MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • మహేష్‌ బాబు సినిమా వెయ్యి కోట్లు కాదు, అసలు బడ్టెట్‌ తెలిస్తే మైండ్‌ బ్లాకే.. రాజమౌళి ధైర్యం ఇదే?

మహేష్‌ బాబు సినిమా వెయ్యి కోట్లు కాదు, అసలు బడ్టెట్‌ తెలిస్తే మైండ్‌ బ్లాకే.. రాజమౌళి ధైర్యం ఇదే?

మహేష్‌ బాబుతో రాజమౌళి తీయబోయే సినిమాకి సంబంధించిన పిచ్చెక్కించే అప్‌ డేట్‌ బయటకు వచ్చింది. బడ్జెట్‌, రాజమౌళి ప్లాన్‌ మతిపోగొట్టేలా ఉంది.  

3 Min read
Author : Aithagoni Raju
Published : Dec 02 2024, 07:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

తెలుగు ఆడియెన్స్ ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్న ప్రాజెక్ట్ మహేష్‌ బాబుతో రాజమౌళి చేసే మూవీ(SSMB29). దీని కోసం ఇండియన్‌ ఆడియెన్స్ కూడా ఆసక్తికరంగా ఉన్నారు. రాజమౌళి నెక్ట్స్ మూవీ ఎలా ఉండబోతుందనే క్యూరియాసిటీ వారిలో ఉంది.

ఈ నేపథ్యంలో ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ ఏడాదికి పైగానే జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే రెండేళ్లుగా కథపై వర్క్ చేస్తున్నారు రైటర్‌ విజయేంద్రప్రసాద్‌. మరి సినిమా ఎప్పుడు ప్రారంభం కాబోతుందనేది అందరిలోనూ నెలకొన్న ప్రశ్న, క్యూరియాసిటీ. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

పలు ఈవెంట్లలో విజయేంద్రప్రసాద్‌ చెబుతూ వచ్చే ఏడాది ప్రారంభం అవుతున్నారు. 2025 ప్రారంభంలో దీన్ని స్టార్ట్ చేయబోతున్నారని తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ఏం జరుగుతుందనేది ఇంకా క్లారిటీ లేదు. స్క్రిప్ట్ ఫైనల్‌ అయ్యిందా? క్యాస్టింగ్‌ ఎంపిక జరుగుతుందా ? అనేది సస్పెన్స్ గా మారింది.

దీనికి సంబంధించి ఎలాంటి అప్‌డేట్స్, లీకేజీలు కూడా బయటకు రానివ్వం లేదు. చాలా స్ట్రిక్ట్ గా దీన్ని ఫాలో అవుతున్నారు. స్క్రిప్ట్ ని ఫైనల్‌ చేయడంతోపాటు కాస్టింగ్‌, టెక్నీషియన్లు, లొకేషన్స్, కాస్ట్యూమ్స్ వంటివాటిపై వర్క్ చేస్తున్నట్టు తెలుస్తుంది. 
 

36

ఈ సినిమా ఇంటర్నేషనల్‌ యాక్షన్‌ అడ్వెంచర్‌గా ఉండబోతుందని తెలుస్తుంది. `ఇండియానా జోన్స్` సినిమాలంటే తనకు ఇష్టమని, ఆ బ్యాక్‌ డ్రాప్‌లోనే ఓ ఫారెస్ట్ బేస్డ్ యాక్షన్‌ అడ్వెంచర్‌ని తీయాలని రాజమౌళి ప్లాన్‌ చేస్తున్నారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని తెలిపారు.

మహేష్‌ బాబు అంతర్జాతీయ సాహసికుడిగా కనిపిస్తాడని, మాస్‌, రా, రస్టిక్‌గా ఆయన పాత్ర ఉండబోతుందని తెలుస్తుంది. ఆ పాత్ర కోసం జుట్టు, గెడ్డం పెంచి కొత్త లుక్‌లో కనిపిస్తున్నాడు మహేష్‌. తన లుక్‌తోనే ఫ్యాన్స్ కి గూస్‌బంమ్స్ తెప్పిస్తున్నారు. రియల్‌ లుక్‌లోనే ఇలా ఉంటే అదే సినిమాలో పాత్ర లుక్‌లో కనిపిస్తే ఇక పూనకాలే అని చెప్పొచ్చు. 

46

ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించిన ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. ప్రధానంగా సినిమా బడ్జెట్‌ గురించి సరికొత్త చర్చ ప్రారంభమైంది. ఈ మూవీకి బడ్జెట్‌ వెయ్యి కోట్ల వరకు అవుతుందనే టాక్‌ వినిపిస్తుంది. వెయ్యి కోట్లు అవుతుందా? అని ఆశ్చర్యపోతున్నారు ఆడియెన్స్.

అయితే లేటెస్ట్ గా తెలుస్తున్న సమాచారం మేరకు ఈ మూవీ బడ్జెట్‌ వెయ్యి కోట్లు కాదు దాన్ని మించి అవుతుందట. ఈజీగా 1200-1300కోట్లు అయ్యే అవకాశం ఉందట. ఈ విషయాన్ని సీనియర్‌ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తెలిపారు. రాజమౌళి ప్లాన్‌ ప్రకారం తీస్తే ఈ సినిమా ఈజీగా 12, 13వందల కోట్లు అవుతుందన్నారు. 
 

56

మరి ఇంత బడ్జెట్‌ పెట్టి రికవరీ ఎలా అనే సందేహం ఉంటుంది. అయితే దానికి రాజమౌళి వద్ద ప్లాన్‌ ఉందట. ఓ సందర్భంలో కూడా ఆయన చెప్పారు. ప్రస్తుతం సినిమాని దేశంలో ఒకటి రెండు శాతం ఆడియెన్స్ మాత్రమే చూస్తున్నారు. సినిమాని ఆడియెన్స్‌ దగ్గరికి తీసుకెళ్లాలని, సినిమా చూసే ఆడియెన్స్ పర్సెంటేజ్‌ని పెంచాలని ఆయన తెలిపారు.

`బాహుబలి 2` సినిమా 1800కోట్లు వసూలు చేసింది. దీన్ని 1, 2 శాతం ఆడియెన్స్ మాత్రమే చూశారట. అలాంటిది నాలుగైదు శాతానికి పెంచితే ఈజీగా మూడు, నాలుగు వేల కోట్లు వసూలు చేసే సత్తా ఇండియాలో ఉందనేది రాజమౌళి అభిప్రాయం. ఆ దిశగానే ప్రమోషన్స్ ప్లాన్‌ కూడా ఉందట. 

66

అంతేకాదు అంతర్జాతీయంగానూ సినిమా రీచ్‌ని పెంచాలనుకుంటున్నారట. సుమారు యాభై భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీని విడుదల చేయాలనే యోచనలో ఉన్నారట. ప్రముఖంగా తెలుగు వారు, ఇండియన్‌ ఆడియెన్స్ ఉన్న అన్ని దేశాల్లోనూ దీన్ని విడుదల చేయాలనుకుంటున్నారట.

అంతేకాదు దీన్నొక అంతర్జాతీయ ప్రాజెక్ట్ గానే ప్రారంభం నుంచి ప్రమోట్‌ చేయబోతున్నారట. దీంతో ఇతర దేశాల ఆడియెన్స్ కూడా ఈ సినిమాని చూసేలా చేయాలనేది రాజమౌళి ప్లాన్‌. ఆ ధైర్యంతోనే బడ్జెట్‌ విషయంలో రాజీపడటం లేదని టాక్‌. మరి ఇది ఎంత వరకు సాధ్యమవుతుంది? అనేది మున్ముందు తేలనుంది. 

read more:కండక్టర్‌ కాక ముందు రజనీకాంత్‌ ఏం చేశాడో తెలుసా? చివరికి అలాంటి పనా? అస్సలు ఊహించుకోలేం

also read: సిల్క్ స్మితకి కొడుకు ఉన్నాడా? ఆమె చెప్పిన బాబు ఎవరు? సూసైడ్‌ నోట్‌లో ఏం రాసిందో తెలుసా?
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Arasan Update: వెట్రిమారన్ పుట్టినరోజున 'అరసన్'పై బాంబ్ పేల్చిన శింబు.. అభిమానులకు షాక్
Recommended image2
Nagarjuna: అన్నపూర్ణ స్టూడియోస్ చేతిలో క్రేజీ సినిమాలు, ఇది నాగ్ ప్లాన్ కాదు.. ఆ మాస్టర్ మైండ్ ఎవరో తెలుసా
Recommended image3
NTR: తల్లిదండ్రుల కోసం ఎన్టీఆర్ చేసిన త్యాగం ఏంటో తెలుసా, అందుకే బాలయ్యకి అంత ఇష్టం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved