MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • Karthika Deepam: దీప హెల్త్ కండిషన్ గురించి తెలుసుకున్న సౌందర్య.. కార్తీక్,దీప లపై అనుమాన పడుతున్న హిమ?

Karthika Deepam: దీప హెల్త్ కండిషన్ గురించి తెలుసుకున్న సౌందర్య.. కార్తీక్,దీప లపై అనుమాన పడుతున్న హిమ?

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ మంచి రేటింగ్ తో దూసుకెళ్తుంది. ఒకటే కథతో నిత్యం ట్విస్ట్ ల మీద ట్విస్టులతో ప్రసారమవుతున్న ఈ సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు జనవరి 17వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.  

4 Min read
Author : Navya G
Published : Jan 17 2023, 07:58 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఈరోజు ఎపిసోడ్ లో దీప వాళ్ళ నాన్న ఆ పిల్లలను దీప కార్తీక్ లను అందరిని చూసి ఇప్పటికే నాకు ఇదంతా నిజమా కల అన్నట్టుగా ఉంది అని అనుకుంటూ ఉంటాడు. ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నారు ఎందుకు రాలేదు అని అడుగుతుండగా ఇంతలో భాగ్యం అక్కడికి వచ్చి ఇంకా అదే మాట్లాడుతున్నారా కూతురు అల్లుడు వచ్చారు కదా అది చాలు అవన్నీ వద్దులేండి వదిలేసేయండి ఇదిగో ఈ పాయసం తినండి అని అంటుంది. అప్పుడు భాగ్యం భర్త భాగ్యం నువ్వేనా ఎప్పుడూ అర్థ కప్పుతో పాయసం చేసి దాన్ని ఇంటి అందరికి పెట్టేదానివి ఇప్పుడు పాయసం కప్పుల్లో అందరికీ ఇచ్చావు అనగా అందరూ నవ్వుకుంటూ ఉంటారు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఈ సంతోషంలో ఊరందరికీ చేసి పెడదాం అనుకున్నాను కానీ నువ్వు షాక్ అవుతావని నేను ఇవ్వలేదు అంటుంది భాగ్యం. అప్పుడు వాళ్ళందరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. మరొకవైపు సౌందర్య డాక్టర్ తో ఫోన్ మాట్లాడుతూ దీప బతికే అవకాశాలు లేవా అనగా గుండె మార్పిడి చేస్తే బతికే అవకాశాలు ఉంటాయి మేడం అనడంతో గుండె ఎవరు ఇస్తారు డాక్టర్ అంటూ ఎమోషనల్ గా మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలోనే మోనిత అక్కడికి వచ్చి సౌందర్య చేతిలో ఉన్న ఫోన్ లాక్కుంటుంది. ఏంటే నువ్వు ఫోన్ ఇలా ఇవ్వు అనడంతో ఎందుకు అంటే ఆవేశపడతారు మీ కొడుకే గొప్ప కార్డియాలజిస్ట్ గుండె డాక్టర్ అని చెప్పుకుంటారు మరి కార్తీక్ తెలియనప్పుడు ఇంకెవరికైనా ఎలా తెలుస్తుంది చెప్పండి అని అంటుంది మోనిత.

37

 మీ కొడుకే దీప విషయంలో చేతులెత్తేశాడు అని అంటుంది. దీప మీకు దూరమవుతుందని ఒక్క కారణంతోనే వాళ్ళు ఎన్ని రోజులు ఇక్కడికి రాకుండా ఉన్నారు అంటూ మోనిత నాటకాలు వాడుతూ ఉంటుంది. అప్పుడు మీ కోడల్ని కాపాడేది నేను ఒక్కటే ఆంటీ అనడంతో నువ్వా అని అంటుంది సౌందర్య. నేను కార్తికి ఆల్రెడీ దీప విషయం గురించి నేను గుండె ఇస్తాను అన్న విషయం గురించి చెప్పానని కానీ కార్తీక్ వినడం లేదు అనగా నిజమే నువ్వు విషయం లాంటి దానివి అమృతం అవుతావు అంటే ఎలా నమ్మాలి అని అంటుంది సౌందర్య. దీపు బతకాలి అంటే నేను చావాలి ఆంటీ అనడంతో సౌందర్య షాక్ అవుతుంది.

47

అవునే నిజంగా నువ్వు ఎప్పుడో చచ్చి ఉంటే దీప ఈపాటికి లక్షణంగా ఆనందంగా బతికి ఉండేది అని అంటుంది సౌందర్య. ఒకవేళ నిజంగానే దీప నీ మూలంగా బతుకుతుంది అంటే నిన్ను చంపేసిన దీపకి నేను గుండె మార్పిడి చేయిస్తాను అనడంతో నేనే చనిపోతాను అంటున్నాను కదా ఆంటీ మళ్లీ మీరు నన్ను చంపడం ఏంటి అని అంటుంది. కానీ నాకు ఒక ఆఖరి కోరిక ఉంది ఆంటీ అని అంటుంది. మీ కొడుకుతో నాకు పెళ్లి చేయండి నా గుండె దీపకు ఇచ్చి తృప్తిగా చనిపోతాను అనడంతో సౌందర్య షాక్ అవుతుంది. నమ్మండి ఆంటీ అనడంతో చాలు ఆపవే నీ నాటకాలు అని అంటుంది. ఇటువంటి పనికిమాలిన ప్రపోజల్ తో ఎప్పుడూ నా ఇంటికి రావద్దు వెళ్ళు అని సీరియస్ అవ్వడంతో మోనిత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. 
 

57

మరొకవైపు కార్తీక్ ఫోన్ మాట్లాడుతూ ఉండగా ఇంతలో సౌందర్య అక్కడికి రావడంతో అబద్ధాలు చెప్పి కవర్ చేస్తూ ఉంటాడు. అప్పుడు సౌందర్య దీప రిపోర్ట్స్ చూసి కార్తీక్ నిలదీయడంతో కార్తీక్ కన్నీళ్లు పెట్టుకుంటాడు. అప్పుడు కార్తీక్ ఏడుస్తూ ఈ కారణంతోనే మమ్మీ మేము తప్పించుకొని తిరిగాము అని ఏడుస్తూ ఉండగా సౌందర్య కూడా ఎమోషనల్ అవుతుంది. ఎంతోమందికి ఆపరేషన్ చేసిన నేను నా భార్యని నేను బతికించుకోలేకపోతున్నాను ఇదే రాత మమ్మీ అని ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు సౌందర్య కార్తీక్ ఇద్దరు ఏడుస్తూ ఉంటారు. అప్పుడు మోనిత అన్న విషయం గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు. మరొకవైపు శౌర్య,హిమ ఇద్దరూ పాటలు పెట్టుకొని డాన్స్ చేస్తూ ఉండగా ఇంతలో అక్కడికి దీప వస్తుంది.
 

67

అప్పుడు పిల్లలిద్దరూ రామ్మ కలిసి డాన్స్ చేద్దాము అనగా అప్పుడు దీప నాకు రాదు అనడంతో బలవంతంగా దీపనీ లాక్కొని వెళ్తారు. అప్పుడు దీప హిమ ఇద్దరు కలిసి డాన్స్ చేస్తూ ఉంటారు. అప్పుడు సౌందర్య అక్కడికి వచ్చి దీప అని గట్టిగా అరిచి ఇప్పుడు ఈ డ్యాన్సులు ఏంటి అవసరమా అని అంటుంది. డాన్స్ వేస్తె ఏంటి నానమ్మ అని అనడంతో  అలసిపోతుంది కదా హిమ అంటూ మళ్ళీ అబద్ధాలు చెప్పి కవర్ చేస్తూ ఉంటుంది సౌందర్య. అప్పుడు దీప వంట చేస్తాను అనగా వద్దు నువ్వు కూర్చో నేనే వడ్డిస్తాను అని అంటుంది. అప్పుడు సౌందర్య అక్కడి నుంచి వెళ్లిపోవడంతో దీప ఏమైంది డాక్టర్ బాబు అని అడగగా అప్పుడు కార్తీక్ నిజం తెలియదు మమ్మీకి ఎలా తెలుస్తుంది అని అబద్ధాలు చెప్పి కవర్ చేస్తూ ఉంటాడు.

77

ఎప్పటికి నిజం తెలియకూడదు డాక్టర్ బాబు అనుకుంటూ ఉంటుంది. అప్పుడు దీప కార్తీక్ ల మాటలు విన్న హిమ ఏదో జరుగుతుంది అని ఆలోచనలో పడుతుంది. మరొకవైపు మోనిత ఈ ప్లాన్స్ ఏంటి వర్కౌట్ అయ్యేలా లేవు అని ఆలోచించుకుంటూ ఉండగా ఇంతలో హిమ సౌందర్య మొబైల్ నుంచి మోనిత ఫోన్ చేస్తుంది. మా అమ్మ వాళ్ళు ఏదో సీక్రెట్ అంటున్నారు ఏదైనా నిజం దాస్తున్నారు నాకు చెప్పండి ఆంటీ ప్లీజ్ ఆంటీ వినడంతో వద్దులేమా నువ్వు చిన్న పిల్లవి అని అంటుంది మోనిత. వద్దులే హిమ తలచుకుంటే నాకే ఏడుపు వస్తోంది నువ్వు చెబితే నువ్వు తట్టుకోలేవు అనడంతో హిమ ఏడుస్తూ ఆంటీ ప్లీజ్ ఆంటీ ఏంటో చెప్పండి ఆంటీ అని అంటుంది. అప్పుడు మోనిత నాటకాలు ఆడుతూ స్వారీ హిమ నేను చెప్పలేను నావల్ల కాదు అని ఫోన్ కట్ చేస్తుంది. అప్పుడు ఫోన్ కట్ చేసిన మోనిత ఆ ఇంట్లో ఎవరు దొరుకుతారా అనుకుంటున్నాను ఈ పిల్ల దొరికింది అనుకుంటూ ఉంటుంది.

About the Author

NG
Navya G
 

Latest Videos
Recommended Stories
Recommended image1
వర్షిణి కోసం దేబ్జానీకి అన్యాయం చేసిన ముఖేష్, చేపల మార్కెట్ లా తయారైన బిగ్ బాస్ హౌస్..
Recommended image2
Ambika Vs Radha: రాధ కంప్లైంట్‌పై అంబిక కౌంటర్.. మోసపోయింది నేనే అంటూ చెల్లికి అక్క ట్విస్ట్
Recommended image3
Michael Jackson: రజనీకాంత్ కోసం మైఖేల్ జాక్సన్ పాడాల్సింది.. 16 ఏళ్ల తర్వాత తమన్ చెప్పిన సీక్రెట్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved