MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • Samantha: సమంత సైలెంట్‌ కి కారణమదే.. అసలు విషయం తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే.. హాట్‌ టాపిక్‌

Samantha: సమంత సైలెంట్‌ కి కారణమదే.. అసలు విషయం తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే.. హాట్‌ టాపిక్‌

సమంత సోషల్‌ మీడియాలో ఫుల్‌ యాక్టివ్‌గా ఉండేది. మొన్నటి వరకు సమంత పేరు హాట్‌ టాపిక్‌గా మారింది. కానీ ఇప్పుడు సీన్‌ రివర్స్ అయ్యింది. గత కొన్ని రోజులుగా ఆమె ఇంటర్నెట్‌కి దూరంగా ఉంటోంది. కారణమేంటనేది పెద్ద సస్పెన్స్ గా మారింది.

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Aug 29 2022, 07:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

సమంత(Samantha).. ఈ పేరు ఇప్పుడొక సెన్సేషనల్‌. హాట్‌ టాపిక్‌. వివాదాలకు కేరాఫ్‌. పడలేచిన కెరటం. ఉమెన్‌ ఎంపావర్‌మెంట్‌కి నిదర్శనం. స్ట్రాంగ్‌ ఉమెన్‌.స్టార్‌ హీరోయిన్‌. ఇవన్నీ కలిపితే సమంత. అవును.. చైతూతో విడాకుల తర్వాత ఆమె ద్వారా జనానికి తెలిసినవి, తలోని దాగున్న అనేక శక్తులను బయటకు తీసింది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

సమంత మొన్నటి వరకు వార్తల్లో పేరుగా, బ్రేకింగ్‌ న్యూస్‌గా నిలుస్తూ వస్తోంది. ఆమె చేసే కామెంట్లు, పోస్ట్ లు సంచలనంగా మారిన విషయంతెలిసిందే. తనచూట్టూ వివాదాలు పెరిగిపోతున్నాయి. ఏం మాట్లాడినా, ఎలాంటి పోస్ట్ పెట్టినా, అది వివాదంగా, చర్చల్లో పాయింట్ గా మారుతుంది. దీంతో సమంత ఏకంగా సోషల్‌ మీడియాకే దూరంగా ఉంటోంది. 

37

తాజాగా Samantha సోషల్‌ మీడియాకి ఎందుకు దూరంగా ఉంటుందో తెలిసిపోయింది. తన చుట్టూ వివాదాలు ఎక్కువవుతున్న నేపథ్యంలో సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండాలని సామ్‌ నిర్ణయించుకుందట. తనపై వచ్చే పోస్టులు, వార్తలు చదివి చాలా డిస్టర్బ్ అవుతూ తను కూడా ఏదో ఒకటి రియాక్ట్ కావడం,మళ్లీ అది వివాదంగా మారుతున్న నేపథ్యంలో సోషల్‌ మీడియాకి దూరం ఉండటమే బెటర్‌ అని నిర్ణయించుకుందట సమంత. 

47

అయితే ఇదే కాదు సమంత సోషల్‌ మీడియాని పక్కన పెట్టడానికి మరో కారణం కూడా ఉందట. ఆమె హిందీలో రాజ్‌ డీకే దర్శకత్వంలో ఓ వెబ్‌ సిరీస్‌ చేస్తుంది. హాలీవుడ్‌ రస్సో బ్రదర్స్ రూపొందించిన `సిటాడెల్‌`ని హిందీలో రీమేక్‌ చేస్తున్నారు. పూర్తి యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా సాగే సిరీస్‌ ఇది. హిందీలో సమంత ప్రధాన పాత్రలో నటించబోతుంది.

57

ఇందులో వరుణ్‌ ధావన్‌ హీరోగా నటిస్తున్నట్టు తెలుస్తుంది. అదే సమయంలో విక్కీ కౌశల్‌ పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది. ఇద్దరిలో ఎవరుఫైనల్‌ అవుతారనేది తెలియాల్సి ఉంది. వరుణ్‌ పేరు ముందుగా వినిపించగా,ఇప్పుడు విక్కీ పేరు తెరపైకి వచ్చింది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. హీరో ఎవరైనా సమంత కామన్‌. 

67

ఈ సిరీస్‌ కోసం సమంత మార్షల్‌ఆర్ట్స్ నేర్చుకుంటుందట. పూర్తిగా వాటిపైనే ఫోకస్‌ పెట్టి మార్షల్ ఆర్ట్స్ లో ప్రావీణ్యం పొందాలని భావిస్తుందట. ప్రస్తుతం మార్షల్‌ ఆర్ట్స్ శిక్షణలో సమంత బిజీగా ఉందని, దీని కారణంగానే ఆమె సోషల్‌ మీడియాకి దూరంగా ఉందని అంటున్నారు. మూడు నెలలపాటు ఈ శిక్షణలోనే సమంత ఉంటుందట.సినిమాలో ఆమె చేసే యాక్షన్స్ వేరే లెవల్‌లో ఉంటాయని అందుకే ఇంతగా కష్టపడుతుందని సమాచారం. 
 

77

ఇది కాకుండా సమంత వరుసగా పాన్‌ ఇండియా చిత్రాలతో బిజీగానే ఉంది. తెలుగులో ఆమె `యశోద`, `శాకుంతలం`, `ఖుషి` చిత్రాలు చేస్తుంది. ఈమూడు పాన్‌ ఇండియా మూవీస్‌ కావడం విశేషం. దీంతోపాటు హిందీలో ఆయుష్మాన్‌ ఖురానా, అక్షయ్‌ కుమార్‌, తాప్సీ ప్రొడక్షన్‌లో సినిమాలకు కమిట్‌ అయినట్టు సమాచారం. అలాగే ఓ ఇంటర్నేషనల్‌ మూవీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Irumudi Collection: బాక్సాఫీస్ వద్ద రవితేజ ప్రభంజనం.. 9 రోజుల్లో ఇరుముడి ఎంత వసూలు చేసిందంటే?
Recommended image2
Krishna: 23 ఏళ్ల వయస్సులో కృష్ణకి తల్లిగా, ఏఎన్నార్ కి నానమ్మగా నటించిన యంగ్ హీరోయిన్ ఎవరో తెలుసా?
Recommended image3
Mind Bending Thriller: ప్రతి 10 నిమిషాలకు ఒక ట్విస్ట్.. ఈ సినిమా చూస్తే మీ మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే! ఎక్కడ చూడొచ్చంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved