- Home
- Entertainment
- టామ్ క్రూజ్ ని సైతం వెనక్కి నెట్టిన షారుఖ్, వరల్డ్ లో రిచెస్ట్ నటుడిగా 4వ స్థానం.. ఆస్తులు ఎన్నివేల కోట్లంటే
టామ్ క్రూజ్ ని సైతం వెనక్కి నెట్టిన షారుఖ్, వరల్డ్ లో రిచెస్ట్ నటుడిగా 4వ స్థానం.. ఆస్తులు ఎన్నివేల కోట్లంటే
బాలీవుడ్ బాద్షా షారుఖ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన ఎవర్ గ్రీన్ చార్మ్ తో షారుఖ్ కోట్లాదిమంది అభిమానులని సొంతం చేసుకున్నాడు. త్వరలో షారుఖ్ ఖాన్ పఠాన్ చిత్రంతో అలరించేందుకు ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

బాలీవుడ్ బాద్షా షారుఖ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన ఎవర్ గ్రీన్ చార్మ్ తో షారుఖ్ కోట్లాదిమంది అభిమానులని సొంతం చేసుకున్నాడు. త్వరలో షారుఖ్ ఖాన్ పఠాన్ చిత్రంతో అలరించేందుకు ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అనేక వివాదాలు సృష్టిస్తున్న ఈ చిత్రం జనవరి 25న రిలీజ్ కి రెడీ అవుతోంది.
ఇదిలా ఉండగా షారుఖ్ ఖాన్ రీసెంట్ గా మరో రికార్డ్ అందుకున్నాడు. వరల్డ్ లో రిచెస్ట్ నటులలో ఒకరిగా షారుఖ్ ఆల్రెడీ ఉన్నారు. ఈ ఏడాది షారుఖ్ ఆస్తులు మరింతగా పెరిగాయి. దీనితో అత్యంత ధనికులైన నటుల జాబితాలో వరల్డ్ లోనే షారుఖ్ టాప్ 4గా నిలిచాడు.
ఇక్కడ విశేషం ఏంటంటే షారుఖ్ ఏకంగా హాలీవుడ్ క్రేజీస్టార్ టామ్ క్రూజ్ ని సైతం వెనక్కి నెట్టాడు. టామ్ క్రూజ్ ఆస్తుల విలువ 620 మిలియన్ డాలర్లతో 5వ స్థానంలో ఉండగా.. షారుఖ్ 700 మిలియన్ డాలర్లతో 4వ స్థానం కైవసం చేసుకున్నారు. జెర్రీ సానిఫెల్డ్ 1 బిలియన్ డాలర్స్, టైలర్ పెర్రీ కూడా 1 బిలియన్ డాలర్స్ తో మొదటి రెండు స్థానాలని ఆక్రమించారు. డ్వేన్ జాన్సన్ 800 మిలియన్ డాలర్స్ తో 3 వ స్థానంలో ఉండగా.. నాల్గవ స్థానంలో కింగ్ ఖాన్ ఉన్నారు.
700 మిలియన్ డాలర్స్ అంటే షారుఖ్ ఆస్తి విలువ 6 వేలకోట్ల పైనే ఉంటుంది. ఇంత ఆస్తి కలిగిన షారుఖ్ తన లైఫ్ లో కొన్న అత్యంత ఖరీదైనది ఏంటో తెలుసా.. తాను నివాసం ఉంటున్న మన్నత్ ఇల్లు అని తెలిపారు. షారుఖ్ ఎంతో ఇష్టపడి కొన్న మన్నత్ ఇంటి విలువ ప్రస్తుతం 200 కోట్లపైనే ఉంటుందని తెలుస్తోంది.
షారుఖ్ ఖాన్ కెరీర్ ఆరంభంలో ఢిల్లీ నుంచి బాంబే వచ్చినప్పుడు చిన్న అపార్ట్మెంట్ లో నివాసం ఉండేవాడట. ఎప్పటికైనా పెద్ద ఇల్లు కొనాలనే కోరిక ఉండేదని అందుకే మన్నత్ ని కొనుగోలు చేసినట్లు తెలిపాడు.
షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ మధ్యన ట్రైలర్ కూడా విడుదలయింది. షారుఖ్ ఫుల్ యాక్షన్ మోడ్ లో కనిపిస్తోంది. అయితే దీపికా పదుకొనె మితిమీరి గ్లామర్ వెదజల్లుతుండడం వివాదంగా మారుతోంది.