MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Entertainment
  • Ennenno Janmala Bandham: దగ్గరవుతున్న యష్, వేద.. మళ్లీ ఫన్నీగా పోట్లాడుకుంటున్న మాలిని సులోచన?

Ennenno Janmala Bandham: దగ్గరవుతున్న యష్, వేద.. మళ్లీ ఫన్నీగా పోట్లాడుకుంటున్న మాలిని సులోచన?

Ennenno Janmala Bandham: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు డిసెంబర్ 21 వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం.. 

3 Min read
Author : Navya G
Published : Dec 21 2022, 12:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఈరోజు ఎపిసోడ్లో యష్ ఈ గది నచ్చింది ఈ ఇల్లు నచ్చింది అంతకంటే ఎక్కువగా నానమ్మ తాతయ్యలు నచ్చారు అని అంటాడు. అప్పుడు రాణి ఒసేయ్ మనవరాలు నీ కంటే మా మనవడు మాకు బాగా నచ్చాడు అని అంటుంది. అప్పుడు వాళ్ళిద్దరూ అక్కడ నుంచి వెళ్లిపోవడంతో వెంటనే వేద పర్లేదు మా అమ్మమ్మ తాతయ్య ల దగ్గర బాగానే మార్కులు కొట్టేసావు అని అంటుంది. మరి ఏమనుకున్నావు బెస్ట్ సీఈఓ ఇక్కడ అని అంటాడు యశోదర్. ఆ తర్వాత రాణి రాజా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు రాణి మన అమ్మాయి సులోచన ఫోన్లో ఏమో వీరిద్దరు సరిగా లేరు అని చెప్పింది వీలు చూస్తే చిలక గోరింకల్లా పాలు నీళ్లలా బాగా కలిసిపోయి ఉన్నారు అని అంటుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

అప్పుడు రాజా మన సులోచన గురించి తెలిసిందే కదా చిన్న చిన్న గొడవలకే ఎక్కువగా దిగులు చెందుతూ ఉంటుంది. అయినా మన మనవరాలు మనవడు ఇద్దరు ఇక్కడే ఒక మూడు నాలుగు రోజులు ఉంటారు కదా అప్పుడు తెలుసుకుందాం వారి మధ్య ఏమాత్రం బంధం ఉందో అని అంటాడు. ఆ తర్వాత యష్ వేద అక్కడికి రావడంతో హైదరాబాద్ నుంచి అలసిపోయి వచ్చారు. ఇద్దరు కలిసి భోజనం చేయండి తర్వాత కబుర్లు చెప్పుకుందాం అని అంటుంది రాణి. అప్పుడు వేద భోజనం వడ్డిస్తుందిగా యష్ అలాగే చూస్తూ ఉంటాడు. అది చూసి రాజా రాణి ఇద్దరు మురిసిపోతూ ఉంటారు.
 

37

తరువాత యష్ భోజనం చేస్తూ ఫిర్యాదుల బాక్స్ అని ఉంది అదేమిటి తాతయ్య అని అడుగుతాడు. అలాంటి బాక్స్ మామూలుగా ఆఫీసులో ఉంటుంది కానీ ఇంట్లో ఉంది ఏంటి తాతయ్య అని అడుగుతాడు. అప్పుడు రాణి దాని గురించి చెబుతూ ఇది నేను మీ తాతయ్య కలిసి చేసుకున్నాము మా మధ్య మనస్పర్ధలు తొలగించే బాక్స్ అది విని యష్ ఆశ్చర్యపోతాడు. మాకు పెళ్లయిన మొదట్లో ఒకరిలో ఉన్న లక్షణాలు ఒకరికి నచ్చకపోవడంతో ఆ విషయాన్ని నేరుగా చెప్పలేక ఆ ఫిర్యాదుల బాక్స్లో వేసుకునే వాళ్ళం అని నవ్వుకుంటూ చెబుతారు రాజా రాణి.

47

ఆ మాటలు విన్న యష్,వేద ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు. ఇప్పుడు వారిద్దరూ ఫిర్యాదుల బాక్స్ గురించి అందులో వేసిన ఫిర్యాదుల గురించి ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు. అప్పుడు రాజా మొగుడు పెళ్ళాలు అంటే ఎవరికి నచ్చినట్టు వారు ఉండడం కాదు ఒకరికి నచ్చినట్టు ఇంకొకరు ఉండాలి అని చెప్పడంతో యష్,వేద ఇద్దరు ఒకరివైపు ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత యష్ నువ్వు కూడా కూర్చోవేద ఇద్దరం కలిసి భోజనం చేద్దాము అని అంటాడు. అప్పుడు రాజారాణి చూస్తున్నారని యష్, కావాలనే వేదతో ప్రేమగా ఉన్నట్లు నటిస్తూ ప్రేమగా మాట్లాడిస్తూ ఉంటాడు.
 

57

అప్పుడు వారిద్దరూ ఒకరి కళ్లలోకి ఒకరు కళ్ళు పెట్టి చూసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత మాలిని సులోచనకు అర్ధరాత్రి సమయంలో ఫోన్ చేసి యష్ వాళ్ళు ఊరికి వెళ్లారా అని అడగగా అది అడగడానికి ఈ టైంలో ఫోన్ చేశారా వదినగారు అని అంటుంది. అప్పుడు వాళ్ళిద్దరూ ఫన్నీగా ఫోన్లో పోట్లాడుకుంటూ ఉంటారు. మరొకవైపు రానీ పూలు కుడుతూ ఉండగా ఇంతలోనే అక్కడికి వేద వస్తుంది. అప్పుడు వేద మేము ఇక్కడికి రావడం మీకు సంతోషంగా ఉందా అని అడగగా చాలా సంతోషంగా ఉంది మీ పెళ్లి విషయంలో మేము పెట్టుకున్న ఆశలు అన్ని తీరాయి అని అంటుంది రాణి.
 

67

అప్పుడు వేద ఈ పూలు నా కోసమే నా అమ్మమ్మ అని అనడంతో అవును తల్లి అనగా ఇప్పుడు ఎందుకు మార్నింగ్ పెట్టుకుంటాను కదా అని అంటుంది. బయటికి వెళ్లినప్పుడు మాత్రమే కాదు భర్త దగ్గరకు వెళ్ళినప్పుడు కూడా ఆడవారు శుభ్రంగా ఉండాలి అని భర్తతో ఎలా మెలగాలో చెబుతూ ఉంటుంది రాణి. అప్పుడు వేద రాణి మాటలు విని నవ్వుకుంటూ ఉంటుంది. భర్తని మన గుప్పెట్లో పెట్టుకోవాలి అని చెబుతూ ఉంటుంది. మరొకవైపు యష్ బెడ్రూంలో ఫోన్ చేస్తుంటూ ఉంటాడు. అప్పుడు వేద కోసం ఎదురు చూస్తూ ఉండగా ఇంతలో వేద అక్కడికి బాగా రెడీ అయ్యి అలాగే చూస్తూ ఉంటాడు.
 

77

అప్పుడు యష్, వేద వైపు చూస్తూఈ వేద రోజు చూసే వేద నేనా లేక వేరే వేదానా అనుకుంటూ బ్రమ పడుతూ ఉంటాడు. నేను చూసిన వేదనా నేను చూడని వేదనా అంటూ నవ్వుకుంటూ అలాగే చూస్తూ ఉంటాడు. అప్పుడు వేద వైపు యష్ అలాగే చూస్తూ ఉంటాడు. అప్పుడు కొత్తగా ఏంటి ఇలా అని అడగగా మా అమ్మమ్మ చాదస్తం పట్టుబట్టి ఇలా రెడీ చేసి పంపించింది అని అంటుంది వేద. అప్పుడు వాళ్లకు నచ్చినట్టు ఉండాలి లేదంటే వాళ్లకు మనసు నొచ్చుకుంటుంది అని అంటాడు యష్. నువ్వు చాలా బాగున్నావు వేద అని అంటాడు. తరువాత వాళ్ళిద్దరూ వాళ్ళ అమ్మమ్మ తాతయ్య వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Reshma Rathore: సినిమాలకు గుడ్‌ బై చెప్పి కోర్ట్ మెట్లు ఎక్కుతున్న టాలీవుడ్‌ హీరోయిన్‌.. డేరింగ్‌ స్టెప్‌
Recommended image2
Vijay Deverakonda: మందు, అమ్మాయి, బ్రేకప్‌ ఇప్పుడు పెళ్లి.. తన లైఫ్ సీక్రెట్స్ అన్నీ చెప్పేసిన రౌడీ బాయ్
Recommended image3
Raviteja Remuneration: ఇరుముడి మూవీకి రవితేజ పారితోషికం ఎంతో తెలుసా? చిరంజీవిని మించి.. టీమ్‌ ఫీజు వివరాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved