Varanasi Update: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న 'వారణాసి' సినిమా షూటింగ్ 90 శాతం పూర్తయిందనే వార్త ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇటీవల కార్తికేయ ఈ విషయం చెప్పిన విషయం తెలిసిందే.

మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ 'వారణాసి' గురించి రోజూ ఏదో ఒక వార్త చక్కర్లు కొడుతూనే ఉంది. అసలు షూటింగ్ ఎంత వరకు వచ్చింది? ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉంది? నిజంగానే 90 శాతం షూటింగ్ పూర్తయిందా? అని అభిమానులు తెగ చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలోనే సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.

90 శాతం షూటింగ్ కంప్లీట్?

'గుంటూరు కారం' తర్వాత మహేష్ బాబు తన ఫోకస్ అంతా 'వారణాసి' సినిమా పైనే పెట్టారు. అటు జక్కన్న కూడా ఈ సినిమా షూటింగ్‌ను జెట్ స్పీడ్‌లో లాగించేస్తున్నారట. ఒకపక్క ప్రమోషన్స్ చూసుకుంటూనే, మరోపక్క షూటింగ్‌ను పర్ఫెక్ట్‌గా బ్యాలెన్స్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి 90 శాతం షూటింగ్ పూర్తయిందని, చిన్నచిన్న ప్యాచ్ వర్క్స్ అన్నీ అక్టోబర్ నాటికి కంప్లీట్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అనుకున్న టైమ్ కంటే ముందే టాకీ పార్ట్ కంప్లీట్ చేస్తున్నారట. ఈ విషయాన్ని ఇటీవల కార్తికేయ చెప్పారు.

ఐమ్యాక్స్ (IMAX) ఫార్మాట్‌లోనూ షూటింగ్ పూర్తి!

'వారణాసి' సినిమాకు సంబంధించి ఐమ్యాక్స్ ఫార్మాట్ షూటింగ్ కూడా పూర్తయిందని రాజమౌళి రీసెంట్‌గా చెప్పారు. ఐమ్యాక్స్ కెమెరాలకు తగ్గట్టుగా షూటింగ్‌లో చిన్నచిన్న మార్పులు చేశారట కానీ, కథలో ఎలాంటి చేర్పులు చేయలేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాను ఐమ్యాక్స్, సినిమాస్కోప్ (CinemaScope) రెండు ఫార్మాట్లలోనూ బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చేలా అనామార్ఫిక్ ఫ్రేమింగ్ (Anamorphic framing) టెక్నాలజీ వాడుతున్నట్లు జక్కన్న చెప్పారు.

అనామార్ఫిక్ ఫ్రేమింగ్ అంటే ఏంటి?

సినిమాను వేర్వేరు స్క్రీన్లలో చూపిస్తున్నప్పుడు విజువల్స్, ఇమేజ్ క్వాలిటీ దెబ్బతినకుండా ఉండేందుకు వాడే టెక్నిక్‌నే అనామార్ఫిక్ ఫ్రేమింగ్ అంటారు. ఈ టెక్నాలజీని అర్థం చేసుకోవడానికి మొదట్లో కాస్త టైమ్ పట్టినా, ఆ తర్వాత అంతా సెట్ అయిపోయిందని రాజమౌళి చెప్పుకొచ్చారు.

త్వరలోనే డబ్బింగ్ షురూ!

'వారణాసి' సినిమా డబ్బింగ్ పనులు కూడా త్వరలోనే స్టార్ట్ కానున్నాయట. షూటింగ్, ప్రమోషన్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ ఒకేసారి ప్లాన్ చేసుకుంటూ చిత్రయూనిట్ ముందుకు వెళ్తోంది. గతంలో అనౌన్స్ చేసినట్లుగానే 2027 ఏప్రిల్ 7న 'వారణాసి' సినిమాను రిలీజ్ చేస్తామని రాజమౌళి మరోసారి క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. మహేష్ బాబు సరికొత్త గెటప్, రాజమౌళి మార్క్ మేకింగ్, లేటెస్ట్ టెక్నాలజీతో వస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక నవంబర్ నుంచి గానీ, డిసెంబర్ నుంచీగానీ వరుసగా ప్రమోషన్స్ స్టార్ట్ చేయనున్నారట. ఆ తర్వాత వరుసగా అప్‌డేట్‌ లు ఇవ్వబోతున్నారట. కంటిన్యూగా ఇండియన్‌ ఆడియెన్స్ `వారణాసి` ప్రపంచంలోకి మునిగిపోయిలే ఈ ప్రమోషన్‌ చేయబోతున్నట్టు తెలుస్తోంది. జతీయంగానే కాకుండా, అంతర్జాతీయంగానూ భారీస్థాయిలో ప్రమోట్‌ చేయబోతున్నారట.