూ.. ఈ మూవీలో హై క్వాలిటీ విజువల్స్ కోసం సమయం పడుతోంది అని తెలిపారు. అయితే ఈ చిత్ర ఓటీటీ డీల్ విషయంలో కూడా సమస్యలు ఎదురవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. భరత్ కృష్ణమాచారి ఈ చిత్రానికి దర్శకుడు. నభ నటేష్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మరి ఈ ఏడాదైనా ఈ చిత్రం రిలీజ్ అవుతుందా లేదా అనేది ఇంకా క్లారిటీ రాలేదు.

Related Articles

Related image1
Chiranjeevi: చిరంజీవి కాదు, బాలకృష్ణే నెంబర్ 1.. ఆయన నిజస్వరూపం ఇదే, కానీ అందరి ముందు బయటపడరు
Related image2
Tollywood Villains: స్క్రీన్ పై వణుకుపుట్టించే విలన్లకు అందమైన భార్యలు, సోనూసూద్ నుంచి షాయాజీ షిండే వరకు
35
సంబరాల ఏటి గట్టు
Image Credit : Sambarala Yeti Gattu

సంబరాల ఏటి గట్టు

సాయిధరమ్ తేజ్ విరూపాక్ష చిత్రంతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చారు. ప్రస్తుతం తేజు నటిస్తున్న చిత్రం సంబరాల ఏటి గట్టు. డెబ్యూ డైరెక్టర్ రోహిత్ కెపి దర్శకత్వంలో తెరకెక్కుతోంది. రెండేళ్లుగా ఈ చిత్రంలో నిర్మాణంలో ఉన్నప్పటికీ ఇంకా షూటింగ్ పూర్తి కాలేదు. ఈ చిత్రానికి బడ్జెట్ సమస్యలు తలెత్తినట్లు ప్రచారం జరుగుతోంది. ఐశ్వర్య లక్ష్మి ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. చైతన్య రెడ్డి, నిరంజన్ రెడ్డి నిర్మాతలు. పలు మార్లు వాయిదా పడ్డ ఈ చిత్రాన్ని డిసెంబర్ లో రిలీజ్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు. అయితే అధికారికంగా ఇంకా ప్రకటించలేదు.

45
వృషకర్మ
Image Credit : Instagram

వృషకర్మ

నాగ చైతన్య నటిస్తున్న మిస్టీరియస్ థ్రిల్లర్ చిత్రాన్ని విరూపాక్ష డైరెక్టర్ కార్తీక్ దండు తెరకెక్కిస్తున్నారు. తండేల్ పూర్తి కాగానే నాగ చైతన్య ఈ మూవీ మొదలు పెట్టారు. కానీ ఇప్పటికీ రిలీజ్ డేట్ పై క్లారిటీ లేదు. ఈ ఏడాది ప్రారంభంలోనే రావలసిన ఈ చిత్రం వాయిదా పడింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ డిలే అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మూవీలో మీనాక్షి చౌదరి హీరోయిన్.

55
విశ్వంభర
Image Credit : social media

విశ్వంభర

ఇది మీడియం రేంజ్ హీరో సినిమా కాదు. మెగాస్టార్ సినిమా. చాలా కాలంగా ఈ చిత్రం వాయిదా పడుతూ మెగా అభిమానులని కలవరపెడుతోంది. సీజీ, విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ తీవ్రంగా ఆలస్యం అవుతున్నట్లు టాక్. ఈ మూవీ గురించి చిత్ర యూనిట్ కి సంబంధించిన ఎవ్వరూ మాట్లాడడం లేదు. దీనితో అసలు విశ్వంభర ఈ ఏడాది అయినా వస్తుందా రాదా అనే అనుమానాలు మొదలయ్యాయి. వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో త్రిష హీరోయిన్ గా నటిస్తున్నారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: దమ్ముంటే రా అంటూ వర్షిణి, నువ్వు అహాంకారంతో ఉన్నావని కృష్ణుడు.. రోహిత్‌కి మాస్‌ వార్నింగ్‌
Recommended image2
Vaishnavi Chaitanya: మనలో మ్యాటర్‌ ఉంటే తెలుగమ్మాయిలకు కూడా ఆఫర్లు.. వైష్ణవి చైతన్య కామెంట్‌
Recommended image3
Toxic OTT Deal: 200 కోట్లు రిజెక్ట్ చేస్తే, ఇప్పుడు 30 కోట్లకు అడుగుతున్నారు.. యశ్‌ 'టాక్సిక్‌'కు ఓటీటీ షాక్
Related Stories
Recommended image1
Chiranjeevi: చిరంజీవి కాదు, బాలకృష్ణే నెంబర్ 1.. ఆయన నిజస్వరూపం ఇదే, కానీ అందరి ముందు బయటపడరు
Recommended image2
Tollywood Villains: స్క్రీన్ పై వణుకుపుట్టించే విలన్లకు అందమైన భార్యలు, సోనూసూద్ నుంచి షాయాజీ షిండే వరకు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved