MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • Guppedantha Manasu: వసుధారని క్షమించేది లేదంటున్న రిషి.. శైలేంద్ర కన్నింగ్ ప్లాన్ వర్క్ అవుట్ అవుతుందా?

Guppedantha Manasu: వసుధారని క్షమించేది లేదంటున్న రిషి.. శైలేంద్ర కన్నింగ్ ప్లాన్ వర్క్ అవుట్ అవుతుందా?

Guppedantha Manasu: స్టార్ మా లో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ మంచి కథ కథనాలతో ప్రేక్షకుల హృదయాలని గెలుచుకుంటుంది. తన తమ్ముడి ఉన్నతిని భరించలేకపోతున్న ఒక అన్న కథ ఈ సీరియల్. ఇక ఈరోజు ఆగస్టు 12 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం. 

3 Min read
Author : Navya G
Published : Aug 12 2023, 07:33 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

ఎపిసోడ్ ప్రారంభంలో మహేంద్ర సార్ కి ఫోన్ చేయండి సార్ వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అని రిషికి చెప్తుంది వసుధార. నేను ఎప్పుడు ఏ పని చేయాలో నాకు బాగా తెలుసు అంటాడు రిషి. మీకు ఎప్పుడు ఏ పని చేయాలో తెలుసు కానీ గుర్తు చేస్తున్నాను అంతే అంటుంది వసుధార. అందరు హ్యాపీనెస్ గురించి ఆలోచిస్తున్నావు నా హ్యాపీనెస్ గురించి ఎందుకు ఆలోచించలేకపోయావు అంటాడు రిషి.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

అలా అని ఎందుకు అనుకుంటున్నారు నావల్ల మీకు అన్యాయం జరిగింది నిజమే కానీ అందుకు ఎప్పుడూ నేను గిల్టీగా ఫీల్ అవ్వలేదు ఎందుకంటే నేను అప్పుడున్న పరిస్థితుల్లో మీకు మంచే చేశాను కానీ మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వసుధార. మంచి కోసం చేసినా,చెడు కోసం చేసినా తప్పు తప్పే నేను మిమ్మల్ని ఎప్పటికీ క్షమించలేను అనుకుంటాడు రిషి. మరోవైపు డిబిఎస్టి కాలేజీకి వెళ్లిన శైలేంద్ర అక్కడ ప్రిన్సిపాల్ ద్వారా డేటా అంతా సంపాదిస్తాడు.
 

38

గతంతో పోలిస్తే స్ట్రెంత్ బాగా తగ్గింది గర్ల్స్ స్ట్రెంత్  మరీ ఘోరంగా ఉంది రిజల్ట్స్ కూడా చాలా తక్కువగా వస్తున్నాయి కారణం ఏంటి అని అడుగుతాడు శైలేంద్ర.  రిషి సార్  లేరు కదా సార్ ఆయన ఉంటే అడ్మిషన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కాలేజీ ఎండింగ్ వరకు ప్రతిదీ దగ్గరుండి చూసుకునేవారు. ఆయన లేకపోవడంతో ఎవరికి బాధ్యత లేకుండా పోయింది అంటాడు ప్రిన్సిపల్. సరే నువ్వు వెళ్ళు అని చెప్పడంతో ప్రిన్సిపల్ వెళ్ళిపోతాడు.
 

48

ప్రిన్సిపల్ ఇచ్చిన డేటా ని చూస్తూ మంచి అవకాశం వచ్చింది దీంతో నేను అనుకున్న పని పూర్తి చేస్తాను అని నవ్వుకుంటాడు శైలేంద్ర. మరోవైపు కార్లో వస్తున్న మహేంద్ర తో శైలేంద్ర ఏదో పెద్ద ప్లాన్ మీదే కాలేజీలోకి అడుగు పెట్టాడు అంటుంది జగతి. అవును లేదంటే ఏ పని చేద్దామన్నా డిస్కరైజ్  చేసేవాడు ఇప్పుడు ఏదో ఉద్ధరించేస్తానని కాలేజీలో అడుగు పెడుతున్నాడంటే దాని వెనుక ఏదో కారణం ఉంది. నా కన్న కొడుకుని చంపాలి అనుకున్న వాడిని కళ్ళ ఎదురుగుండా ఉన్నా  ఏమి చేయలేకపోతున్నాను. ఇలాంటి దౌర్భాగ్యం ఎవరికి రాకూడదు .

58

ఎంత ధైర్యం ఉంటే రిషి మీద మళ్లీ అటాక్ చేస్తాడు.. మనం ఎలాగైనా రిషి ని  కాపాడుకోవాలి అంటాడు మహేంద్ర. అవసరం లేదు రిషి ని కంటికి రెప్పలాగా చూసుకోవటానికి అక్కడ వసుధార ఉంది. మన వల్లే రిషి తనకి ప్రాణం లాంటిది కాలేజీని వదిలేయ వలసి  వచ్చింది. అలాంటి కాలేజీని డెవలప్ చేసి అతని చేతిలో పెట్టడం మన బాధ్యత అంటుంది జగతి. మరోవైపు రోడ్డు మీద కారు ఆపి ఎవరికోసం వెయిట్ చేస్తూ ఉంటాడు శైలేంద్ర.
 

68

ఈ దెబ్బతో నేను అనుకున్న పని అవుతుంది అని అనుకుంటూ ఉండగానే ఒకతను అక్కడికి వస్తాడు. నేను చెప్పింది చెప్పినట్లు చేసావా అంటాడు శైలేంద్ర. అంతకంటే ఎక్కువే చేశాను సార్ మీరే చూడండి అంటాడు ఆ వచ్చిన వ్యక్తి. పేపరు చదివిన శైలేంద్ర ఆనందంతో   గుడ్ జాబ్ అనుకున్న దానికన్నా బాగా రాసావు అని చెప్పి కొంత డబ్బు అతని చేతిలో పెట్టి అతనిని పంపించేస్తాడు. మరోవైపు మిషన్ ఎడ్యుకేషన్ గురించి ఫైల్ తయారు చేస్తుంది జగతి. అప్పుడే మహేంద్ర వస్తాడు. ఈ ఫైలు విష్ కాలేజీకి పంపించాలి ఒకసారి ప్రిన్సిపాల్ కి ఫోన్ చెయ్యు అంటుంది  జగతి.
 

78

మహేంద్ర ప్రిన్సిపాల్ కి ఫోన్ చేస్తే జగతి మాట్లాడుతుంది. నేను ఫైల్ పంపిస్తున్నాను మీరు ఒకసారి చెక్ చేసి చైర్మన్ గారికి పంపిస్తే మిషన్ ఎడ్యుకేషన్ పనులు ప్రారంభించవచ్చు అంటుంది. అంతా బాగానే ఉంది కానీ మేడం.. చైర్మన్ సార్ ఆరోగ్యం బాగోలేదు రిషి సార్ కి ఆ పనులతోనే సరిపోతుంది. మీరు కొన్ని రోజులు పోయిన తర్వాత ఈ పని ప్రారంభిస్తే బాగుంటుందేమో అంటాడు ప్రిన్సిపాల్. సరే అని ఫోన్ పెట్టేస్తుంది జగతి.
 

88

ఇదేంటి ఇలా జరిగింది అని బాధపడతాడు మహేంద్ర. మన బిడ్డని ఆయన కన్న బిడ్డ లాగా చూసుకున్నారు మనం ఒకసారి వెళ్లి ఆయనని చూసి వద్దాము అంటాడు మహేంద్ర.   ఇప్పుడు మనం అక్కడికి వెళ్తే రిషి బాధపడతాడు. అందుకే విశ్వనాథం గారికి కాల్ చేసి పలకరిద్దాం అంటుంది జగతి. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Pandanti Kapuram Review: ఏఎన్నార్ దసరాబుల్లోడికి షాక్ ఇచ్చిన కృష్ణ, సూపర్ స్టార్ ఫస్ట్ గోల్డెన్ జూబ్లీ మూవీ, పండంటి కాపురం రివ్యూ..
Recommended image2
Agnipariksha 2: రైతు బిడ్డ సింగర్‌ ఝాన్సీ సంచలనం.. బిగ్‌ బాస్‌ తెలుగు 10 ఫస్ట్ కంటెస్టెంట్‌ కన్ఫమ్‌
Recommended image3
Actor Soori: నాతో నటించడానికి హీరోయిన్లు భయపడ్డారు.. సూరి షాకింగ్ కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved