- Home
- Entertainment
- `ఆదిపురుష్`, `రాధేశ్యామ్`లకు జరిగిన తప్పు రిపీట్ కాకుండా ప్రభాస్ ప్లాన్.. `సలార్`పై మౌనానికి కారణమదే?
`ఆదిపురుష్`, `రాధేశ్యామ్`లకు జరిగిన తప్పు రిపీట్ కాకుండా ప్రభాస్ ప్లాన్.. `సలార్`పై మౌనానికి కారణమదే?
డార్లింగ్ ప్రభాస్.. ప్రస్తుతం `సలార్` సినిమాతో వస్తున్నారు. ఇది మరో మూడు రోజుల్లో ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. ఈ సినిమా విషయంలో ప్రభాస్ రూట్ మార్చాడట. అందుకే సైలెంట్‌గా ఉంటున్నాడని సమాచారం.

ప్రభాస్ నటిస్తున్న `సలార్` చిత్రం పలు మార్లు వాయిదా పడి, ఎట్టకేలకు ఈ నెల 22న విడుదల కాబోతుంది. ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో ఈ మూవీని రిలీజ్ చేస్తున్నారు. `కేజీఎఫ్` తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తోన్న మూవీ కావడంతో దీనిపై అంచనాలున్నాయి. పైగా ఇటీవల విడుదలైన ట్రైలర్ మరింత అంచనాలను పెంచింది. ప్రభాస్, పృథ్వీరాజ్ ల మధ్య స్నేహం, యాక్షన్ సీన్లు గూస్‌బంమ్స్ తెప్పిస్తున్నాయి. ప్రభాస్‌ని ఎలా చూడాలని అభిమానులు అనుకుంటున్నారో, ఇందులో అలా కనిపించడంతో వారంతా హ్యాపీ.
`సలార్` సినిమాలో భారీ యాక్షన్ సీన్లుఉన్నాయని తెలుస్తుంది. దాదాపు ఐదు భారీ యాక్షన్ ఎపిసోడ్లు ఉండబోతున్నాయట. అవి నెక్ట్స్ లెవల్‌లో ఉంటాయని, ఇప్పటి వరకు ఇండియన్ సినిమాపై చూడలేనంతగా ఉంటాయని అంటున్నారు. ఇప్పటి వరకు వాడని గన్నులు, మిషన్ గన్నులు, కత్తులు, ఆయుధాలు ఇందులో ఉపయోగించబోతున్నారట. అదే ఫ్యాన్స్ ని ఊపేస్తుంది. ప్రభాస్ కటౌట్ రేంజ్ యాక్షన్ సీన్లు పూనకాలు తెప్పించేలా ఉంటాయని తెలుస్తుంది.
ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు ఓ పాట, గ్లింప్స్, రెండు ట్రైలర్లు వచ్చాయి. రేపు(బుధవారం) మరో పాటని విడుదల చేయబోతున్నారట. జస్ట్ ఇలా కంటెంట్‌తోనే జనాల్లోకి వెళ్లేందుకు ప్లాన్ చేస్తుంది యూనిట్. ఇటీవల ప్రభాస్, పృథ్వీరాజ్, ప్రశాంత్ నీల్‌తో రాజమౌళి ఓ కామన్ ఇంటర్వ్యూ చేశారు. ప్రభాస్ ప్రమోషన్స్ కంటెంట్ ఇదొక్కటే అని తెలుస్తుంది. అన్ని భాషల్లో ప్రెస్ మీట్లుగానీ, ఈవెంట్లు గానీ ఏవీ నిర్వహించబోవడం లేదట. ప్రభాస్ ప్రమోషన్స్ కి దూరంగా ఉంటున్నారట. ఆయనే కాదు, టీమ్ కూడా ఒకటి రెండు ఇంటర్వ్యూలు తప్ప పెద్దగా ప్రమోషన్స్ లో పాల్గొనడం లేదు.
ప్రభాస్ ఇతర సినిమా షూటింగ్‌ల్లో బిజీగా ఉండటం వల్ల ప్రమోషన్స్ కి టైమ్ లభించడం లేదని, ఖాళీ లేక ఆయన ప్రమోషన్స్ చేయడం లేదని అంటున్నారు. ప్రస్తుతం ప్రభాస్ `కల్కి`చిత్రంతోపాటు మారుతితోనూ సినిమా చేస్తున్నాడు. మొన్నటి వరకు `కల్కి` షూటింగ్‌లో పాల్గొన్నాడు ప్రభాస్. ఇప్పుడు మారుతి సినిమా సెట్‌లో ఉన్నాడు. ఆర్‌ఎఫ్‌సీలో ఇది చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ సినిమాలతో డార్లింగ్ బిజీగా ఉండటం వల్ల `సలార్`కి టైమ్ ఇవ్వలేకపోతున్నారని అంటున్నారు.
కానీ అసలు కారణం వేరే ఉందట. అదంతా ఓ పక్కా ప్లాన్ ప్రకారమే అని తెలుస్తుంది. ప్రభాస్.. `సాహో` నుంచి, `రాధేశ్యామ్`, `ఆదిపురుష్` వంటి చిత్రాలకు చాలా ప్రమోషన్స్ కార్యక్రమాలు నిర్వహించారు. ప్రభాస్ చాలా ఈవెంట్లలోనూ పాల్గొన్నారు. హైదరాబాద్, ముంబయి, చెన్నై, బెంగుళూరు వంటి ఏరియాల్లో ప్రమోషన్స్ చేశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్లు చేశారు. టీజర్, ట్రైలర్ ఈవెంట్లు చేశారు. చాలా ఈవెంట్లలో ప్రభాస్ పాల్గొన్నారు. ఆయా చిత్రాలకు గట్టి ప్రమోషన్స్ చేశారు. దీంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ ఫలితాలు బెడిసి కొట్టాయి. ఘోర పరాజయాలు చవిచూశాయి.
దీంతో ఇకపై ప్రమోషన్స్ తగ్గించాలని నిర్ణయించుకున్నారట. `సలార్` పై ఆ ప్రయోగం చేస్తున్నారట. కంటెంట్ ప్రధానంగానే ఆడియెన్స్ లోకి వెళ్లాలని అనుకుంటున్నారట. భారీ అంచనాలు ఏర్పడితే, వాటిని అందుకోకపోతే సినిమా బాగున్నా, డ్యామేజ్ బాగా జరుగుతుందని, అందుకే అంచనాలతో కాకుండా కంటెంట్‌తో ఆడియెన్స్ కి రీచ్ అయితే, తక్కువ అంచనాలతో ఆడియెన్స్ థియేటర్‌కి వెళితే, దాన్ని మించిన ఔట్‌పుట్ బాగుందనిపిస్తే అది సినిమా ఫలితాన్ని మార్చేస్తుంది. ఇదే స్ట్రాటజీని `సలార్` టీమ్ ఫాలో అవుతుందట.
అందుకే ప్రమోషన్స్ తగ్గించినట్టు తెలుస్తుంది. ప్రభాస్ లాంటి స్టార్ నుంచి సినిమా అంటే ఆల్‌రెడ్డి అందరికి తెలిసే ఉంటుంది, ఆ మాత్రం సరిపోతుందని టీమ్ భావిస్తుందట. పైగా సోషల్ మీడియా బాగా ప్రభావితం చేస్తున్న నేపథ్యంలో అదే ఆడియెన్స్ లోకి సినిమాని తీసుకెళ్తుందని, అందుకోసం ప్రత్యేకంగా శ్రమ పడాల్సిన అవసరం లేదని ప్రభాస్ టీమ్ భావిస్తున్నట్టు సమాచారం. మరి ఈ ప్లాన్ ఎంత వరకు వర్కౌట్ అవుతుంది?, సినిమాకి ఎంత హెల్ప్ అవుతుందో చూడాలి.