MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Sivaji Remuneration: మరోసారి బిగ్‌ బాస్‌ కి యాంకర్‌గా శివాజీ.. ఊహించని రెమ్యూనరేషన్‌

Sivaji Remuneration: మరోసారి బిగ్‌ బాస్‌ కి యాంకర్‌గా శివాజీ.. ఊహించని రెమ్యూనరేషన్‌

బిగ్‌ బాస్‌ తెలుగు 10 బజ్‌కి మరోసారి శివాజీ యాంకరింగ్‌ చేయబోతున్నారు. గతంలోనూ ఆయన యాంకరింగ్‌ చేశారు. ఈ సీజన్‌కి కూడా ఫైనల్‌ అయ్యారు. మరి దీనికి ఆయన ఎంత పారితోషికం తీసుకుంటున్నారో తెలుసా?

2 Min read
Author : Aithagoni Raju
Published : Sep 05 2026, 07:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బిగ్‌ బాస్‌ తెలుగు 10 గ్రాండ్‌ గా ప్రారంభానికి ఒక్క రోజు
Image Credit : youtube/@starmaa

బిగ్‌ బాస్‌ తెలుగు 10 గ్రాండ్‌ గా ప్రారంభానికి ఒక్క రోజు

బిగ్‌ బాస్‌ తెలుగు 10 ప్రారంభానికి ఒక్క రోజు మాత్రమే ఉంది. రేపు ఆదివారం(సెప్టెంబర్‌ 6)న సాయంత్రం 7 గంటల నుంచి అధికారికంగా ప్రారంభం కానుంది. నాగార్జున హోస్ట్ గా చేస్తున్న ఈ షో ఈ సారి రసవత్తరంగా ఉండబోతుంది. క్రేజీ సెలబ్రిటీలు కంటెస్టెంట్లుగా బిగ్‌ బాస్‌ హౌజ్‌లోకి అడుగుపెట్టబోతున్నారు. సెలబ్రిటీల విభాగం నుంచి పది మంది కంటెస్టెంట్లు, కామనర్స్ నుంచి ఆరుగురు హౌజ్‌లోకి అడుగుపెట్టబోతున్నట్టు సమాచారం. వారి పేర్లు ఇప్పటికే లీక్ అయ్యాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
బిగ్‌ బాస్‌ తెలుగు 10 కంటెస్టెంట్లు వీళ్లే
Image Credit : youtube/@StarMaaOfficial

బిగ్‌ బాస్‌ తెలుగు 10 కంటెస్టెంట్లు వీళ్లే

బిగ్‌ బాస్‌ తెలుగు 10 హౌజ్‌లోకి సెలబ్రిటీ విభాగం నుంచి రామ్‌ ప్రసాద్‌, దేబ్జానీ, టెంపర్‌ వంశీ, కృష్ణుడు, త్రిగుణ్‌, చైత్ర రాయ్‌, జబర్దస్త్ నరేష్‌, ముఖేష్‌ గౌడ, వర్షిణి సౌందరాజన్‌, సుధీర్‌ రెడ్డి అడుగుపెట్టనున్నారు. కామనర్స్ నుంచి ఆర్జే చరణ్‌, అమన్‌, రోహిత్‌ నాయుడు, సింగర్‌ ఝాన్సీ, షాలిని, సృష్టి వ్యాకరణం వంటి వారు హౌజ్‌లోకి వెళ్తున్నారట. మొత్తంగా అటు సెలబ్రిటీ నుంచి ఇటు కామనర్స్ నుంచి క్రేజీ కంటెస్టెంట్లు వెళ్తున్నట్టు సమాచారం. దీనిపై రేపు క్లారిటీ రావాల్సి ఉంది.

35
బిగ్‌ బాస్‌ బజ్‌కి యాంకర్‌గా శివాజీ
Image Credit : our own

బిగ్‌ బాస్‌ బజ్‌కి యాంకర్‌గా శివాజీ

ఇదిలా ఉంటే బిగ్‌ బాస్‌ షోతోపాటు బిగ్‌ బాస్‌ బజ్‌కి కూడా మంచి క్రేజ్‌ ఉంది. ఇందులో ఎలిమినేట్‌ అయిన కంటెస్టెంట్లు వస్తారు. తమ అనుభవాలను పంచుకుంటారు. తోటి కంటెస్టెంట్ల గురించి తమ అభిప్రాయాలు వెల్లడిస్తారు. ఎవరు బెటర్‌, ఎవరు రాంగ్‌ అనేది కూడా క్లారిటీగా చెబుతారు. దీనికి హోస్ట్ చేసేవాళ్లు కూడా చాలా ముఖ్యం. రెగ్యూలర్‌గా బిగ్‌ బాస్‌ గత సీజన్‌ విన్నర్స్ తో చేయిస్తుంటారు. లేదంటే అందులోనే పాల్గొన్న మోస్ట్ పాపులర్‌ సెలబ్రిటీలతో యాంకరింగ్‌ చేయిస్తుంటారు. వాళ్లు ఎలిమినేట్‌ అయిన కంటెస్టెంట్లని ఆడుకుంటారు. తమ ప్రశ్నలతో ఇరకాటంలో పెడుతుంటారు. అయితే మరోసారి బిగ్‌ బజ్‌కి శివాజీ హోస్టింగ్‌ చేయబోతున్నారట. ఆయన గత సీజన్‌లోనూ యాంకర్‌గా చేసిన విషయం తెలిసిందే.

45
శివాజీ పారితోషికం
Image Credit : starmaa

శివాజీ పారితోషికం

ఇప్పుడు బిగ్‌ బాస్‌ తెలుగు 10 బజ్‌కి కూడా యాంకర్‌గా చేస్తున్నారు. స్వయంగా ఆయనే ఈ విషయాన్ని కన్ఫమ్‌ చేశారు. అయితే ఇది వారాంతంలోనే ఉంటుంది. ఎలిమినేట్‌ అయిన కంటెస్టెంట్లని వీరు ఇంటర్వ్యూ చేస్తారు. ఇది ప్రతి ఆదివారం రాత్రి ప్రసారం అవుతుంది. అంటే వీక్లీ ఒక్కసారి మాత్రమే ఈ ఎపిసోడ్‌ ఉంటుంది. మరి ఈ యాంకరింగ్‌ చేసినందుకు శివాజీ ఎంత పారితోషికం తీసుకుంటున్నానేది ఆసక్తికరంగా మారింది. దీనికి సంబంధించిన సమాచారం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. గత సీజన్‌లో ఆయన ఒక్కో ఎపిసోడ్‌కి అంటే ఒక్కో ఇంటర్వ్యూకి మూడున్నర లక్షలు తీసుకునే వారు. మరి ఇప్పుడు కూడా రూ.3.50-4లక్షల వరకు పారితోషికం తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఇది 15 వారాలు ఉంటుంది. అంటే సుమారు రూ.50-60లక్షల వరకు శివాజీ పారితోషికం అందుకోబోతున్నారని చెప్పొచ్చు. ఇది విన్నర్‌ స్థాయి పారితోషికం కావడం విశేషం.

55
ఎపిక్‌తో రాబోతున్న శివాజీ
Image Credit : Asianet News

ఎపిక్‌తో రాబోతున్న శివాజీ

శివాజీ బిగ్‌ బాస్‌ తెలుగు 7వ సీజన్‌లో పాల్గొన్నారు. ఈ షోతో ఆయన మరోసారి పాపులర్‌ అయ్యారు. ఆ తర్వాత `90 ఏ మిడిల్‌ క్లాస్ బయోపిక్‌` అనే వెబ్‌ సిరీస్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. దీనికితోడు `కోర్ట్` సినిమాలో అదిరిపోయే పాత్ర దక్కింది. మంగపతిగా విశ్వరూపం చూపించారు. ఇది ఆయన ఇమేజ్‌ని మార్చేసింది. అలాగే `దండోరా`లోని పాత్రకి మంచి పేరు, ప్రశంసలు దక్కాయి. ఇటీవల అఖిల్‌ `లెనిన్‌`లోనూ కీలక పాత్రలో మెప్పించారు. ఇప్పుడు `ఎపిక్‌` మూవీలో హీరోకి తండ్రిగా కనిపించబోతున్నారు. ఈ చిత్రం ఈ నెల 11న విడుదల కాబోతుంది. ఇలా నటుడిగా ఫుల్‌ బిజీ అయ్యారు శివాజీ. మొత్తానికి `బిగ్‌ బాస్‌` ఆయన్ని బౌన్స్ బ్యాక్‌ అయ్యేలా చేసిందని చెప్పొచ్చు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
బిగ్ బాస్ తెలుగు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10: హౌస్ నుంచి అపూర్వ, చరణ్ ఇద్దరూ అవుట్.. షాలినికి చుక్కలు చూపించిన వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్
Recommended image2
Ramakrishna: ఖాకీ యూనిఫామ్ వేసుకోవాలనే కల, కానీ క్యాటరింగ్ యూనిఫామ్ తో జీవితం.. బిగ్ బాస్ లోకి రామకృష్ణ
Recommended image3
Swetha Naidu: సాఫ్ట్ వేర్ జాబ్ వదిలేసుకుని ఇండస్ట్రీలోకి శ్వేతా నాయుడు, బిగ్ బాస్ లోకి ఫైర్ బ్రాండ్ ఎంట్రీ
Related Stories
Recommended image1
Romanchakam Day 2 Collections: రోమాంచకం మూవీకి అదిరిపోయే కలెక్షన్లు.. 2 రోజుల్లో ఎంత వచ్చాయంటే?
Recommended image2
Soundarya: సౌందర్య వల్లే `మిస్ యూ' అనే పదం ఎంత భారమైనదో తెలిసింది.. అర్జున్‌ సర్జా ఎమోషనల్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved