MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Automobile
  • Bikes
  • Top 5 Best Mileage Bikes: రూ. 60 వేల బడ్జెట్‌లో లీటరుకు 75 కి.మీ మైలేజ్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే

Top 5 Best Mileage Bikes: రూ. 60 వేల బడ్జెట్‌లో లీటరుకు 75 కి.మీ మైలేజ్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే

Top 5 Best Mileage Bikes: తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైకులు మార్కెట్ లో ఉన్నాయి. అదిరిపోయే మైలేజ్ ఇచ్చే బెస్ట్ 5 బైక్స్ వివరాలు, ధరలు, మైలేజ్ కెపాసిటీ సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Sep 06 2026, 12:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
బడ్జెట్ ధరలో మైలేజ్ ధమాకా: రూ. 60,000 నుండి 80,000 లోపు టాప్ 5 బైక్స్ ఇవే
Image Credit : chatgpt

బడ్జెట్ ధరలో మైలేజ్ ధమాకా: రూ. 60,000 నుండి 80,000 లోపు టాప్ 5 బైక్స్ ఇవే

భారతీయ ద్విచక్ర వాహన మార్కెట్‌లో నిత్యం ప్రయాణాలు చేసే వారికి మొదటి ప్రాధాన్యం ఎప్పుడూ మైలేజ్, తక్కువ మెయింటనెన్స్ ఖర్చులకే ఉంటుంది. పెరిగిన చమురు ధరల నేపథ్యంలో ప్రతి నెలా పెట్రోల్ బిల్లును తగ్గించుకోవాలని అందరూ భావిస్తారు. ముఖ్యంగా రూ. 60,000 నుండి రూ. 80,000 బడ్జెట్ సెగ్మెంట్‌లో లభించే 100cc నుండి 110cc బైక్‌లు రోజువారీ వాడకానికి అత్యంత అనుకూలమైనవి. రియల్ వరల్డ్ కండిషన్లలో లీటరుకు దాదాపు 75 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇచ్చే టాప్ 5 బైక్‌ల వివరాలు ఇక్కడ చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
1. టీవీఎస్ స్పోర్ట్
Image Credit : stockPhoto

1. టీవీఎస్ స్పోర్ట్

బడ్జెట్‌లో లభించే అత్యంత తక్కువ ధర కలిగిన బైక్‌లలో టీవీఎస్ స్పోర్ట్ (TVS Sport) ఒకటి. ఇది 109.7 cc ET-Fi ఇంజిన్‌తో వస్తుంది. వివిధ ప్రాంతాలను బట్టి ఎక్స్ షోరూమ్ ధర: రూ. 59,431 నుంచి రూ. 70,200 వరకు ఉంటుంది. మైలేజ్ లీటరుకు 70–75 కిలోమీటర్ల వరకు అందిస్తుంది. సిటీ ట్రాఫిక్‌లో సులభంగా రైడ్ చేయడానికి ఇది మంచి లో-ఎండ్ టార్క్‌ను అందిస్తుంది. ఈజీగా ఉంటే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, సౌకర్యవంతమైన సీటింగ్ దీని ప్లస్ పాయింట్లు.

37
2. హీరో స్ప్లెండర్ ప్లస్ / ఎక్స్‌టెక్
Image Credit : stockPhoto

2. హీరో స్ప్లెండర్ ప్లస్ / ఎక్స్‌టెక్

భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న బైక్ బ్రాండ్ హీరో స్ప్లెండర్. విశ్వసనీయతకు, రీసేల్ విలువకు ఇది కేరాఫ్ అడ్రస్. వివిధ ప్రాంతాలను బట్టి ఈ బైక్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 75,141 నుంచి రూ. 79,991 వరకు ఉంటుంది. మైలేజ్ లీటరుకు 70–80 కిలోమీటర్లు వరకు అందిస్తుంది. ఇందులో హీరోకి చెందిన i3S టెక్నాలజీ సిస్టమ్ ఉంది. ఇది ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర పెట్రోల్‌ను ఆదా చేస్తుంది. XTEC వేరియంట్‌లో డిజిటల్ డిస్ప్లే, బ్లూటూత్ కనెక్టివిటీ, యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్ కూడా లభిస్తాయి.

47
3. బజాజ్ ప్లాటినా 100 / ప్లాటినా 110
Image Credit : stockPhoto

3. బజాజ్ ప్లాటినా 100 / ప్లాటినా 110

రైడింగ్ సౌకర్యానికి ప్లాటినా సిరీస్ బాగా ప్రసిద్ధి చెందింది. ఇందులో ఉన్న కంఫోర్టెక్ సస్పెన్షన్ గుంతల రోడ్లపై కూడా సున్నితమైన ప్రయాణాన్ని అందిస్తుంది. వివిధ ప్రాంతాలను బట్టి ఈ బైక్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 67,808 నుంచి రూ. 75,797 వరకు వుంటుంది. మైలేజ్ లీటరుకు 70–75 కిలోమీటర్లు అందిస్తుంది. ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు, సాఫ్ట్ సీట్ కుషన్, వెడల్పాటి ఫుట్‌రెస్ట్‌లు ఉన్నాయి. 110cc మోడల్‌లో మెరుగైన సేఫ్టీ కోసం ఏబీఎస్ ఆప్షన్ కూడా లభిస్తుంది.

57
4. హోండా షైన్ 100
Image Credit : Honda

4. హోండా షైన్ 100

స్ప్లెండర్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకు హోండా తన నమ్మకమైన షైన్ బ్రాండ్‌ను 100cc సెగ్మెంట్‌లో లాంచ్ చేసింది. వివిధ ప్రాంతాలను బట్టి ఈ బైక్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 64,900 నుంచి రూ. 65,996 వరకు వుంటుంది. మైలేజ్ లీటరుకు 65–75 కిలోమీటర్లు అందిస్తుంది. ఇది లైట్‌వెయిట్ ఫ్రేమ్‌తో వస్తుంది. eSP టెక్నాలజీ వల్ల సైలెంట్ స్టార్ట్, విజిబుల్ వైబ్రేషన్స్ లేని స్మూత్ రైడింగ్ అనుభూతి లభిస్తుంది. నిర్వహణ ఖర్చులు చాలా తక్కువగా ఉంటాయి.

67
5. హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్
Image Credit : Hero

5. హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్

స్ప్లెండర్ కంటే కాస్త తక్కువ ధరకు అదే నమ్మకమైన ఇంజిన్ కావాలోనుకునే వారికి హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ (Hero HF Deluxe) సరైన ఎంపిక అని చెప్పవచ్చు. వివిధ ప్రాంతాలను బట్టి ఈ బైక్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 59,998 నుంచి రూ. 68,500 వరకు ఉంటుంది. మైలేజ్ లీటరుకు 65–70 కిలోమీటర్లు ఇస్తుంది. ఇందులో సరైన ఎయిర్ ఫ్యూయల్ మిశ్రమం కోసం xSens ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ ఉపయోగించారు. దీని స్పేర్ పార్ట్స్ మార్కెట్‌లో చాలా సులభంగా లభిస్తాయి.

77
మీ అవసరానికి తగ్గట్టు ఏ బైక్ సరిపోతుంది?
Image Credit : gemini

మీ అవసరానికి తగ్గట్టు ఏ బైక్ సరిపోతుంది?

అధిక మైలేజ్, రీసేల్ వాల్యూ: హీరో స్ప్లెండర్ ప్లస్

గుంతల రోడ్లపై బెస్ట్ కంఫర్ట్: బజాజ్ ప్లాటినా

అత్యంత తక్కువ ప్రారంభ ధర: టీవీఎస్ స్పోర్ట్

స్మూత్ ఇంజిన్ పెర్ఫార్మెన్స్: హోండా షైన్ 100

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆటోమొబైల్
భారతీయ ఆటోమొబైల్
వ్యాపారం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Honda QC3: హోండా నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. 145 కి.మీల మైలేజ్‌, క‌ళ్లు చెదిరే ఫీచ‌ర్లు
Recommended image2
Simple Wave EV: 243 కిలో మీటర్ల మైలేజ్.. సింపుల్‌ ఎనర్జీ నుంచి అదిరిపోయే స్కూటర్ వచ్చేసింది !
Recommended image3
రివ‌ర్స్ మోడ్‌, ఈజీ పార్క్‌.. అత్యాధునిక ఫీచ‌ర్ల‌తో ఓలా నుంచి కొత్త‌ ఎల‌క్ట్రిక్ స్కూటీ
Related Stories
Recommended image1
Miss World 2026: మిస్ వరల్డ్‌గా జోహెయిర్రీ మోలా.. ఈమె బ్యాక్‌గ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !
Recommended image2
Student Scholarship: విద్యార్థులకు బంపర్ ఆఫర్.. ఏడాదికి రూ. 12,000 స్కాలర్‌షిప్, అప్లై పూర్తి వివరాలు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved