MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Priyamani: కత్తి లాంటి పరువాలతో ప్రియమణి డాషింగ్ లుక్స్.. నువ్వే నా లవ్ అంటూ మరో హీరోయిన్ కామెంట్స్

Priyamani: కత్తి లాంటి పరువాలతో ప్రియమణి డాషింగ్ లుక్స్.. నువ్వే నా లవ్ అంటూ మరో హీరోయిన్ కామెంట్స్

నటన, అభినయం, డ్యాన్స్, అందం ఇలా హీరోయిన్ కి కావలసిన అన్ని కళలు ఉన్న నటి ప్రియమణి.  వివాదాల జోలికి పోకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ వెళ్ళింది ప్రియమణి.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Aug 13 2022, 09:46 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

నటన, అభినయం, డ్యాన్స్, అందం ఇలా హీరోయిన్ కి కావలసిన అన్ని కళలు ఉన్న నటి ప్రియమణి.  వివాదాల జోలికి పోకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ వెళ్ళింది ప్రియమణి. టాలీవుడ్ లో ప్రియమణి ఎక్కువగా కమర్షియల్ చిత్రాల్లో గ్లామర్ రోల్స్ చేసింది. అందాలు ఆరబోసేందుకు కూడా వెనుకాడలేదు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
29

కెరీర్, పర్సనల్ లైఫ్ విషయంలో Priyamani ప్లానింగ్ తో వ్యవహరించింది. చకచకా సినిమాలు చేసేసింది. విజయవంతమైన చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. హీరోయిన్ గా అవకాశాలు తగ్గుతున్న సమయంలో వివాహం చేసేసుకుంది. 

39

సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా టివి రంగంలోకి అడుగు పెట్టింది. ఇలా ఎప్పటికప్పుడు ప్లానింగ్ చేసుకుంటూ ప్రియమణి ముందుకు సాగుతోంది. ప్రస్తుతం ప్రియమణి వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది.

49

Priyamani  ప్రస్తుతం టీవీ కార్యక్రమాలతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ప్రియమణి Dhee 14 షోలో జడ్జిగా వ్యవహరిస్తోంది. బుల్లితెర కార్యక్రమాల్లో ప్రియమణి చేసే హంగామా అంతా ఇంతా కాదు. అలాగే ప్రస్తుతం ప్రియమణికి వెబ్ సిరీస్ లు, సినిమాల్లోకూడా ఆఫర్స్ వస్తున్నాయి.

59

ప్రియమణి మంచి నటి మాత్రమే కాదు. అద్భుతమైన డాన్సర్ కూడా. ఎన్టీఆర్, నాగార్జున లాంటి స్టార్ హీరోల సరసన ప్రియమణి మాస్ స్టెప్పులతో అలరించింది. ఇక అవసరమైనప్పుడు వెండితెరని వేడెక్కించేలా అందాలు ఆరబోసింది. నితిన్ సరసన ద్రోణ చిత్రంలో నటించిన ప్రియమణి.. ఆ చిత్రంలో బికినీలో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఆ చిత్రంలో ప్రియమణి అందాల ఆరబోత ఒక హాట్ టాపిక్ గా నిలిచింది. 

69

ప్రియమణి తక్కువ సమయంలో ఎక్కువ చిత్రాల్లో నటించింది. యమదొంగ, హరే రామ్ వంటి విజయవంతమైన చిత్రాలు ప్రియమణి ఖాతాలో ఉన్నాయి. కొన్ని లేడి ఓరియెంటెడ్ చిత్రాల్లో కూడా ప్రియమణి నటించింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ప్రియమణి.. 38 ఏళ్ల వయసులో కూడా స్టన్నింగ్ ఫోజులతో మతిపోగొడుతోంది. 

79

తాజాగా ప్రియమణి.. మాధవన్ నటించిన రాకెట్రీ మూవీ సక్సెస్ సెలెబ్రేషన్స్ లో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఫోటో షూట్ నెట్టింట వైరల్ అవుతోంది. ట్రెండీగా అనిపించే బ్లాక్ డ్రెస్ లో ప్రియమణి గ్లామర్ మెరుపులు మెరిపిస్తోంది. స్టైలిష్ గా, హాట్ గా ప్రియమణి ఇస్తున్న ఫోజులు మెస్మరైజ్ చేస్తున్నాయి. 

89

ప్రియమణి హాట్ లుక్స్ కి మరో హీరోయిన్ విమలారామన్ ఫిదా అయింది. నువ్వే నా లవ్ అంటూ ప్రియమణిని ఉద్దేశించి కామెంట్ పెట్టింది. ఫ్యాన్స్ కూడా ప్రియమణి గ్లామర్ కి స్టన్ అవుతున్నారు.

 

99

ప్రియమణికి ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో పవర్ ఫుల్ రోల్స్ వస్తున్నాయి. Family man 2లో ప్రియమణి మనోజ్ బాజ్ పాయ్ భార్యగా నటించింది. అలాగే వెంకటేష్ సరసన Narappa చిత్రంలో నటించింది. ఈ రెండు చిత్రాల్లో ప్రియమణి పెర్ఫామెన్స్ కు మంచి స్పందన వచ్చింది. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
NTR CM: ఎన్టీఆర్‌ సీఎం అవడం పక్కా, ఆయన పార్టీలో చేరతాం.. దువ్వాడ శ్రీనివాస్‌, దివ్వెల మాధురి బోల్డ్ స్టేట్‌మెంట్‌
Recommended image2
Chiru-Venky: చిరంజీవి మూవీని కాపీ కొట్టి బ్లాక్‌ బస్టర్‌ అందుకున్న వెంకటేష్‌.. నిజాలు బయటపెట్టిన నిర్మాత
Recommended image3
Rashmika Mandanna: స్టేజ్‌పై ఆ పదం వాడిన రష్మిక, కృతికి ఫ్యూజులు ఔట్.. హీరో చేసిన పనికి నేషనల్‌ క్రష్‌ ఇబ్బంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved