MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • Guppedantha Manasu: వసుధారకి వార్నింగ్ ఇచ్చిన దేవయాని.. రిషి మాటలకి బాధ పడుతున్న మహేంద్ర!

Guppedantha Manasu: వసుధారకి వార్నింగ్ ఇచ్చిన దేవయాని.. రిషి మాటలకి బాధ పడుతున్న మహేంద్ర!

Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు సెప్టెంబర్ 17వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం...  

4 Min read
Author : Navya G
Published : Sep 19 2022, 10:01 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... వసు,జరిగిన విషయం అంతా గుర్తుతెచ్చుకుంటూ,ఇందాక సార్ అలా అన్నా సరే,నేను తిరిగి జవాబు ఇచ్చే అవకాశం నాకు దొరకలేదు ఇప్పుడే వెళ్లి సార్ కి నిజం చెప్పాలి అని బయలుదేరుతూ ఉండగా దేవయాని గదిలోకి వచ్చి తలుపు వేస్తుంది. ఏం వసుధార, ఎక్కడికో బయలుదేరినట్టు ఉన్నావు కూర్చో మాట్లాడాలి అని చెప్పి,చాలా బాధగా ఉన్నట్టున్నావు! ప్రతిదానికి టైం ఉంటుంది వసుధార. ఈ టైం నీదైతే తర్వాత టైం నాది. ఇప్పుడు నా టైం నడుస్తుంది అని అనగా అవును మేడం మీరే చెప్పారు కదా టైం ఒకసారి ఒక దగ్గర ఉంటుంది అని ఏది శాశ్వతం కాదు అని అంటుంది వసు.నీకు ఇంకా నమ్మకం ఉందా వసుధార అని అనగా, ఉంది మేడం అని అంటుంది వసు. అప్పుడు దేవయాని నవ్వుతూ, నువ్వు తెలివైన దానివని, యూనివర్సిటీ టాపర్ అని నాకు తెలుసు వసుధార. లోపల ఎంత బాధగా ఉన్నా బయట చాలా ధైర్యంగా బాగా నటిస్తున్నావు  అయినా రిషి మనసులో స్థానం సంపాదించుకున్నావు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

జగతిని ఇంట్లో తీసుకొచ్చావు, జగతి చేత రిషిని పేరు పెట్టి పిలిపించావు, ఇప్పుడు అమ్మ అని పిలిపించాలనుకుంటున్నావా? ఈ ఇంట్లో, వాళ్ళిద్దరూ తల్లి కొడుకులలా తిరిగితే నేను చూసి తట్టుకుంటాను అనుకుంటున్నావా! నేను అది జరగనివ్వను వసుధార అడ్డుకుంటాను. అయినా రిషి స్వభావం నాకు తెలుసు కదా ఇంకా నీ జోలికి కూడా రాడు అని అంటుంది దేవయాని. అప్పుడు వసు, సార్ తప్పుగా ఆలోచించడం లేదు తప్పుగా ఆలోచించేలా మీరు చేస్తున్నారు.ఎవరు స్వభావం వాళ్లకి ఉంటుంది. తెల్ల గోడ మీద నల్ల మచ్చ ఉన్నంత మాత్రాన ప్రతి ఒక్కరూ మీలా నల్లమచ్చని చూడరు మేడం, స్వచ్ఛమైన ప్రేమను కూడా చూస్తారు అని అంటుంది. అప్పుడు దేవయాని, నేను మనుషుల్ని చదివాను వసుధార. అయినా సరే నువ్వు రిషిని తక్కువ అంచనా వేసావు కదా అని అనగా, నేను తక్కువ అంచనా వేశాను మేడం కానీ సార్ మీద కాదు,మీ మీద.

37

 ఆరోజు మీరు రెస్టారెంట్ కి వచ్చి పెళ్లిరోజు జరిపిద్దాం అన్నప్పుడే నేను అర్థం చేసుకోవాల్సింది దాని వెనుక తల ఇంత రాక్షసత్వం ఉంటుంది అని. అక్కడ మిమ్మల్ని తక్కువ అంచనా వేశాను అని అంటుంది వసుధార. అప్పుడు దేవయాని, నువ్వు ఇక ఏమన్నా సరే రిషికి జగతికి, నీకు రిషికి మధ్య గోడలు కట్టేశాను ఇంకా ఎవరు దాన్ని మార్చలేరు అని అనగా, గోడలు కట్టినంత మాత్రాన ప్రేమ ఆగిపోతుంది అని మీరు అనుకుంటున్నారా మేడం, ప్రేమ గాలి లాంటిది దాన్ని ఎవరు ఆపలేరు అని అంటుంది వసుదారం అప్పుడు దేవయాని, ప్రేమ గాలి లాంటిది ఉండొచ్చు కానీ రిషి మాత్రం ఇప్పుడు అగ్నిపర్వతంలా ఉంటాడు.నీ మీద కోపంతో ఉప్పొంగుతున్నాడు అని అంటుంది.అప్పుడు వసు, ఈ క్షణం సార్ నా మీద కోపంతో ఉండవచ్చు కానీ అది శాశ్వతం కాదు అయినా మీరు ఇంత కథ నడిపిస్తున్నారని,మీ అసలు స్వరూపం సార్ కి తెలిస్తే మీ పరిస్థితి ఏంటో ఆలోచించుకున్నారా!

47

ఈ ఇంట్లో మీకు దక్కే స్థానం ఏంటో ఆలోచించుకున్నారా అని అంటుంది వసుధార. అప్పుడు దేవయాని,నా స్థానం తర్వాత వసుధార. ఇప్పుడు రిషి మనసులోని స్థానం ఏంటో తెలుసా నేను చూపిస్తా ఆగు అని వసు ఫోన్ తీసుకొని రిషికి ఫోన్ చేస్తుంది దేవయాని. అప్పుడు రిషి కాల్ కట్ చేసి, ఫోన్ స్విచాఫ్ చేసేస్తాడు. అప్పుడు దేవయాని నవ్వుతూ, చూసావా ఇది అసలైన సంగటి అని అనగా ఎప్పటికైనా సర్ కి నిజం తెలుస్తుంది మేడం అని అంటుంది వసు. అది భవిష్యత్తు వసుధార ఇప్పుడు కాదు. రిషి నిన్ను మెడ పట్టుకు బయటకు గెంటెయ్యక ముందే మర్యాదగా నువ్వు వెళ్ళిపో. ఇంక ఉంటానే గుడ్ నైట్ అని వెళ్ళిపోతుంది దేవయాని. ఆ తర్వాత సీన్లో జరిగిన విషయం అంత రిషి గుర్తుతెచ్చుకుంటూ, అంటే ఇన్ని రోజులు వసుధార చేసినదంతా అబద్ధమా? తన ప్రేమ అంతా మాయ? నేనొక్కడినే ప్రేమించానా? తను నన్ను తిరిగి ప్రేమించలేదా? తను ఇన్నినాలు నాతో నటించిందంతా గురుదక్షిణ కోసమేనా అని బాధపడుతూ ఉండగా మహీంద్రా అక్కడికి వస్తాడు.
 

57

అప్పుడు రిషి వెళ్ళిపోండి డాడ్ నాకు ఒంటరిగా ఉండాలని ఉంది అని అనగా, ఇప్పుడు నీకు కావాల్సింది ఒంటరితనం కాదు రుషి జరిగిన దానికి సమాధానం అని అనగా, నాకు బాగా సమాధానం చెప్పారు డాడ్ నాకు ఇంకేం వినాలని లేదు వెళ్లిపోండి నన్ను ఒంటరిగా ఉండనివ్వండి అని అంటాడు. నా మాట విను రిషి అని మహేంద్ర అనగా, మీరేం చెప్తారో నాకు తెలుసు డాడ్ మీ పథకం ప్రకారం వసుధారని నా మీద ప్రయోగించారా అని అంటాడు రిషి.ఏం మాట్లాడుతున్నావ్ రిషి అని మహేంద్ర అనగా, నా దగ్గర నుంచి ఇంకా ఎక్కువ మాటలు వస్తాయి డాడ్, నాకు ఉప్పెనంత కోపం ఉంటది అంటారు.ఆ కోపం అంతా ఇప్పుడు చూపించాలని ఉన్నది. నా వెనకాతలు ఇంత జరిగిందా! ఇద్దరు కలవడానికి మరో ఇద్దరు కలిసినట్టు నటించడం అవసరమా అని రిషి అనగా నటన ఏమీ లేదు రిషి అని అంటాడు మహేంద్ర. కనిపిస్తుంది కదా డాడ్ మనిద్దరి బంధం గురించి, మనిద్దరి స్నేహం గురించి,నేను ఎన్నో అనుకున్నాను.

67

జీవితంలో ఎన్ని మారినా మీ మనిద్దరి స్నేహం మారదు అని అనుకున్నాను.ఎవరూ దూరమైనా మీరు నాతోనే ఉంటారు అని అనుకున్నాను, ఆఖరికి మీరు ఇలా చేశారు అని రిషి అంటాడు. అప్పుడు మహేంద్ర, కొన్నిటి కోసం కొన్నిటిని వదులుకోవాలి రిషి అని అనగా, అంటే మీరు ఒప్పుకుంటున్నారా! అయినా పెద్ద చేప కోసం చిన్న చేపని వాడుకుంటున్నట్లు నన్ను బాగా వాడుకున్నారు అని అంటాడు రిషి. నేను ఏం చెప్పాలనుకుంటున్నానో కూడా వినవా రిషి అని మహేంద్ర అనగా, విన్నవాటికి ఇంత భారం మోయాల్సి వస్తుంది,వినని వాటికి ఇంకెంత బాధ వస్తుందో అని అంటాడు రిషి. మహేంద్ర మాట్లాడుదామని ప్రయత్నించగా రిషి ఇంక బయటికి వెళ్ళండి అని తలుపు వైపు చేయి చూపిస్తాడు. అప్పుడు మహేంద్ర బాధపడకు వెళ్తూ ఉండగా, నాకు మనుషుల స్వార్థాలు అర్థమయ్యాయి డాడీ కానీ మీ ప్రేమలో కూడా స్వార్థం ఉంటుంది అని అనుకోలేదు అని అంటాడు రిషి. 

77

ఆ మాటతో మహీంద్రా బాధపడుతూ ఏడుచుకుంటూ కిందకు వెళ్ళగా వసుధార కనిపిస్తుంది. కంట్లో నలగ పడిందని కళ్ళు తుడుచుకుంటూ వెళ్లిపోతాడు మహేంద్ర. నలక మీ కళ్ళల్లో కాదు సార్ గుండెల్లో పడిందని నాకు తెలుసు అని అనుకుంటుంది వసుధార. అప్పుడు మహేంద్ర సోఫాలో కూర్చొని బాధపడుతూ ఉండగా, జగతి అక్కడికి వస్తుంది. జగతి, మహీంద్ర నీ ఓదార్చుతూ ఉండగా, నాకు మాట్లాడే అవకాశం కూడా రిషి  లేదు అని జగతి భుజం మీద పడుకుంటూ ఏడుస్తాడు మహేంద్ర. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

About the Author

NG
Navya G
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Varanasi Update: మహేష్‌ `వారణాసి` నుంచి అదిరిపోయే అప్‌ డేట్‌.. అప్పట్నుంచే అసలైన పండగ షురూ
Recommended image2
Bigg Boss 10: బిగ్ బాస్ నుంచి బయటకొచ్చి షాకింగ్ కామెంట్స్ చేసిన నటుడు కృష్ణుడు.. మరో రచ్చ
Recommended image3
Medha Meka: శ్రీకాంత్‌ కూతురు మేద ఏం చదువుతుందో తెలుసా? ఎవరికీ తెలియని టాలెంట్‌.. రహస్యాలు రివీల్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved