MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Nagarjuna: అన్నపూర్ణ స్టూడియోస్ చేతిలో క్రేజీ సినిమాలు, ఇది నాగ్ ప్లాన్ కాదు.. ఆ మాస్టర్ మైండ్ ఎవరో తెలుసా

Nagarjuna: అన్నపూర్ణ స్టూడియోస్ చేతిలో క్రేజీ సినిమాలు, ఇది నాగ్ ప్లాన్ కాదు.. ఆ మాస్టర్ మైండ్ ఎవరో తెలుసా

విభిన్న భాషల చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు చేరువ చేస్తూ అన్నపూర్ణ స్టూడియోస్ పంపిణీ రంగంలో విస్తరిస్తోంది. సెప్టెంబర్‌లో ఐ యామ్ గేమ్, సర్దార్ 2, ఎపిక్ సహా పలు చిత్రాలు లైనప్‌లో ఉన్నాయి.

2 Min read
Author : Tirumala Dornala
Published : Sep 04 2026, 06:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అన్నపూర్ణ స్టూడియోస్
Image Credit : Asianet News

అన్నపూర్ణ స్టూడియోస్

సినిమా పంపిణీ రంగంలో అన్నపూర్ణ స్టూడియోస్ తన కార్యకలాపాలను క్రమంగా విస్తరిస్తోంది. వివిధ భాషలకు చెందిన విభిన్నమైన చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు చేరువ చేయడంపై సంస్థ ప్రత్యేక దృష్టి పెట్టింది. కథ, కంటెంట్‌కు ప్రాధాన్యం ఉన్న సినిమాలకు విస్తృత థియేట్రికల్ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో అన్నపూర్ణ స్టూడియోస్ తన డిస్ట్రిబ్యూషన్ పోర్ట్‌ఫోలియోను మరింత బలోపేతం చేస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఇప్పటికే పలు భాషల చిత్రాల పంపిణీ
Image Credit : youtube

ఇప్పటికే పలు భాషల చిత్రాల పంపిణీ

అన్నపూర్ణ స్టూడియోస్ ఇప్పటికే పలు చిత్రాల పంపిణీ ద్వారా తన ఉనికిని విస్తరించింది. మలయాళ చిత్రాలు ఎకో, బాలన్ ది బాయ్‌తో పాటు సూర్య నటించిన తమిళ చిత్రం కరుప్పును తెలుగు ప్రేక్షకులకు వీరభద్రుడు పేరుతో విడుదల చేసింది. అలాగే నాగార్జున తనయుడు అఖిల్ నటించిన లెనిన్ చిత్రాన్ని నిర్మించి రిలీజ్ చేశారు. విభిన్నమైన సినిమాలను ఆదరిస్తూ వాటికి మరింత విస్తృత థియేట్రికల్ రీచ్ కల్పించాలనే అన్నపూర్ణ స్టూడియోస్ ప్రయత్నాన్ని ఈ కార్యక్రమాలు ప్రతిబింబిస్తున్నాయి.

35
సెప్టెంబర్‌లో భారీ చిత్రాల లైనప్
Image Credit : Asianet News

సెప్టెంబర్‌లో భారీ చిత్రాల లైనప్

సెప్టెంబర్ నెలకు అన్నపూర్ణ స్టూడియోస్ ఆసక్తికరమైన చిత్రాల లైనప్‌ను సిద్ధం చేసింది. దుల్కర్ సల్మాన్ నటిస్తున్న ఐ యామ్ గేమ్, కార్తీ నటించిన సర్దార్ 2, ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ చిత్రాలు సంస్థ సెప్టెంబర్ విడుదలల జాబితాలో ఉన్నాయి. వీటిలో ఐయామ్ గేమ్, రంభ ఊర్వశి మేనకా ఆల్రెడీ రిలీజ్అయ్యాయి. ఈ చిత్రంలో అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణంతో పాటు పంపిణీ బాధ్యతల్లోనూ భాగస్వామ్యం అవుతోంది.

45
మంచి సినిమాలకు ప్రాధాన్యం
Image Credit : Sony Music South

మంచి సినిమాలకు ప్రాధాన్యం

అన్నపూర్ణ స్టూడియోస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుప్రియ యార్లగడ్డ మాట్లాడుతూ తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ సినిమాలను ఎంతో అభిమానించే వారని, భాషతో సంబంధం లేకుండా మంచి సినిమాలను ఆదరిస్తారని తెలిపారు. ప్రేక్షకులకు కంటెంట్ కనెక్ట్ అయినప్పుడు సినిమాకు భాషాపరమైన అడ్డంకులు ఉండవని పేర్కొన్నారు. తాము నిజంగా పెద్ద తెరపై చూడదగినవిగా భావించే చిత్రాలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా ప్రేక్షకులకు అందించాలనేదే తమ పంపిణీ కార్యక్రమం లక్ష్యమని ఆమె వివరించారు. అదే సమయంలో పారదర్శకమైన, స్థిరమైన పంపిణీ వ్యవస్థను నిర్మించడంపై కూడా దృష్టి పెట్టినట్లు తెలిపారు.

55
కమిషన్ ఆధారిత పంపిణీ
Image Credit : Asianet News

కమిషన్ ఆధారిత పంపిణీ

అన్నపూర్ణ స్టూడియోస్ విస్తరిస్తున్న పంపిణీ నెట్‌వర్క్ సంస్థ దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగా కొనసాగుతోంది. కమిషన్ ఆధారిత పంపిణీ విధానాన్ని తిరిగి బలోపేతం చేయడంతో పాటు కథకు ప్రాధాన్యం ఉన్న చిత్రాలకు మరింత మెరుగైన థియేట్రికల్ అవకాశాలు కల్పించాలన్నది సంస్థ లక్ష్యం. వివిధ భాషల నుంచి మంచి కంటెంట్ ఉన్న సినిమాలను తెలుగు మార్కెట్‌కు తీసుకురావడంతో పాటు, పారదర్శకమైన పంపిణీ వ్యవస్థను అభివృద్ధి చేయాలనే పెద్ద లక్ష్యంలో భాగంగానే అన్నపూర్ణ స్టూడియోస్ ఈ విస్తరణను కొనసాగిస్తోంది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
సుడిగాలి సుధీర్‌కు నిశ్చితార్థం జరిగినా.. పెళ్లి మాత్రం ఎందుకు ఆగిపోయింది?
Recommended image2
Crazy Kalyanam Day 1 Collections: టీ ఖర్చులు కూడా రాలేదు.. జైలర్‌ 2కి, రణబాలికి మధ్య నలిగిన క్రేజీ కళ్యాణం
Recommended image3
Jailer 2 Collections: డబుల్ సెంచరీ కొట్టిన జైలర్ 2 .. రజినీకాంత్ సినిమా రెండో రోజు వసూళ్లు ఇవే!
Related Stories
Recommended image1
NTR: తల్లిదండ్రుల కోసం ఎన్టీఆర్ చేసిన త్యాగం ఏంటో తెలుసా, అందుకే బాలయ్యకి అంత ఇష్టం
Recommended image2
Chiranjeevi: సైన్ చేయక ముందే సూపర్ హిట్ అని చెప్పిన చిరంజీవి తల్లి..ఆయన బాడీ ఏంటి, జనాలంతా అదే మాట
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved