MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Devatha: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన కమల.. ఆనందంలో కుటుంబ సభ్యులు!

Devatha: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన కమల.. ఆనందంలో కుటుంబ సభ్యులు!

Devatha: బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. చెల్లి కోసం భర్తను త్యాగం చేసిన మహిళ కథతో ప్రేక్షకుల ముందు వచ్చింది. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు ఆగస్ట్ 18వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం... 

2 Min read
Author : Navya G
Published : Aug 18 2022, 02:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... ఆదిత్య అలా  మాట్లాడినందుకు భాష బాధపడుతూ కమలతో పటేలు ఏదో తప్పు చేస్తున్నారు అనిపిస్తుంది అని అంటాడు. అప్పుడు కమలా అలాగేమీ అయ్యుండదు నన్ను చూసుకోవడానికి మిమ్మల్ని ఇంట్లో ఉంచినట్టు ఉన్నారు అని అంటుంది. కానీ భాష మనసులో ఇంకా అనుమానం ఉంటుంది. ఆ తర్వాత సీన్లో దేవి అన్న మాటలను గుర్తు తెచ్చుకొని  రుక్మిణి, ఆదిత్య బాధపడుతూ ఉంటారు. మనం ఇంత కష్టపడి దేవి మనసు మార్పించింది ఇందుకా? మాధవ్ ఒక్క రోజులో మళ్లీ మొదటికి తీసుకొచ్చేశాడు.
 

26

దేవి మనసు మారినందుకు ఎంతో ఆనంద పడ్డాను కానీ అంతా మారిపోయింది అని రుక్మిణి అంటుంది.అప్పుడు ఆదిత్య, మనం ఏం చేసినా ఇంకొక సమస్యతో మళ్ళీ తిరిగి మన వైపు వస్తున్నాడు అని అంటాడు. రామ్మూర్తి గారి లాంటి మంచి మనిషికి అలాంటి కొడుకు ఎలా పుట్టాడో అని బాధపడుతూ ఉంటారు ఇద్దరు. నువ్వు భయపడోద్దు నీ భయమే వాడికి ధైర్యం ఇస్తుంది అని అంటాడు ఆదిత్య. నా భయం వాడి మీద కాదు పిల్లలు మనసుల్ని ఎక్కడ మార్చేస్తాడో అని అంటుంది రుక్మిణి.
 

36

మళ్లీ మాధవ్ ఏదో ఒకటి చేసే లోపల ఇవన్నీటికి పరిష్కారం ఆలోచించి దేవి మనసును ఎలాగైనా మార్చేలా చేయ పెనిమిటి అని రుక్మిణి ఆదిత్య కి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత సీన్లో కమలకి పురుడు నొప్పులు వచ్చి అక్కడ పడిపోయి అరుస్తూ ఉంటుంది.ఈ లోగ సత్యా దేవుడమ్మ భాషా అక్కడికి వచ్చి కమలని ఆసుపత్రికి తీసుకువెళ్తారు. బయట ఇంట్లో వాళ్ళందరూ కంగారు పడిపోతూ ఉంటారు. ఈలోగా కమల ఆడబిడ్డకు జన్మనిస్తుంది. ఇంట్లో వాళ్ళందరూ వెళ్లి చూసి సంబరపడిపోతూ ఉంటారు. అందరూ ఆ పాపని ఎత్తుకొని ఆడిస్తూ ఉంటారు.
 

46

ఆదిత్య అక్కడికి వచ్చి ఆ బిడ్డను చూసి ఎత్తుకొని ఆనందపడతాడు. అప్పుడు దేవుడమ్మ ఇంత కాలానికి మన ఇంట్లో పసిదాని కేరింతలు వినిపించబోతున్నాయి అని ఆనందపడుతూ ఉంటుంది. ఇది ఎప్పుడో పుట్టి ఉంటే మన ఇల్లు ఇప్పటికీ బిడ్డలతో కళకళలాడుతూ ఉండేది అని దేవుడమ్మ అనగా సత్య ఆదిత్యలు బాధపడతారు. అప్పుడు ఆదిత్య దేవి, మా నాయన ఎంత గలీసుడైన నాకు నాయనే కదా నాకు ఎలాగైనా మా నాయన కావాలి అని అన్న మాటలు గుర్తుతెచ్చుకొని బాధపడతాడు. ఆ తర్వాత సీన్లో సత్యా రుక్మిణికి ఫోన్ చేసి కమలక్క కి ఆడబిడ్డ పుట్టింది అని చెప్తుంది.
 

56

అప్పుడు రుక్మిణి చాలా ఆనంద పడిపోయి ఏ హాస్పిటల్ అని వివరాలని కనుక్కుంటుంది. వద్దాము అనుకోని లోపల తను రావడం కుదరదు అని విషయం గ్రహించి మొఖం మాడి చేస్తుంది రుక్మిణి.పిల్ల జాగ్రత్త అని ఫోన్ పెట్టేస్తుంది. తర్వాత ఈ విషయం భాగ్యమ్మకు చెప్తుంది. భాగ్యమ్మ ఎంతో ఆనందపడి నేను వెంటనే వెళ్లి చూసి వస్తాను అని అంటుంది. నాకు కూడా చూడాలని ఉంది అని రుక్మిణి అనగా సరే అని ఇద్దరు బయలుదేరుతారు. ఈలోగ అక్కడ హాస్పిటల్లో అందరూ ఆనందంగా మాట్లాడుకుంటే ఉంటారు. ఇంతటిలో భాగ్యమ్మ, రుక్మిణిని కిటికీ వైపు నుంచి వెళ్ళమని చెప్తుంది.
 

66

రుక్మిణి కిటికీలో నుంచి ఆ పాపని చూసి ఎంతో మురిసిపోతూ ఉంటుంది. ఇంతట్లో రుక్మిణి ఆ గది లోపలికి వెళ్తుంది. దేవుడమ్మ ఆ పాపతో మీ పిన్ని వచ్చింది చూడు అని ఆ బిడ్డని రుక్మిణి చేతిలో పెడుతుంది. అప్పుడు ఆ పాప ఏడుపు ఆపేస్తుంది. అప్పుడు దేవుడమ్మ మీ పిన్ని వచ్చిన వెంటనే నువ్వు ఏడుపాపేసావే అని అంటుంది.అందరూ రుక్మిణి రావడంతో సంతోషపడతారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Venkatesh: వెంకటేష్‌ కెరీర్‌ ని మార్చిన సంఘటన.. లవ్‌ స్టోరీస్‌ చేయడం వెనుక అసలు కథ ఇదే
Recommended image2
Dacoit Box Office: డెకాయిట్ 15 రోజుల కలెక్షన్లు, ఇంతగా పడిపోయిందా?.. అడవి శేష్‌కి గట్టి దెబ్బే
Recommended image3
100 Crore Club: బ్లాక్ బస్టర్ తో చిరంజీవి, ఫ్లాప్ తో ప్రభాస్..2026 లో 100 కోట్ల క్లబ్ లో చేరిన హీరోలు వీళ్ళే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved