సిల్క్ స్మితకి కొడుకు ఉన్నాడా? ఆమె చెప్పిన బాబు ఎవరు? సూసైడ్ నోట్‌లో ఏం రాసిందో తెలుసా?
బోల్డ్ స్టార్ సిల్క్ స్మిత సూసైడ్ నోట్లో రాసిన విషయాలు దుమారం రేపుతున్నాయి. మరి ఇందులో ఆమె ఏం చేసిందో తెలుసా? ఆమెకి కొడుకు ఉన్నాడా?
Silk Smitha
సిల్క్ స్మిత ఈ తరానికి తెలియకుపోవచ్చు, కానీ ఇప్పుడు 40 ప్లస్ ఉన్న వాళ్లందరికి సిల్క్ స్మిత ఏంటో తెలుసు. సినిమాలంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరికి ఆమె ఇచ్చే కిక్ ఏంటో తెలుసు. బోల్డ్ రోల్స్ తో, వేశ్య తరహా పాత్రలతో సౌత్ సినిమా ఇండస్ట్రీని ఊపేసింది సిల్క్ స్మిత. స్టార్ హీరోలక మించిన క్రేజ్‌తో రాణించిన ఆమె చిన్న వయసులోనే ఆత్మహత్య చేసుకుని కన్నుమూసింది. అయితే ఆమె మరణం మాత్రం మిస్టరీగానే మిగిలింది.
ఆమె సూసైడ్ చేసుకుందని పోలీసులు ధృవీకరించారు. అయితే ఆమె చనిపోవడానికి ముందు ఓ సూసైడ్ నోట్ రాసింది. అందులో తన బాధని, ఆవేదనని వెల్లడించింది. తాను మోసపోయిన విషయాన్ని బయటపెట్టింది. అందరూ తనని వాడుకుని మోసం చేశారని తెలిపింది. అన్ని రకాలుగా తాను మోసపోయినట్టు చెప్పింది. అయితే బాబు ఒక్కడే ఏ స్వార్థం లేకుండా ఉన్నాడని తెలిపింది సిల్మ్ స్మిత. మరి ఆ బాబు ఎవరు? సూసైడ్ నోట్‌లో అసలు సిల్క్ స్మిత ఏం రాసిందనేది చూస్తే.
`ఓ అభాగ్యురాలు` అంటూ స్టార్ట్ చేసింది. దేవుడా నా 7వ సంవత్సరం నుంచే పొట్ట కూటి కోసం ఎంతో కష్టపడ్డాను. నాకు నావారు అంటూ ఎవరు లేరు. నేను నమ్మినవారు నన్ను మోసం చేశారు. బాబు తప్ప నా మీద ఎవరికీ ప్రేమ లేదు. కేవలం బాబు తప్ప అందరూ నా కష్టం తిన్నవారే. నా సొమ్ము తిన్నవారే నాకు మనశ్శాంతి లేకుండా చేశారు. అందరికీ మంచే చేశాను. కానీ నాకు చెడు జరిగింది. నా ఆస్తిలో ఉన్నదంతా బాబు కుటుంబానికి నా కుటుంబానికి పంచాలి. నా ఆశలన్నీ ఒకరిమీదే పెట్టుకున్నాను. అతను నన్ను మోసం చేసాడు. దేవుడు ఉంటే వాడిని చూసుకుంటాడు. రోజూ టార్చర్‌ని నేను భరించలేను.
రాము.. రాధకృష్ణన్ నన్ను చాలా రెచ్చగొట్టారు. వారికి ఎంతో మేలు చేశాను. కానీ వారు నాకు దారుణం చేశారు. 5 సంవత్సరాల క్రితం ఓ వ్యక్తి నాకు జీవితం ఇస్తానన్నాడు. ఇప్పుడు ఇవ్వడం లేదు. నా రెక్కల కష్టం తినని వాడు లేడు బాబు తప్ప. ఇది రాయడానికి నేను ఎంత నరకం అనుభవించానో మాటల్లో చెప్పలేను. జీవితంలో ఎన్నో వేధింపులకు మరణమే శాశ్వతం అనిపిస్తుంది. ” అంటూ రాసుకొచ్చింది. అయితే ఇండస్ట్రీలో స్టార్ డమ్ సంపాదించుకున్న సిల్క్ స్మిత చనిపోయినప్పుడు ఇండస్ట్రీ నుంచి ఏ ఒక్కరు వెళ్లలేదు. కేవలం హీరో అర్జున్ మాత్రమే వెళ్లారట. ఒక అనాథ శవంలా ఆమె అంత్యక్రియలు జరిపించారు.
Silk Smitha Bio Pic
అయితే తన సూసైడ్ నోట్‌లో బాబూ అంటూ ప్రస్తావించింది సిల్క్ స్మిత. మరి ఆ బాబు ఎవరనేది ఆసక్తికరం. ఆమెకి కొడుకు ఉన్నాడా? ఎవరినైనా పెంచుకుందా అనేది తెలియాల్సి ఉంది.
1996 సెప్టెంబర్ 22న ఈ సూసైడ్ నోట్ రాసింది సిల్క్ స్మిత్. 23న ఆమె మరణ వార్త బయటకు వచ్చింది. ఆమె జీవితంలో ఎంతగా కుంగిపోయిందో ఈ లెటర్‌ని చూస్తే అర్థమవుతుంది. మానసిక వేదనని వెల్లడించింది సిల్క్ స్మిత. నేడు ఆమె 64వ జయంతి.
1960 డిసెంబర్ 2న సిల్క్ స్మిత ఏలూరులోని కొవ్వలి విలేజ్‌లో పేదకుటుంబంలో జన్మించింది. చదివించే స్థోమత లేక స్కూల్ మధ్యలోనే మానేసింది. పూట గడవడం కోసం కూలి పనులు చేసింది. కొన్ని రోజులకు పెళ్లి కూడా చేశారు. కానీ భర్త నానా హింస పెట్టేవాడట. దీంతో ఆ జీవితాన్ని వదింలించుకుని చెన్నై వెళ్లిపోయింది. సినిమాల్లో పనిచేసే వారి కాళ్ల వేళ్లా పడి అవకాశాల కోసం ప్రయత్నించింది. ఎట్టకేలకు ఆఫర్లు దక్కించుకుని పని మనిషి పాత్రల నుంచి నెమ్మదిగా పెంచుకుంటూ హీరోయిన్‌గా మెప్పించింది. బోల్డ్ రోల్స్ తో ఆకట్టుకుంది.
read more: సిల్క్ స్మిత అసలు పేరు, వివాదాలు, డెత్ మిస్టరీ.
also read: అల్లు అర్జున్ టాప్ 5 సినిమాలు ఇవే