MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • HBD Jr NTR: ఫ్యామిలీతో ఎన్టీఆర్ 5 క్యూట్ మూమెంట్స్.. ఇంట్లో ఎప్పటికీ అల్లరి రాముడే..

HBD Jr NTR: ఫ్యామిలీతో ఎన్టీఆర్ 5 క్యూట్ మూమెంట్స్.. ఇంట్లో ఎప్పటికీ అల్లరి రాముడే..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎంతటి అద్భుతమైన నటుడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎలాంటి పాత్రలో అయినా ఎన్టీఆర్ ఒదిగిపోయి నటిస్తాడు. అందుకే చాలా మంది దర్శకులు ఎన్టీఆర్ తో వర్క్ చేసేందుకు ఇష్టపడుతుంటారు.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : May 20 2022, 09:58 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎంతటి అద్భుతమైన నటుడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎలాంటి పాత్రలో అయినా ఎన్టీఆర్ ఒదిగిపోయి నటిస్తాడు. అందుకే చాలా మంది దర్శకులు ఎన్టీఆర్ తో వర్క్ చేసేందుకు ఇష్టపడుతుంటారు.ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఎన్టీఆర్ ప్రదర్శించిన నటన అసామాన్యమైనది. కొమరం భీముడిగా ఎన్టీఆర్ ఎమోషనల్ గా నటించిన విధానం అద్భుతం. 

27

వెండితెరపై ప్రత్యర్థులకు సింహస్వప్నంగా కనిపించే ఎన్టీఆర్ ఇంట్లో మాత్రం చాలా సౌమ్యంగా ఉంటూ అల్లరి రాముడిగా మారిపోతాడు. భార్య పిల్లలతో సరదాగా గడుపుతుంటాడు. నేడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన 39వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో ఉన్న 5 క్యూట్ మూమెంట్స్ మీ కోసం.. 

37

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు రెండవ కొడుకు పుట్టినప్పుడు తన ఫ్యామిలీతో కలసి బ్యూటిఫుల్ పిక్ షేర్ చేశాడు. భార్య లక్ష్మి ప్రణతి, పెద్ద కుమారుడు అభయ్ రామ్ లతో పాటు చిన్న కుమారుడి భార్గవ్ రామ్ ని చేతుల్లోకి తీసుకుని మురిసిపోతున్న ఎన్టీఆర్ ఫోటో చాలా క్యూట్ గా ఉంటుంది. 

47

భార్గవ్ రామ్ అల్లరి చేస్తూ తన ముఖంపై పంచ్ లు ఇస్తున్న క్యూట్ వీడియోని కూడా ఎన్టీఆర్ షేర్ చేశారు. భార్గవ్ కరాటే కిడ్ గా మారిపోయాడు అంటూ తన పెద్ద కొడుకు అల్లరి గురించి ఎన్టీఆర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. తన కొడుకు తనని కొడుతుంటే ఆపకుండా తారక్ ఎంజాయ్ చేస్తున్నాడు. అలాగే భార్గవ్ తో కలిసి కోపంగా చూస్తున్న పిక్ కూడా భలే క్యూట్ గా ఉంటుంది. 

57

అలాగే తన భార్యతో కలసి 8వ వెడ్డింగ్ యానవర్సరీ సందర్భంగా ఎన్టీఆర్ ఓ పిక్ ని షేర్ చేశాడు. చేతికి చిన్న గాయంతో ఆ ఫొటోలో ఎన్టీఆర్ కనిపిస్తున్నాడు. ఎన్టీఆర్, లక్ష్మి ప్రణతి అన్యోన్యత ఈ పిక్ లో చూడొచ్చు. 

67

తన కుమారులు ఇద్దరూ, భార్య లక్ష్మి ప్రణతితో కలసి ఎన్టీఆర్ తీసుకుని సెల్ఫీ ఆ మధ్యన సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ముఖ్యంగా ఎన్టీఆర్ చిన్న కొడుకు భార్గవ్ రామ్ క్యూట్ లుక్స్ సోషల్ మీడియాలో సెన్సేషనల్ గా మారాయి. ఈ బ్యూటిఫుల్ ఫ్యామిలీ పిక్ ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేశారు. 

77

ఎన్టీఆర్ వెకేషన్ కి వెళుతున్న సమయంలో తన కొడుకుకి ఫ్లైట్ లో కిస్ ఇస్తున్న పిక్ కూడా సోషల్ మీడియాలో వైరల్ ఐంది. ఎన్టీఆర్ ఎంత బిజీ స్టార్ అయినప్పటికీ ఇంట్లో మాత్రం అల్లరి రాముడిగానే ఉంటాడు. ఫ్యామిలీకి సమయం కేటాయిస్తాడు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో నటించబోతున్నారు. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రకటించారు. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Karthika Deepam 2 Today Episode:కార్తీక్, దీపలపై దశరథ ఫైర్-కార్తీక్ ఎమోషనల్-చావు బ్రతుకుల్లో సుమిత్ర
Recommended image2
Jabardasth Naresh Remuneration: జబర్దస్త్ నరేష్‌ ఈవెంట్‌కి తీసుకునే పారితోషికం ఎంతో తెలుసా? చాలా ఖరీదైన కమెడియన్‌
Recommended image3
అల్లు శిరీష్ 'పెళ్లి కొడుకు వేడుక'లో విజయ్, రష్మిక సందడి..రాంచరణ్ తో పాటు ఇతర కుటుంబ సభ్యులు, వైరల్ ఫోటోస్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved