MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Rajendra Prasad: నటకిరీటి బిరుదు వెనుక స్టోరీ రివీల్‌ చేసిన రాజేంద్రప్రసాద్‌.. `పిఠాపురంలో` ఎలా ఉంటుందంటే?

Rajendra Prasad: నటకిరీటి బిరుదు వెనుక స్టోరీ రివీల్‌ చేసిన రాజేంద్రప్రసాద్‌.. `పిఠాపురంలో` ఎలా ఉంటుందంటే?

రాజేంద్రప్రసాద్‌ కి నటకిరీటి అనే బిరుదు ఉన్న విషయం తెలిసిందే. ఆ బిరుదు ఎలా వచ్చింది. ఎవరు పెట్టారనేది తాజాగా ఆయన రివీల్‌ చేశారు. `పిఠాపురంలో అలా మొదలైంది` మూవీ ఈవెంట్‌ ఆయన ఓపెన్‌ అయ్యారు.

3 Min read
Author : Aithagoni Raju
Published : Sep 13 2026, 09:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పిఠాపురంలో అలా మొదలైంది ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌
Image Credit : Asianet News

పిఠాపురంలో అలా మొదలైంది ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌

రాజేంద్రప్రసాద్‌, పృథ్వీరాజ్‌ ప్రధాన పాత్రధారులుగా `పిఠాపురంలో అలా మొదలైంది` అనే సినిమాలో నటించారు. దీనికి చంద్ర మహేష్‌ దర్శకుడు కావడం విశేషం. ఇందులో కేదార్ శంకర్, మణిచందన, అన్నపూర్ణమ్మ, సన్నీ అఖిల్, విరాట్, సాయి ప్రణీత్, శ్రీలు, ప్రత్యూష, రెహానా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాని మహేష్ చంద్ర సినిమా టీమ్, ఎవర్ గ్రీన్ ఎపిక్ సినిమా సంయుక్త నిర్మాణంలో దుండిగళ్ళ బాలకృష్ణ, ఆకుల సురేష్ పటేల్, ఎఫ్.ఎం. మురళి (గోదారి కిట్టయ్య) నిర్మించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనుంది. శనివారం ఈ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని నిర్వహించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
నటకిరీటి బిరుదు వెనుక కథ స్టోరీ చెప్పిన రాజేంద్రప్రసాద్‌
Image Credit : Asianet News

నటకిరీటి బిరుదు వెనుక కథ స్టోరీ చెప్పిన రాజేంద్రప్రసాద్‌

ఈ సందర్భంగా ప్రధాన పాత్రలో నటించిన డా. రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ, `నా 49 సంవత్సరాల సినిమా జీవితంలో నాకు దొరికిన అదృష్టం ఏమిటంటే, నాకు దొరికిన మంచి పాత్రలు. ఇదే ప్రసాద్ ల్యాబ్‌ ప్రివ్యూ థియేటర్‌లో దిగ్దర్శకుడు కె.విశ్వనాథ్ గారు ‘ఆ నలుగురు’ ప్రివ్యూ చూసి ‘ఈ సినిమాలో రఘురామ్ పాత్ర కాకుండా నువ్వెక్కడైనా కనిపిస్తావేమోనని చూశాను. ఎక్కడా దొరకలేదు’ అని అభినందించారు. సి.నారాయణరెడ్డి గారు కూడా ఒక కంటితో నవ్విస్తూ, ఇంకో కంటితో ఏడ్పిస్తున్నావంటూ నాకు ‘నటకిరీటి’ బిరుదు ఇచ్చారు. అదంతా నా గొప్పతనం కాదు. ఆ పాత్రల తాలూకు గొప్పతనం. తీసినవారి గొప్పతనం. అలాంటి పాత్రలు దొరకడం ఆ భగవంతుడు నాకిచ్చిన వరం.

35
తెలుగు వారికి కనెక్ట్ అయ్యే మూవీ
Image Credit : Asianet News

తెలుగు వారికి కనెక్ట్ అయ్యే మూవీ

ఎవరైనా హాలీవుడ్ నటుడిని కూర్చోబెట్టి, ఇదే థియేటర్లో పొద్దున ‘లేడీస్ టైలర్’, సాయంత్రం ‘ఆ నలుగురు’ సినిమా చూపిస్తే ఆ ఆర్టిస్టు ఎవరు, ఈ ఆర్టిస్టు ఎవరు అని అడుగుతారు. ఈ అదృష్టమంతా నాకు ఆ పాత్రలవల్లే దక్కింది. చంద్ర మహేష్ ఈ కథ చెప్పినప్పుడే నా పాత్ర తాలూకు డెప్త్ ఏమిటో అర్థమైంది. ఆయన ఎన్నో కష్టనష్టాలు భరించి ఈ సినిమా తీశాడు. ప్రపంచంలో వున్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ఇది. ఎందుకంటే, ఇది అందరి ఇళ్లలో ఉండే కథ. ఈ సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడూ పది మందికి గొప్పగా చెబుతాడు. మై హార్ట్ ఫెల్ట్ థాంక్స్ టు చంద్రమహేష్. క్లైమాక్స్ సీన్లో ఆర్టిస్టులు కూడా కన్నీరు పెట్టుకున్నారు. అంతటి ఎమోషన్ ఉంది. దాంతోపాటే ఈ జనరేషన్‌కి నచ్చే అన్ని మసాలాలూ ఈ సినిమాలో ఉన్నాయి. ఈ మూవీని చూసి ఆదరించాలని వేడుకుంటున్నా` అని అన్నారు.

45
కుటుంబం అంతా కలిసి చూసే సినిమా
Image Credit : Asianet News

కుటుంబం అంతా కలిసి చూసే సినిమా

గెస్ట్ గా వచ్చిన సుమన్‌ మాట్లాడుతూ, `చంద్ర మహేష్‌ క్లారిటీతో ఉండే అద్భుతమైన దర్శకుడు. ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ మంచి విజయం సాధించాలి. కొత్త కంటెంట్‌తో, ఫ్రెష్ సబ్జెక్ట్‌తో ఆయన తీసిన ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుందని భావిస్తున్నాను` అని అన్నారు. దర్శకుడు మహేష్ చంద్ర మాట్లాడుతూ , `పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాకి మనసుతోపాటు ప్రాణం పెట్టి పని చేశాను. మూవీ అద్భుతంగా వచ్చింది. ఈ జర్నీలో సపోర్ట్ చేసిన నా ఆర్టిస్టులందరికీ థాంక్స్. ప్రతీ ఒక్కరూ తమ తమ పాత్రల్లో జీవించేశారు. ఈ చిత్రం గ్యారెంటీగా హిట్ అవుతుంది. ఈ సినిమాని కుటుంబ సమేతంగా చూడండి. కచ్చితంగా అందరికీ నచ్చుతుంది. ప్రస్తుతం ఫ్యామిలీ ఓరియెంటెడ్ చిత్రాలే నడుస్తున్నాయి. మంచి సినిమాల్ని ఆడియెన్స్ ఆదరిస్తారు. నేను చేసిన అన్ని సినిమాల్లోకెల్లా ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ మరోస్థాయిలో ఉంటుంది’ అని అన్నారు.

55
తండ్రీకూతుళ్ల మధ్య బాండింగ్‌ ని ఆవిష్కరించే మూవీ
Image Credit : Asianet News

తండ్రీకూతుళ్ల మధ్య బాండింగ్‌ ని ఆవిష్కరించే మూవీ

నటుడు పృథ్వీ మాట్లాడుతూ, ‘మహేష్ చంద్ర గారు ‘పిఠాపురంలో… అలా మొదలైంది’లో అద్భుతమైన కథను చూపించబోతున్నారు. తండ్రీ, కూతుళ్లు బంధాన్ని గొప్పగా రాసుకున్నారు. తల్లిదండ్రులు చెప్తే వినే పిల్లలు ఇంకా ఉన్నారు. అలాంటి కూతురు నాకు ఉండటం నా అదృష్టం. ప్రతీ కుటుంబంలో జరిగే కథ ఇది. క్లైమాక్స్‌కి అందరూ కచ్చితంగా కన్నీరు పెట్టుకుంటారు. మహిళా ప్రేక్షకులు ఈ సినిమాకి బ్రహ్మరథం పడతారు’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు, ప్రసన్న కుమార్‌, అనంతగిరి, దర్శకులు రాం ప్రసాద్‌, సముద్ర, వీరశంకర్‌, బీవీఎస్‌ రవి, నిర్మాత చైతన్యరెడ్డి, దండిగల బాలకృష్ణ, ఆకుల సురేష్‌, ఎఫ్‌ ఎం మురళీ, నటి మణిచందన, సత్యం రాజేష్‌, కేదార్‌ శంకర, శ్రీలు, విరాట్‌, సన్నీ వంటి వారు పాల్గొన్నారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Allari Naresh: అల్లరి నరేష్ ఇంత పెద్ద సూపర్ హిట్స్ రిజెక్ట్ చేశాడా.. ఆ ఇద్దరు హీరోల పంట పండింది
Recommended image2
Irumudi: ఇరుముడి బ్లాక్ బస్టర్ హిట్.. చిరంజీవి, రాంచరణ్ ని కలిసిన రవితేజ
Recommended image3
Malavika Mohanan: అందరిముందు మాళవికని ఆమెతో పోల్చిన కార్తీ.. జెంటిల్మెన్ అంటూ పొగిడిన హీరోయిన్
Related Stories
Recommended image1
Bigg Boss Telugu 10: బిగ్‌ బాస్‌ హౌజ్‌లో మరో క్రేజీ లవ్‌ ట్రాక్‌.. వర్కౌట్‌ అయితే టీఆర్‌పీ బ్లాస్టే
Recommended image2
Priyanka Chopra: ప్రియాంక చోప్రా తెలుగులో నటించిన ఫస్ట్ సినిమా ఏంటో తెలుసా? తుఫాన్‌, వారణాసి కాదు, దానితోనే ఎంట్రీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved