MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • Janaki kalaganaledu: అన్నయ్యకు రాఖీ కట్టిన జానకి.. మళ్లీ నీచపు బుద్ది చూపించిన మల్లిక!

Janaki kalaganaledu: అన్నయ్యకు రాఖీ కట్టిన జానకి.. మళ్లీ నీచపు బుద్ది చూపించిన మల్లిక!

Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ తెలుగు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఐపీఎస్ కలను నిజం చేసుకునేందుకు అత్తవారింట్లో జానకి పడే కష్టాలే ఈ సీరియల్ కాన్సెప్ట్. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు ఆగస్ట్ 18వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో తెలుసుకుందాం... 

2 Min read
Author : Navya G
Published : Aug 18 2022, 01:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... జ్ఞానాంబ జానకి వాళ్ళ అన్నయ్యకి రాఖీ కట్టమని చెబుతుంది. అప్పుడు జానకి వాళ్ళ అన్నయ్యకి రాఖీ కడుతుంది. నన్ను క్షమించు జాను నాకు నువ్వు ఒక్కదానివే చెల్లివి కదా ఈ అన్నయ్యని క్షమించలేవా అని అంటాడు. అప్పుడు జానకి వాళ్ళ అన్నయ్య దగ్గర ఆశీర్వాదాలు తీసుకుంటుంది తర్వాత వాళ్ళ అన్నయ్య వెళ్ళిపోతాడు.మల్లిక మాత్రం నేను ఇదంతా తట్టుకోలేకపోతున్నాను పెద్ద కోడలు మళ్లీ మంచి మార్కులు కొట్టేస్తుంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఈరోజు ఏదైనా పెంట పెట్టాలి జానకికి ఇచ్చిన ఐదు అవకాశాల్లో ఈరోజు ఎలాగైనా ఒకటి కొట్టేలా చేయాలి ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు జ్ఞనాంబ జానకిని నైవేద్యంగా పొంగలి చేసి అమ్మవారికి సమర్పించమని చెప్తుంది. అప్పుడు జానకి పొంగలి చేయడానికి వెళుతుంది. ఈ సమయంలోనే నేను ఏవైనా పెంట పట్టాలి అని అనుకుంటుంది మల్లిక.ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉండగా అత్తయ్య గారు మా ఊరు ఆవిడ ఎవరో నాకు కనిపించారు నేను ఒకసారి వెళ్లి పలకరించి వస్తాను అని అక్కడి నుంచి తప్పించుకుంటుంది.
 

36

మల్లిక కంగారులో పరిగెడుతూ ఉండగా ఒక తల్లి తన బిడ్డకు పాలు డబ్బాతో పాలిస్తున్నప్పుడు ఆ పాలు డబ్బాని కిందకి గుద్దేస్తుంది మల్లిక. కనీసం క్షమాపణ కూడా చెప్పకుండా అక్కడి నుంచి పారిపోతుంది. అప్పుడు ఆ తల్లి బిడ్డకు ఎలా పాలు ఇవ్వాలి అని అందరిని పాలు కోసం అడుగుతూ ఉంటుంది. ఈ లోగ జానకి అక్కడ పొంగలి చేస్తుంది. మల్లిక, జానకి దగ్గరికి వెళ్లి ఒక చాటున జానకి నీ చూస్తూ ఏం చేస్తే అత్తయ్య ఆ అవకాశాన్ని కొట్టేస్తారు అని ఆలోచిస్తూ ఉండగా అక్కడికి ఆ తల్లి వచ్చి పాలు కోసం అడుగుతుంది.
 

46

మిగిలిన వాళ్ళందరూ ఇది దేవుడికి నైవేద్యం పెట్టవలసిన పాలు మీకు ఇస్తే ఎంగిలిపాలవుతుంది అని అంటారు.జానకి మాత్రం తన పొంగలి కోసం చేసిన పాలులో కొంచెం ఆ బిడ్డకు ఇస్తుంది అప్పుడు ఆ తల్లి మీకు రుణపడి ఉంటాను అమ్మా అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మల్లికకు ఇదే దొరికింది అవకాశం అని చెప్పి ఈ సంగతి అత్తయ్య కు చెప్తే కచ్చితంగా జానకిని తిట్టి ఆ గోడ మీద ఉన్న ఒక అవకాశాన్ని చెరిపేస్తారు అని అనుకుంటుంది.
 

56

తర్వాత జానకి పొంగలి అంతా చేసి దేవుడి దగ్గరికి పెడుతున్న సమయంలో మల్లిక అందరి ముందు జానకి ఆ పాలుని ఎంగిలి చేసింది ఒక ఆవిడకి ఇచ్చింది అని అనగా జానకి, ఆ బిడ్డ చాలా సేపు నుంచి ఏడుస్తుంది అత్తయ్య గారు చాలా ఆకలితో ఉందని పాలు ఇచ్చాను అని అంటుంది జానకి .అప్పుడు జ్ఞానాంబ నీ ఆలోచన మంచిదే కానీ దేవుడు పాలులోని ఎంగిలి చేస్తే మన కుటుంబానికి మంచిది కాదు అని అంటుంది. ఈ లోగ మల్లిక  ఇప్పుడు జానకి తప్పు చేసింది అత్తయ్య గారు.
 

66

గోడ మీద ఉన్న ఒక అవకాశాన్ని చెరిపేయండి అని అనేలోగా ఆ తల్లి తన బిడ్డతో అక్కడికి వచ్చి పాలు లేని సమయంలో మీ కోడలు నా దగ్గరికి వచ్చి పాలు ఇచ్చింది తనకి నేను రుణపడి ఉంటాను అని చెప్పి జానకిని ఆశీర్వదిస్తుంది. అప్పుడు మల్లిక వేపు చూపిస్తూ ఈవిడ నా పాలన కింద పడేలా చేసింది అని అంటుంది.అప్పుడు జ్ఞానాంబ ఇంటికి వెళ్లని నీ పని చెప్తాను అని మల్లికను తిడుతుంది.ఈలోగా పంతులుగారు, పసిప్రాణానికి పాలు ఇవ్వడం మంచిదే. ఆ దేవుడు మీకు ఎప్పుడూ తోడుగా ఉంటారు అని అంటారు. తర్వాత అక్కడ పూజ అంతా జరుగుతూ ఉంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాత భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Samarasimha Reddy Review: చిరంజీవికి ఎంతో ఇష్టమైన బాలకృష్ణ సినిమా, 365 రోజులు ఆడిన ట్రెండ్ సెట్టర్, సమరసింహా రెడ్డి రివ్యూ
Recommended image2
Chiranjeevi Stunts: దున్నపోతుల మధ్యలో రియల్ స్టంట్స్, రెడీగా అంబులెన్స్.. స్నేహితుల కోసం తెగించిన చిరంజీవి
Recommended image3
Upcoming Movies: రజనీతో అజిత్ పోటీ, సూర్య హ్యాట్రిక్ కొడతాడా?.. వచ్చే 4 నెలల్లో రాబోతున్న భారీ చిత్రాలివే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved