MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • టీజర్ తో ట్రోలింగ్ పటాపంచలు.. ప్రభాస్ 'Kalki 2898 AD' గ్లింప్స్ లో ఇవి గమనించారా, నిజంగా క్రేజీ..

టీజర్ తో ట్రోలింగ్ పటాపంచలు.. ప్రభాస్ 'Kalki 2898 AD' గ్లింప్స్ లో ఇవి గమనించారా, నిజంగా క్రేజీ..

ప్రాజెక్ట్ కె అసలు టైటిల్ రివీల్ చేస్తూ అదిరిపోయే గ్లింప్స్ వదిలారు. ఈ గ్లింప్స్ తో ట్రోలింగ్ మొత్తం పటాపంచలు అయింది అని చెప్పొచ్చు.

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Jul 21 2023, 11:55 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ప్రాజెక్ట్ కె. బాహుబలి తర్వాత ప్రభాస్ నుంచి వచ్చిన ఏ చిత్రమూ మెప్పించలేకపోయింది. సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్ ఇలా ప్రతి మూవీ ఆరంభంలో అంచనాలు పెంచడం ఆ తర్వాత చతికలబడడం జరుగుతూ వచ్చింది. కానీ ప్రభాస్ ఫ్యాన్స్ అంతా డైరెక్టర్ నాగ అశ్విన్ పై నమ్మకంతో ఉన్నారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27

కానీ బుధవారం రిలీజైన ఫస్ట్ లుక్ తో ఊహించని విధంగా ట్రోలింగ్ మొదలైంది. ప్రిస్ట్ లుక్ లో ప్రభాస్ ని సూపర్ హీరోగా చూపించే ప్రయత్నం బెడిసికొట్టింది. ప్రభాస్ హెయిర్ స్టైల్, కాస్ట్యూమ్స్ ఏమాత్రం ఆకట్టుకోలేదు. ఫలితంగా దర్శకుడు నాగ్ అశ్విన్ తీవ్రంగా ట్రోలింగ్ కి గురయ్యాడు. దీనితో సినిమా అవుట్ పుట్ ఎలా ఉంటుంది అనే అనుమానాలు మొదలయ్యాయి. అయితే ఈ తెల్లవారు జామున ప్రాజెక్ట్ కె అసలు టైటిల్ రివీల్ చేస్తూ అదిరిపోయే గ్లింప్స్ వదిలారు. 

37

ఈ గ్లింప్స్ తో ట్రోలింగ్ మొత్తం పటాపంచలు అయింది అని చెప్పొచ్చు. నాగ అశ్విన్ చాలా గ్రాండ్ గా, చక్కగా ఈ చిత్రాన్ని డీల్ చేస్తున్నారని టీజర్ తో అర్థం అయింది. చూస్తుంటే సైన్స్ ఫిక్షన్ కథాంశం లా అనిపిస్తోంది. టీజర్ ని క్షుణ్ణంగా గమనిస్తే అనేక ఆసక్తికర అంశాలు ఉన్నాయి.ఈ చిత్రానికి 'కల్కి 2898 ఎడి' అనే టైటిల్ ఖరారు చేసారు. 

47

కల్కి అంటే కలియుగంలో మానవుని రక్షించడానికి వచ్చే శ్రీ మహావిష్ణువు అవతారం అని మనం పురాణాల్లో చదువుకున్నాం. ఫ్యూచర్ లో మానవుని రక్షించేందుకు ప్రభాస్ కల్కి అనే ప్రాజెక్టు చేపట్టాబోతున్నాడు. మానవజాతికి వచ్చిన ముప్పు ఏంటి అనేది ఆ ఇందులో రివీల్ చేయలేదు. అయితే ఈ చిత్రంలో నాగ అశ్విన్ హిందూ దైవాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చినట్లు అర్థం అవుతోంది. 

57

టీజర్ ఆరంభంలో పద్మాకారంలో ఒక వస్తువు కనిపిస్తుంది. ఒక వ్యక్తి తన చేతుల్లోకి ఆంజనేయ చిన్న విగ్రహం తీసుకోగా అతడి చేతులు వణుకుతాయి. అంటే ఆంజనేయ స్వామి శక్తిని ఈ చిత్రంలో చూపించబోతున్నారు. ఆకాశం నుంచి ఒక భారీ వింత చేయి నేలపై పడుతుంది. ఇదివరకే దాని పోస్టర్స్ కూడా రిలీజ్ చేశారు. అది శ్రీ మహావిష్ణవు చేయి అని పుకార్లు కూడా ఉన్నాయి. 

67

అలాగే టీజర్ లో శివలింగాన్ని కూడా చూపించారు. అక్కడికి ఒక వ్యక్తి ఏదో వెతుక్కుంటూ వస్తాడు. అలాగే పోరాట సన్నివేశాల్లో నాగ అశ్విన్ నటీనటుల చేత ఉపయోగిస్తున్న వెపన్స్ కూడా  విభిన్నంగా ఉన్నాయి. ప్రభాస్ లుక్స్ కూడా అదిరిపోయాయి. ప్రభాస్ తన చేతికి కవచం ధరించి ఉండగా దానిని ఆపరేట్ చేస్తాడు. సుదర్శన చక్రం ఆకారంలో ఉన్న ఆయుధం వస్తుంది. ఇవన్నీ టీజర్ లో ఆసక్తిని రేపుతున్న అంశాలు. 

77

నాగ అశ్విన్ ఫుల్ క్లారిటీ తో పక్కా ప్రణాళికతో కల్కి 2898 ఎడి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు అర్థం అవుతోంది. ఫస్ట్ లుక్ తో వచ్చిన ట్రోలింగ్ మొత్తం టీజర్ తో తొలగిపోయినట్లే. 

About the Author

SG
Sreeharsha Gopagani
నాగ్ అశ్విన్
ప్రభాస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌తో చివరి సినిమా.. బ్యానర్ ను క్లోజ్ చేయబోతున్న నిర్మాత ఎవరో తెలుసా?
Recommended image2
Peddi: రామ్ చరణ్‌కు నేషనల్ అవార్డ్ పక్కా.. పెద్దిలో నటనపై శివరాజ్‌కుమార్ జోస్యం
Recommended image3
Khushbu: నటుడు ప్రభుతో పెళ్లి, విడాకులపై ఖుష్బూ రియాక్షన్‌ ఇదే.. సింపుల్‌గా తేల్చేసిన హీరోయిన్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved